SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఈ దీపావళికి ఇంట్లోనే ఈజీగా జ్యూసీ బూంది లడ్డు చేయండిలా.. రెసిపీ ఇగో..!!

Boondi Lddoos : పండుగలు, పెళ్లిళ్లు, ఏవైనా శుభకార్యాలు వచ్చాయంటే అందరికీ ముందుగా గుర్తొచ్చే నోరూరించే తియ్యని పిండివంటకం బూంది లడ్డు. బుడిబుడి బూందీ గింజలను తీపి పాకంలో బాగా నానబెట్టి.. నెయ్యిలో వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్, సువాసనభరితమైన యాలకుల పొడి కలిపి లడ్డూ చేసి తింటే వచ్చే ఆ రుచే వేరబ్బా

Written By Bhoomi
Published: Nov 04, 2026, 05:16 PM IST | Updated: Nov 04, 2026, 05:18 PM IST
Image Credit: Boondi Lddoos
Join

Boondi Lddoos : పండుగలు, పెళ్లిళ్లు, ఏవైనా శుభకార్యాలు వచ్చాయంటే అందరికీ ముందుగా గుర్తొచ్చే నోరూరించే తియ్యని పిండివంటకం  బూంది లడ్డు. బుడిబుడి బూందీ గింజలను తీపి పాకంలో బాగా నానబెట్టి.. నెయ్యిలో వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్, సువాసనభరితమైన యాలకుల పొడి కలిపి లడ్డూ  చేసి తింటే వచ్చే ఆ రుచే వేరబ్బా.సరైన కొలతలు.. చిన్న చిన్న చిట్కాలు పాటించినట్లయితే.. అచ్చం స్వీట్ షాపులో తయారు చేసినట్లుగానే రుచికరమైన మెత్తటి..జ్యూసీ  బూంది లడ్డూలను మన ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎలాగో చూద్దాం.

మొదటగా కావాల్సిన పదార్థాలు చూద్దాం:

బూంది కోసం
శనగపిండి – 1 కప్పు
నీళ్లు – సుమారు ¾ కప్పు
బేకింగ్ సోడా – చిటికెడు (కావాలనుకుంటే వేసుకోవచ్చు)
పసుపు లేదా ఆరెంజ్ ఫుడ్ కలర్ – చిటికెడు (తప్పనిసరి కాదు)
నూనె – వేయించడానికి సరిపడా
చక్కెర పాకం కోసం

చక్కెర – 1½ కప్పులు
నీళ్లు – ¾ కప్పు
యాలకుల పొడి – ½ టీ స్పూన్
నిమ్మరసం – ¼ టీ స్పూన్
అలంకరణ, రుచి కోసం

జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్లు
కిస్‌మిస్ – 1 టేబుల్ స్పూన్
లవంగాలు – 4–5
నెయ్యి – 1 టేబుల్ స్పూన్

ఇప్పుడు తయారీ విధానం  చూద్దాం: 
మొదటగా ఒక గిన్నెలో శనగపిండిని తీసుకోవాలి. అందులో కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండి మరీ చిక్కగా లేదా పలుచగా కాకుండా దోశ పిండి కంటే కొద్దిగా పలుచగా ఉండే విధంగా చూసుకోవాలి. కావాలనుకుంటే చిటికెడు ఫుడ్ కలర్ వేసి కలపాలి.

ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసుకుని.. బూంది జల్లెడను నూనెకు కొద్దిగా పైన పట్టుకోవాలి. పిండినిజల్లెడపై చిన్న చిన్న బూందీలు పడేలా చేయాలి. ఇప్పుడు బూందీలను పూర్తిగా క్రిస్పీగా కాకుండా కొద్దిసేపు వేయించి తీసేయాలి.ఇకమిగిలిన పిండితో కూడా ఇదే విధంగా బూందీలు తయారుచేసుకోవాలి.

ఇప్పుడు ఒక గిన్నెలో చక్కెర, నీళ్లు వేసి మరిగించాలి.చక్కెర కరిగిన తర్వాత పాకం కొద్దిగా చిక్కబడే వరకు ఉడికించాలి.రెండు వేళ్ల మధ్య కొద్దిగా పాకం తీసుకుని చూస్తే పలుచని తీగ ఏర్పడే దశకు వచ్చేలా చూసుకోవాలి. యాలకుల పొడి, నిమ్మరసం వేసి కలపాలి.

బూందీ లడ్డూలను పర్ఫెక్ట్‌గా తయారుచేయడానికి ముందుగా సిద్ధం చేసుకున్న బూందీలను వేడి పాకంలో వేసి బాగా కలపాలి. ఆ తర్వాత నెయ్యిలో వేయించిన జీడిపప్పు ముక్కలతో పాటు కిస్‌మిస్, యాలకుల పొడిని కూడా ఆ మిశ్రమంలో కలపాలి. ఆ తర్వాత పాత్రపై మూతపెట్టి 10–15 నిమిషాలు పక్కన ఉంచితే, బూందీలు పాకాన్ని పూర్తిగా పీల్చుకుని మెత్తగా మారుతాయి.

అనంతరం లడ్డూలు చుట్టే ప్రక్రియలో భాగంగా.. మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకోవాలి. కొద్దికొద్దిగా మిశ్రమం తీసుకుని గుండ్రంగా లడ్డూలు కట్టాలి. ఒకవేళ లడ్డూలు కట్టడానికి మిశ్రమం సహకరించకపోతే కొద్దిగా వేడినీళ్లు చల్లి కలిపి మళ్లీ ప్రయత్నించవచ్చు. లడ్డూలు పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి.

బూందీలు తయారుచేసేటప్పుడు జల్లెడను నూనెకు మరీ దగ్గరగా ఉంచకూడదు. అలాగే బూందీలను ఎక్కువగా వేయిస్తే లడ్డూలు గట్టిగా మారుతాయి. పాకం మరీ గట్టిగా అయితే లడ్డూలు కట్టడం కష్టమవుతుంది కాబట్టి, మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టాలి. అంతేకాకుండా బూందీలు ఒకే పరిమాణంలో రావడానికి సరైన జల్లెడను ఉపయోగించడం చాలా ముఖ్యం.
 

Also Read: 

 

 

 

 

శత్రువుల గురువు దగ్గర విద్య నేర్చుకున్న కచుడు.. శుక్రాచార్యుడి నుంచి పొందిన జ్ఞానం వెనుక అసలు కథ ఇదే!

 

 

 

 

అబద్దాలతో ఎప్పటికైనా నష్టాలు తప్పవని నిరూపించిన చిన్నారి చిట్టి కథ..!!

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES