కొండగట్టు ఆలయంలో భారీ స్కామ్.. రూ.23 కోట్ల నిధులు స్వాహా..!!
Kondagattu Temple Scam: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారి దేవస్థానంలో భారీ స్థాయిలో నిధులు దుర్వినియోగమైనట్లు ఆరోపణలు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆలయానికి సంబంధించి సుమారు రూ.23 కోట్ల మేర ఆర్థిక అవకతవకలు జరిగినట్లు అధికారిక ఆడిట్ నివేదికలోనే స్పష్టమైంది.
Kondagattu Temple Scam: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారి దేవస్థానంలో భారీ స్థాయిలో నిధులు దుర్వినియోగమైనట్లు ఆరోపణలు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆలయానికి సంబంధించి సుమారు రూ.23 కోట్ల మేర ఆర్థిక అవకతవకలు జరిగినట్లు అధికారిక ఆడిట్ నివేదికలోనే స్పష్టమైంది. అయితే.. ఇంతటి భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చినప్పటికీ.. ఈ వ్యవహారంపై ఏళ్ల తరబడి విచారణ నత్తనడకన సాగుతుండటంపై భక్తులు, స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్వామివారి నిధులను పక్కదారి పట్టించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంలో జాప్యం జరగడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
2013-14 నుంచి 2017-18 మధ్య కాలంలో జరిగిన ఆడిట్ లో ఈ భారీ వ్యత్యాసాలు బయటకు వచ్చాయి. తొలుత రూ. 2.26 కోట్లుగా ఉన్న అభ్యంతరాలు.. తర్వాతి ఆడిట్లో రూ. 23కోట్లకు చేరినట్లు సమాచారం. హుండీ ద్వారా వచ్చిన డబ్బులు, ఆర్జిత సేవల టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయం పూర్తిగా ఖజానాకు జమ కాలేదని.. ప్రసాదాల తయారీకి కొనుగోలు చేసిన సరుకుల లెక్కల్లోనూ భారీ తేడాలు ఉన్నాయని ఆడిట్ విభాగం తెలిపింది. ఈ నిధుల దుర్వినియోగానికి ఆలయ ఉద్యోగులే బాధ్యులంటూ తేల్చి చెప్పింది.
2022లో.. అప్పటి ఆలయ ఈఓ ఈ అవకతవకలపై విచారణ జరపాలని ఉన్నతాధికారులకు లేఖ రాశారు. అంతేకాకుండా.. అదే సంవత్సరం ఆగస్టులో, వేములవాడ ఆలయ ఈఓను విచారణ అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2025లో రెండవ ఉత్తర్వు జారీ చేసినప్పటికీ, విచారణలో అంగుళం కూడా పురోగతి లేదు. ఇటీవల కొత్తగా వచ్చిన ఒక ఉద్యోగి ఆ ఫైల్‌ను గుర్తించి, తిరిగి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.
గమనించదగ్గ విషయం ఏమిటంటే.. విచారణ చాలా నెమ్మదిగా సాగుతున్న సమయంలో, ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంతమంది ఉద్యోగులకు పదోన్నతులు లభించి, ఇతర ఆలయాలకు బదిలీ అయ్యారు. మరికొందరిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే వారు పదవీ విరమణ చేశారు. దేవాదాయ శాఖలోని కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగా విచారణను ఆలస్యం చేస్తున్నారని, అవినీతిపరులను రక్షిస్తున్నారని బలమైన ఆరోపణలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా.. గత ఆగస్టులో, అదే ఆలయంలో రూ. 49.29 లక్షల నిధుల దుర్వినియోగంపై నలుగురు ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఒకరిని ఉద్యోగం నుండి తొలగించగా, ముగ్గురి ఇంక్రిమెంట్లను నిలిపివేశారు. ఇప్పుడు, 60 సంవత్సరాల తర్వాత నవంబర్ 16 నుండి ఆలయంలో చారిత్రాత్మక గంధపు పండుగ జరుగుతున్న తరుణంలో.. ఈ భారీ కుంభకోణం మళ్లీ వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది.
Also Read:
ఓపీఎస్ కోసం కదం తొక్కనున్న ఉద్యోగులు.. 17న సామూహిక సెలవు..!!