SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

చేపల పులుసులో బెండకాయ.. అసలు రుచి వెనుక సీక్రెట్ ఇదే..!!

Cooking Tips: వేడి వేడి అన్నంలో నోరూరించే కమ్మని చేపల పులుసు కలుపుకుని తింటుంటే.. ఆ మజానే వేరు! చేపల పులుసు పేరు వింటేనే ఎవరికైనా నోట్లో నీళ్లు ఊరాల్సిందే. అంతటి అద్భుతమైన రుచి ఉండే ఈ పులుసును ఇష్టపడని వారు దాదాపు ఉండరనే చెప్పాలి. అయితే.. సాధారణంగా చేపల పులుసు వండేటప్పుడు అందులో బెండకాయ ముక్కలు వేయడం మనం చూస్తూనే ఉంటాం. అసలు చేపల కూరలో బెండకాయ ఎందుకు వేస్తారో.. దాని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో మీకు తెలుసా?

Written By Bhoomi
Published: Nov 01, 2026, 11:45 AM IST | Updated: Nov 01, 2026, 11:47 AM IST
Image Credit: Cooking Tips:
Join

Cooking Tips: వేడి వేడి అన్నంలో నోరూరించే కమ్మని చేపల పులుసు కలుపుకుని తింటుంటే.. ఆ మజానే వేరు! చేపల పులుసు పేరు వింటేనే ఎవరికైనా నోట్లో నీళ్లు ఊరాల్సిందే. అంతటి అద్భుతమైన రుచి ఉండే ఈ పులుసును ఇష్టపడని వారు దాదాపు ఉండరనే చెప్పాలి. అయితే.. సాధారణంగా చేపల పులుసు వండేటప్పుడు అందులో బెండకాయ ముక్కలు వేయడం మనం చూస్తూనే ఉంటాం. అసలు చేపల కూరలో బెండకాయ ఎందుకు వేస్తారో.. దాని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో మీకు తెలుసా?

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చేపల పులుసుకు విపరీతమైన గిరాకీ ఉంటుంది. చేపల పులుసు అంటేనే నోట్లో నీళ్లూరుతాయి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ చేపల పులుసును ఇష్టపడతారు. ఆంధ్రా స్టైల్లో  చేపల పులుసు గురించి పెద్దగా చెప్పుకోవల్సిందీ ఏమీ లేదు. దానిలోని కారమైన మసాలాలు, చింతపండు గుజ్జు, మిరపకాయలతో ఇది అద్భుతంగా ఉంటుంది. అయితే, ఈ పులుసుకు ప్రత్యేకతను చేకూర్చే పదార్థాలలో బెండకాయ ఒకటి. సాధారణంగా బెండకాయ జిగురుగా ఉంటుంది. కానీ చేపల పులుసులో బెండకాయలను వేస్తుంటారు.  తరతరాలుగా మన పెద్దలు చేపల పులుసులో కొన్ని బెండకాయ ముక్కలు వేయడాన్ని అలవాటుగా చేసుకున్నారు. ఇది కేవలం అలవాటు మాత్రమే కాదు, దీని వెనుక కొన్ని పాకశాస్త్రపరమైన కారణాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ కారణాలను తెలుసుకుందాం.

చేపల పులుసులో బెండకాయ వేయడం వెనుక కేవలం సంప్రదాయం మాత్రమే కాదు.. అద్భుతమైన వంటల సైన్స్, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. దీనికి గల ప్రధాన కారణాలు ఇవే:

1. జిగురుతో చిక్కదనం:
బెండకాయలో ఉండే  మ్యూసిలేజ్ అనే సహజమైన జిగురు పదార్థం వేడి పులుసులో కరిగిపోతుంది. ఇది పల్చని పులుసును ఎలాంటి కార్న్‌ఫ్లోర్ లేదా పిండులు వాడకుండానే పులుసును చిక్కగా మార్చుతుంది.  చేప ముక్కలకు పులుసు పట్టేలా చేయడంలో బెండకాయ జిగురు కీలకపాత్ర పోషిస్తుంది.  

2. మసాలాలను పీల్చుకునే నైజం:
బెండకాయ లోపలి భాగం స్పాంజ్ వలే ఉంటుంది. చింతపండు, కారం, మసాలాలు, చేపల నూనెలను పీల్చుకుంటాయి. పులసులోని ఆమ్లతత్వం కారణంగా బెండకాయ ముక్కలు నుజ్జు నుజ్ను కాకుండా తినేటప్పుడు అద్బుతమైన రుచిని అందిస్తాయి.

 
3. చేప వాసనకు చెక్:

చేపల్లో ఉండే సహజమైన నీచు  వాసనను తగ్గించడంలో బెండకాయ సహాయపడుతుంది. అలాగే.. పులుసు మరిగేటప్పుడు చేప ముక్కలు సున్నితంగా ఉండి విరిగిపోకుండా, బెండకాయలు వాటి మధ్య ఒక రక్షణ పొరలా ఉంటాయి.

4. మరుసటి రోజు రెట్టింపు రుచి:
పులుసు నానుతున్న కొద్దీ బెండకాయలోకి పులుపు, మసాలాలు మరింత లోతుగా దిగుతాయి. చేపలలోని ప్రోటీన్ నూనెలు, బెండకాయ ఫైబర్‌తో కలవడం వల్ల మరుసటి రోజుకి పులుసు రుచి మరింత రెట్టింపు అవుతుంది.

5. పరిపూర్ణ పోషకాహారం:

చేపల ద్వారా లభించే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్లకు తోడు.. బెండకాయ ద్వారా శరీరానికి కరిగే ఫైబర్, విటమిన్-సి, ఫోలేట్ అందుతాయి. నాన్‌వెజ్‌కు కూరగాయను జోడించి సమతుల్య ఆహారంగా మార్చే అద్భుతమైన పద్ధతి ఇది.

Also Read: 

సన్నబియ్యం ధరలకు కళ్లెం.. గరిష్ఠ ధరలను ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం..!!

 

 

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి!

 

2 లక్షల మందికి  కేవలం 33 వేల మందే దరఖాస్తు.. NMMS స్కాలర్‌షిప్‌పై విద్యాశాఖ డైరెక్టర్‌కు లేఖ..!!

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES