• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /కరీంనగర్
  • /KCR Attendant Dies: రోడ్డు ప్రమాదంలో కేసీఆర్ అటెండర్ మృతి.. గులాబీ బాస్ తీవ్ర దిగ్భ్రాంతి.. ఆదుకుంటామని భరోసా.!.

KCR Attendant Dies: రోడ్డు ప్రమాదంలో కేసీఆర్ అటెండర్ మృతి.. గులాబీ బాస్ తీవ్ర దిగ్భ్రాంతి.. ఆదుకుంటామని భరోసా.!.

Kcr Attendant dies in road accident: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్ పై ప్రయాణిస్తున్న మణికుమార్ రెడ్డిని వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఆయన రోడ్డుపై పడి స్పాట్ లోనే చనిపోయాడు. మృతుడు కేసీఆర్ వద్ద అటెండర్ గా పనిచేస్తున్నాడు. దీంతో గులాబీ అధినేత భావోద్వేగంకు గురయ్యాడు.

Written ByInamdar Paresh
Published: Nov 24, 2026, 13:24 IST|Updated: Nov 24, 2026, 13:39 IST
joinshare
KCR Attendant Dies: రోడ్డు ప్రమాదంలో కేసీఆర్ అటెండర్ మృతి.. గులాబీ బాస్ తీవ్ర దిగ్భ్రాంతి.. ఆదుకుంటామని భరోసా.!.
Image Credit: Kcr Attendant dies in road accident

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
రైలు ప్రయాణంలో లోయర్ బెర్త్ కావాలా? టికెట్ బుక్ చేసే ముందు ఈ 4 సెట్టింగ్స్ మార్చండి.. కన్ఫామ్‌గా వస్తుంది!

రైలు ప్రయాణంలో లోయర్ బెర్త్ కావాలా? టికెట్ బుక్ చేసే ముందు ఈ 4 సెట్టింగ్స్ మార్చండి.. కన్ఫామ్‌గా వస్తుంది!

2

Karnataka: బెంగళూరులో ఘోరం.. లాడ్జీలో ప్రియుడితో గొడవ.. మూడో అంతస్తునుంచి పడి యువతి మృతి..

3

ఆడేవడన్న.. ఈడేవడన్న.. వైభవ్ సూర్యవంశీకి అడ్డవేడన్న.. 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ..!

4

Vaibhav Sooryavanshi: బుడ్డోడు చితక్కొట్టాడు.. 28 బంతుల్లోనే సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డు..!

5

Road Accident: ఏపీలో ఘోర ప్రమాదాలు- 8 మంది మృతి.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Kcr Personal attendant dies in rajanna sircilla road accident: మాజీ సీఎం కేసీఆర్ వద్ద అటెండర్ గా పనిచేస్తున్న మణికుమార్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ ఘటనలో గులాబీ బాస్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.  ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో నిన్న రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా బందనకల్ గ్రామ సమీపంలోని హనుమాన్ నగర్ చౌరస్తా వద్ద మణికుమార్ బైక్ పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ఇసుక లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న కేసీఆర్ అటెండర్ తో పాటు మరో యువకుడు రోడ్డుపై పడ్డారు. 

ఇద్దరి తలకు తీవ్రగాయాలయ్యాయి. కేసీఆర్ అటెండర్  మణికుమార్ రెడ్డి స్పాట్ లోనే దుర్మరణం చెందారు. తీవ్రగాయాలపాలైన మరో వ్యక్తి భరత్ ను  ఆస్పత్రికి తరలించగా ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. మణికుమార్ రెడ్డి మృతి వార్త తెలుసుకున్న మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం  చేశారు. 

వెంటనే ముస్తాబాద్ మాజీ ఎంపీపీ జనగామ శరత్ రావుతో ఫోన్‌లో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, వారిని ఆదుకుంటామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. 

మణికుమార్ గత కొన్ని రోజులుగా ఎర్రవల్లిలో ఉంటూ తమ కుటుంబంలో ఒకరిగా కలిసి పోయారని కేసీఆర్ సతీమణి శొభ సైతం ఎమోషనల్ అయ్యారు. ఆయన అకాల మరణం ఎంతగానో కలిచి వేసిందన్నారు. మణికుమార్ అంత్యక్రియల్ని దగ్గరుండి చూసుకొవాలని మాజీ ఎంపీ సంతోష్ కుమార్, ముస్తాబాద్  మాజీ జెడ్పీటీసీకి కేసీఆర్ సూచించారు.

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
KCR
Telugu News