• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /లైఫ్‌స్టైల్
  • /పార్లర్ వాక్సింగ్, రేజర్ అవసరం లేదు.. కేవలం 3 కిచెన్ ఐటమ్స్‌తో ముఖంపై వెంట్రుకలు తగ్గే సీక్రెట్ ఇదే!

పార్లర్ వాక్సింగ్, రేజర్ అవసరం లేదు.. కేవలం 3 కిచెన్ ఐటమ్స్‌తో ముఖంపై వెంట్రుకలు తగ్గే సీక్రెట్ ఇదే!

ముఖంపై అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి చాలామంది తరచూ పార్లర్ వెళ్తుంటారు. ముఖం మరింత అందంగా కనిపించాలంటే, సహజంగా కేవలం మూడు వస్తువులతో మీరు ఫేషియల్ హెయిర్‌ను తొలగించుకోవచ్చు. అదేంటో తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Nov 22, 2026, 20:16 IST|Updated: Nov 22, 2026, 20:19 IST
joinshare
పార్లర్ వాక్సింగ్, రేజర్ అవసరం లేదు.. కేవలం 3 కిచెన్ ఐటమ్స్‌తో ముఖంపై వెంట్రుకలు తగ్గే సీక్రెట్ ఇదే!
Image Credit: How to Remove Facial Hair Naturally:

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పార్లర్ వాక్సింగ్, రేజర్ అవసరం లేదు.. కేవలం 3 కిచెన్ ఐటమ్స్‌తో ముఖంపై వెంట్రుకలు తగ్గే సీక్రెట్ ఇదే!

పార్లర్ వాక్సింగ్, రేజర్ అవసరం లేదు.. కేవలం 3 కిచెన్ ఐటమ్స్‌తో ముఖంపై వెంట్రుకలు తగ్గే సీక్రెట్ ఇదే!

2

BRS Party: ఇంటర్‌ బోర్డు రద్దు రేవంత్ రెడ్డి అహంకార నిర్ణయం: ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌

3

జుట్టు కుదుళ్లు బలపడాలంటే ఇది బెస్ట్ టిప్.. హోమ్‌మేడ్ మెంతుల హెయిర్ ప్యాక్ పూర్తి విధానమిదే!

4

Hyderabad: హైదరాబాద్‌ను బాంబులతో పేల్చేస్తాం.. పోలీసులకు లష్కరే తొయిబా పేరుతో బెదిరింపు మెయిల్స్ .!.

5

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

How to Remove Facial Hair Naturally: ఫేషియల్ హెయిర్ సాధారణంగా అందరిలోనూ పెరుగుతుంది, ముఖ్యంగా మహిళలు ఈ అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తుంటారు. దీనివల్ల చర్మం మరింత మృదువుగా అనిపిస్తుంది. దీనికోసం థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్ వంటి సాధారణ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఫేషియల్ వ్యాక్సింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో మూడు వస్తువులు ఉంటే సహజంగానే ఈ పని చేసుకోవచ్చు.

మన అమ్మమ్మల కాలం నుంచి ఉపయోగిస్తున్న శనగపిండి, చక్కెర, గోధుమపిండి ఈ మూడింటినీ కలిపి ఫేషియల్ హెయిర్‌ను తొలగిస్తే, కాలక్రమేణా రోమాలు పెరగడం తగ్గిపోతుంది. సెలూన్‌లో చేసే వ్యాక్సింగ్ లాగా తక్షణ ఫలితం కాకపోయినా, దీర్ఘకాలంలో మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఈ ఫేషియల్ ప్యాక్‌ను క్రమం తప్పకుండా వేసుకోవడం వల్ల మీ ముఖం మృదువుగా మారుతుంది, డెడ్ స్కిన్ సెల్స్ కూడా తొలగిపోతాయి.
పార్లర్‌కు వెళ్లి వ్యాక్సింగ్ లేదా థ్రెడ్డింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా, ఇంట్లోనే ఈ మూడు వస్తువులతో సులభంగా ఈ పని పూర్తి చేసుకోవచ్చు. మన అమ్మమ్మల కాలం నుంచి ఈ వస్తువులను వాడుతున్నారు. వీటివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇవి ముఖానికి మంచి ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తాయి. క్రమంగా అవాంఛిత రోమాలు పెరగడాన్ని తగ్గిస్తాయి. సహజంగానే మీ చర్మం మెరుస్తూ మృదువుగా మారుతుంది. ఈ మాస్క్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రెండు టేబుల్ స్పూన్ల గోధుమపిండి, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, ఒక స్పూన్ చక్కెర, గోరువెచ్చని నీళ్లు ఉంటే సరిపోతుంది. ఈ 3 వస్తువులతో ముఖంపై ఉండే అదనపు రోమాలను తొలగించుకోవచ్చు. ముందుగా గోధుమపిండిని, శనగపిండిని వేయించాలి. గోల్డెన్ రంగులోకి మారిన తర్వాత చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో చక్కెర, కొన్ని గోరువెచ్చని నీళ్లు వేసి బాగా కలపాలి. ఇందులోనే వేయించిన పిండిని కూడా వేసి మందపాటి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు అవాంఛిత రోమాలను తొలగించే ఫేస్ మాస్క్ సిద్ధమైపోతుంది.

ముందుగా మీ ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. మేకప్ ఏమైనా ఉంటే తొలగించాలి. ఆ తర్వాత ఈ పేస్ట్‌ను ముఖానికి, మెడ భాగంలో కూడా బాగా అప్లై చేసి కొద్దిసేపు ఆరనివ్వాలి. ఆరిన తర్వాత, ముఖాన్ని సర్కులర్ మోషన్‌లో మెల్లగా రుద్దుతూ ఉండాలి. అప్పుడు చర్మం ఎక్స్‌ఫోలియేట్ అవుతుంది, అవాంఛిత రోమాలు కూడా తొలగిపోతాయి. ఈ మాస్క్ ఎక్కువగా రోమాలు పెరిగే వారికి మంచి ఉపశమనం ఇస్తుంది. సెలూన్‌కు వెళ్లకుండానే ఈ చిట్కాను పాటించవచ్చు.  థ్రెడ్డింగ్ లేదా వ్యాక్సింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. క్రమం తప్పకుండా వాడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ప్రతి 10 రోజులకు ఒకసారి ఈ మాస్క్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పార్లర్‌కు వెళ్లకుండానే మంచి పరిష్కారం పొందవచ్చు.

అయితే సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాతే ఉపయోగించాలి. ముఖంపై దురద, మంట వంటివి కలిగితే వెంటనే ఈ మాస్క్‌ను ఉపయోగించడం ఆపేయాలి. ముఖ్యంగా పిల్లలకు ఈ మాస్క్ వాడేటప్పుడు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. పిల్లలకు హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తే, వైద్యుల సలహా తీసుకోకుండా ఎలాంటి ప్రయోగాలు చేయకూడదు

Add Zee News as a Preferred Source
TAGS:
daily life
Telugu News
Beauty Tips