SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

జీర్ణ సమస్యలు.. మలబద్ధకంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారా? ఈ 3 పదార్థాలు మీ డైట్‌లో చేర్చితే చాలు!

సరైన డైట్‌, ఆరోగ్య నియమాలు పాటించకపోవడం వల్ల దీర్ఘకాలిక మలబద్ధక సమస్య వస్తుంది. ఇది ప్రతిరోజూ ఇబ్బంది పెడుతుంది. కడుపులో గ్యాస్‌, అజీర్తి, ఉబ్బరంగా అనిపిస్తుంది. అంతేకాదు పేగు ఆరోగ్యం కూడా కుంటుపడుతుంది. ముఖంపై యాక్నేకు కూడా దారితీస్తుంది. అయితే, కొన్ని రకాల సూపర్‌ఫుడ్స్‌ మీ డైట్‌లో చేర్చుకుంటే ఈ దీర్ఘకాలిక మలబద్ధక సమస్యకు చెక్‌ పెట్టొచ్చు. అవేంటో తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Oct 22, 2026, 12:59 PM IST | Updated: Oct 22, 2026, 01:04 PM IST
Image Credit: chronic constipation relief foods:
Join

chronic constipation relief foods: మన రోజువారీ ఆహారంలో ఫైబర్‌ పుష్కలంగా ఉండే ఫుడ్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. అంతేకాదు రెగ్యులర్‌ ఎక్సర్‌సైజ్‌ కూడా తప్పనిసరి. ఎక్కువగా మసాలా ఉండే ఫుడ్స్‌ తీసుకున్నా ఆరోగ్యానికి హానికరమే. ఆరోగ్యకరమైన పేగు కదలికలకు ఆరోగ్యకరమైన ఫుడ్‌కు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది రానురాను చర్మంపై కూడా దీని ప్రభావం కనిపిస్తుంది. ప్రధానంగా మన రోజువారీ డైట్‌లో ఫైబర్‌ పుష్కలంగా ఉండే ఫుడ్స్‌ తీసుకోవాలి. అంతేకాదు తగిన మోతాదులో నీరు తీసుకోవాలి.

వైద్యుల ప్రకారం దీర్ఘకాలిక మలబద్ధక సమస్యకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఇది కడుపులో అజీర్తి, చర్మం డల్‌గా మారడం, నీరసం, యాక్నే, బరువు తగ్గడం  వంటివి కనిపించే లక్షణాలు.. ఇది పేగు ఆరోగ్యాన్ని పూర్తిగా కుంటుపడేలా చేస్తుంది, రానురాను హార్మోనల్‌ అసమతుల్యతకు కూడా దారితీస్తుంది. జీర్ణ ఆరోగ్యం బాగుండాలంటే పేగు కదలికలకు సరిగ్గా ఉండాలని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రధానంగా ఐదు రకాల ఫుడ్స్‌ డైట్‌లో చేర్చుకోవాలి.

పచ్చి బొప్పాయి..
పచ్చి బొప్పాయిలో పప్పెయిన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ ఎంజైమ్‌.. ఈ పచ్చి బొప్పాయిలో ఫైబర్‌ కూడా ఎక్కువగా ఉంటుంది. జీర్ణ ఆరోగ్యానికి ఇది ఎంతో మంచిది. మీ పేగుల్లో ఉన్న టాక్సిన్స్‌ పూర్తిగా క్లీయర్‌ చేస్తుంది. తద్వారా రానురాను దీర్ఘకాలిక మలబద్ధక సమస్యకు చెక్‌ పెట్టొచ్చు.

నానబెట్టిన కిస్మిస్‌..
వీటిని సాధారణంగా మనం వివిధ రకాల స్వీట్‌ ఐటెమ్స్‌లో వేసుకుని తింటాం. కిస్మిస్‌ను నానబెట్టి తీసుకుంటే కూడా దీర్ఘకాలిక మలబద్ధక సమస్య తగ్గిపోతుంది. రాత్రి నానబెట్టిన కిస్మిస్‌ ఉదయం తీసుకోవాలి. ఇది ఆరోగ్యకరమైన పేగు కదలికలు కూడా సహాయపడుతుంది. ఇందులోని సోర్బిటల్‌ పేగుల్లోకి నీటిని అందిస్తుంది. దీంతో మలబద్ధక సమస్యకు చెక్‌ పడుతుంది. కిస్మిస్‌ తింటే మీ చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

Read Also: షుగర్ ఉన్నవారికి కొత్త ముప్పు! 'డబుల్ డయాబెటిస్' వచ్చే ప్రమాదం ఎవరికి ఎక్కువ? అలర్ట్ లేకపోతే అంతే!
Read Also: సీజన్ మారినప్పుడల్లా జలుబు, జ్వరం వస్తున్నాయా? ఈ 5 సింపుల్ చిట్కాలతో ఇన్ఫెక్షన్లకు బై బై చెప్పండి!

ప్రూన్స్‌..
ప్రూన్స్‌లో కరిగే, కరగని ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. ఈ రెండిటి వల్ల మలబద్ధక సమస్య తగ్గుముఖం పడుతుంది. చాలా కాలంగా ప్రూన్స్‌ దీర్ఘకాలిక మలబద్ధక సమస్యకు ఎఫెక్టివ్‌ రెమిడీగా కూడా పరిగణిస్తారు. అయితే, వీటితోపాటు కొన్ని చిన్న చిన్న డైటరీ మార్పులు కూడా చేసుకోవాలి. తద్వారా గట్‌ ఆరోగ్యం కూడా బాగుంటుంది. పేగు కదలికలు ఆరోగ్యవంతంగా మారుతుంది. సహజంగా సమస్యను తగ్గించేస్తుంది. (Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES