SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

జగిత్యాల జిల్లాలో పెరిగిన చలి తీవ్రత.. అత్యల్పంగా 15.5 డిగ్రీల ఉష్ణోగ్రత!

Jagtial Weather Update: జగిత్యాల జిల్లాలో చలి తీవ్రత రోజుకు పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా కొన్ని గ్రామాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు కూడా నమోదు అవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ముఖ్యంగా ఉదయం పూట చాలామంది చలి కారణంగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఏయే ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Written By Dharmaraju Dhurishetty
Published: Oct 25, 2026, 11:50 AM IST | Updated: Oct 25, 2026, 11:51 AM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Jagtial Weather Update In Telugu: జగిత్యాల జిల్లాలో క్రమంగా శీతల ప్రభావం బలపడుతూ వస్తుంది. గత కొద్దిరోజులుగా రాత్రి తో పాటు తెల్లవారుజాము సమయాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత ఒక్కసారిగా పెరుగుతూ వస్తోంది. సాయంత్రం 6 నుంచి శీతల గాలులు వీస్తుండడం.. అర్ధరాత్రి దాటిన తర్వాత చలి తీవ్రత మరింత అధికమవుతోంది.. ముఖ్యంగా గ్రామీణ, అటవీ సమీప ప్రాంతంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు గజగజా వణికి పోతున్నారు..

జిల్లావ్యాప్తంగా నమోదైన వివరాల ప్రకారం గోవిందారంలో అత్యల్పంగా 15.5 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయి జిల్లాలోనే అత్యంత చల్లని ప్రాంతంగా నిలిచింది.. పలు మండల కేంద్రాలు, గ్రామాల్లోనూ రాత్రి ఉష్ణోగ్రతలు 15 నుండి 17 డిగ్రీల పడిపోవడంతో ప్రజలు తీవ్రమైన చలి బారిన పడుతున్నారు..

ఇక ప్రాంతాలవారీగా నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతల వివరాల్లోకి వెళ్తే.. గోవిందారం: 15.5 డిగ్రీల సెల్సియస్, నేరెల్ల: 15.8 డిగ్రీల సెల్సియస్, సారంగాపూర్: 16.2 డిగ్రీల సెల్సియస్, పెగడపల్లి, ఐలాపూర్, మల్లాపూర్, మేడిపల్లి: 16.3 డిగ్రీల సెల్సియస్, మద్దుట్ల: 16.4 డిగ్రీల సెల్సియస్, మల్యాల, తిరుమాలాపూర్: 16.5 డిగ్రీల సెల్సియస్, పొలాస, పూడూర్: 16.6 డిగ్రీల సెల్సియస్, జగిత్యాల పట్టణం: 16.8 డిగ్రీల సెల్సియస్, కొల్వాయి: 17.0 డిగ్రీల సెల్సియస్, కోరుట్ల, రాఘవపేట, రాయికల్: 17.2 డిగ్రీల సెల్సియస్, గుల్లకోట: 17.5 డిగ్రీల సెల్సియస్, గోదూరు: 17.7 డిగ్రీల సెల్సియస్, సిరికొండ, ఎండపల్లి, వెల్గటూర్: 17.8 డిగ్రీల సెల్సియస్

ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో తెల్లవారుజామున చిరు వ్యాపారస్తులతో పాటు కూరగాయలను విక్రయించే వారు, ఉపాధి పనులకు వెళ్లే కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా పొగ మంచు దట్టంగా కురుస్తుండడంతో ప్రధాన రహదారులపై వాహనదారులు ఉదయం సమయంలో హెడ్లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ వస్తున్నాయి. పల్లెల్లో ప్రజలు చలి నుంచి రక్షణ పొందేందుకు ఉదయం, సాయంత్రం సమయాల్లో చలిమంటల వద్దకు చేరుకుంటున్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతాల్లో స్వెటర్ల వినియోగం కూడా విపరీతంగా పెరుగుతూ వచ్చింది..

ముఖ్యంగా వృద్ధులతో పాటు చిన్న పిల్లలు.. ఆస్తమా వంటి శ్వాస కోస ఇబ్బందులతో బాధపడేవారు ఈ సమయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తీవ్రమైన చలి కారణంగా అనారోగ్య సమస్యల భారిన పడే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తూ వస్తున్నారు. తెల్లవారుజామున, ముఖ్యంగా రాత్రి సమయాల్లో బయటకు వచ్చేటప్పుడు తప్పకుండా ఉన్ని దుస్తులు ధరించాలని.. గోరువెచ్చని నీటిని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి..
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES