• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /హైదరాబాద్
  • /BRS Party: ఇంటర్‌ బోర్డు రద్దు రేవంత్ రెడ్డి అహంకార నిర్ణయం: ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌

BRS Party: ఇంటర్‌ బోర్డు రద్దు రేవంత్ రెడ్డి అహంకార నిర్ణయం: ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌

MLC Dasoju Sravan Kumar Slams To Revanth Reddy: విద్యా వ్యవస్థను రేవంత్‌ రెడ్డి భ్రష్టు పట్టిస్తున్నాడని.. ఇంటర్మీడియట్ బోర్డు రద్దు చేయడం అతడి అహంకార పూరిత నిర్ణయమని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ కుమార్‌ మండిపడ్డారు. వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. లేకుంటే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.

Written By Ravi Kumar Sargam
Published: Nov 22, 2026, 19:55 IST|Updated: Nov 22, 2026, 19:58 IST
joinshare
BRS Party: ఇంటర్‌ బోర్డు రద్దు రేవంత్ రెడ్డి అహంకార నిర్ణయం: ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌
Image Credit: Dasoju Sravan Kumar

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పార్లర్ వాక్సింగ్, రేజర్ అవసరం లేదు.. కేవలం 3 కిచెన్ ఐటమ్స్‌తో ముఖంపై వెంట్రుకలు తగ్గే సీక్రెట్ ఇదే!

పార్లర్ వాక్సింగ్, రేజర్ అవసరం లేదు.. కేవలం 3 కిచెన్ ఐటమ్స్‌తో ముఖంపై వెంట్రుకలు తగ్గే సీక్రెట్ ఇదే!

2

BRS Party: ఇంటర్‌ బోర్డు రద్దు రేవంత్ రెడ్డి అహంకార నిర్ణయం: ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌

3

జుట్టు కుదుళ్లు బలపడాలంటే ఇది బెస్ట్ టిప్.. హోమ్‌మేడ్ మెంతుల హెయిర్ ప్యాక్ పూర్తి విధానమిదే!

4

Hyderabad: హైదరాబాద్‌ను బాంబులతో పేల్చేస్తాం.. పోలీసులకు లష్కరే తొయిబా పేరుతో బెదిరింపు మెయిల్స్ .!.

5

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Telangana Bhavan: 'విద్యాశాఖకు పూర్తిస్థాయి మంత్రి ఉండాలి. కానీ రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకుని వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాడు. బడ్జెట్‌లో విద్యా శాఖకు 15 శాతం కేటాయిస్తామని 8 శాతం కూడా కేటాయించలేదు. ఉస్మానియా యూనివర్సిటీకి రూ.వెయ్యి కోట్ల నిధుల హామీ జీవోలకే పరిమితమైంది. యూనివర్సిటీల్లో నియామకాలు వంతులవారీగా చేయడం ఉన్నత విద్యను భ్రష్టు పట్టించడమే' అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ తెలిపారు.

హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఆదివారం ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ ప్రెస్‌మీట్ నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఏ పథకం అయినా.. విధానమైనా ప్రవేశపెట్టేపుడు విస్తృతమైన చర్చలు చేయాలి. విధానం మార్చేపుడు జరిగే పర్యావసానాలపై అభిప్రాయాలు తెలుసుకోవాలి. రేవంత్ రెడ్డి మాత్రం రాష్ట్రంలో హిట్లర్‌లా పాలసీలపై ఫత్వాలు జారీ చేస్తున్నారు. కేబీఆర్ పార్క్‌ చుట్టూ రోడ్డు విస్తరణ పనుల్లో రేవంత్ రూ.300 కోట్ల ప్రజాధనాన్ని వృథాచేసినట్టే.. ఇంటర్ బోర్డుపై ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు రద్దు చేయడం రేవంత్ అహంకార పూరిత నిర్ణయం' అని మండిపడ్డారు.

'కేంద్రంలో స్మృతీ ఇరానీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నపుడు ఆమె విద్యార్హతలపై కాంగ్రెస్ ఆరోపణలు గుప్పించింది. విద్యార్హతలు లేని రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉండటాన్ని బీజేపీ ప్రశ్నించదా? ఆమెను ప్రశ్నించిన రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని విద్యాశాఖ మంత్రిగా తెలంగాణపై ఎందుకు రుద్దుతున్నారు? గురుకుల టెండర్లలో రూ.వేల కోట్ల కుంభకోణంతోపాటు విద్యాశాఖ లో అనేక అవకతవకలు జరిగినపుడు రేవంత్ రెడ్డికి విద్యా శాఖ మంత్రిగా కొనసాగే అర్హత ఉందా?' అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ ప్రశ్నించారు.

'పీవీ నరసింహ రావు 1968లో అనేక చర్చల తర్వాత ఇంటర్మీడియట్ బోర్డును ఏర్పాటుచేశారు. కాంగ్రెస్ తెచ్చిన ఇంటర్ బోర్డును కాంగ్రెస్‌ పార్టీ రద్దు చేసింది. నేను ఇంటర్మీడియట్ బోర్డు రద్దుపై ప్రభుత్వానికి లేఖ రాసినా ఇప్పటివరకు స్పందన లేదు. విద్యాశాఖ మంత్రిగా కోదండ రామ్ కో ఎమ్మెల్సీగా చేసి శ్యామ్ మోహన్ కో అవకాశం ఇవ్వాలి' అని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ విజ్ఞప్తి చేశారు. 'ఇంటర్మీడియట్ బోర్డు రద్దుపై ఆకునూరి మురళి నివేదికను అసెంబ్లీలో, మండలిలో ఎందుకు పెట్టలేదు? ఇంటర్ బోర్డు రద్దు రేవంత్ రెడ్డి కుటుంబ వ్యవహారమా? తెలంగాణ రేవంత్ రెడ్డి తాత జాగీరా? ప్రైవేటు ఎస్టేటా?' అని నిలదీశారు.

'మోడీ తెచ్చిన కొత్త విద్యా విధానాన్ని సోనియా వ్యతిరేకిస్తుంటే రేవంత్ రెడ్డి ఎందుకు అమలు చేయాలనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్న బీజేపీ కార్యకర్తనని చెప్పదలుచుకున్నారా? ఇంటర్ బోర్డును రద్దు చేయడం తెలంగాణ స్థానికతకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నారు' అని ఎమ్మెల్సీ శ్రవణ్‌ విమర్శించారు. నీళ్లలాగే విద్యను కూడా రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్రాలకు దోచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

'తొమ్మిదో తరగతి నుంచి నాలుగేళ్లు వరసగా ఎక్కడ చదివితే అక్కడ విద్యార్థులు స్థానికులవుతానని నీట్ లాంటి ఎంట్రన్స్ నిబంధనలు చెబుతున్నాయి. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి ఇంటర్ బోర్డు రద్దు వ్యతిరేకం. పాలసీ మార్చినపుడు న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలనే సోయి రేవంత్ రెడ్డికి లేదా?' అని ఎమ్మెల్సీ శ్రవణ్‌ ప్రశ్నించారు. ఇంటర్ బోర్డు రద్దుపై వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. కార్పొరేట్ విద్యా సంస్థలకే ఇంటర్ బోర్డు రద్దు మేలు చేస్తుందని.. రేవంత్ రెడ్డి కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఇంటర్ బోర్డుపై విలీనాన్ని తొందరపడి అమలుచేస్తే బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని ఎమ్మెల్సీ శ్రవణ్‌ హెచ్చరించారు.

'విద్యా శాఖను తాను మాత్రమే నిర్వహించగలను వేరే వారి వల్ల కాదని చెప్పే రేవంత్ రెడ్డి ఇన్ని తప్పుడు నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు. తొక్కుతా, తోముతా అని రేవంత్ రెడ్డి అనడం కాదు. వాటితో విద్యాశాఖలో సత్ఫలితాలు రావు' అని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ స్పష్టం చేశారు. పూర్తి సమయాన్ని కేటాయించే విద్యాశాఖ మంత్రి తెలంగాణకు కావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. కోదండరామ్‌ ఇంటర్ బోర్డు రద్దును సమర్థిస్తే ఆయన రేవంత్ రెడ్డికి బానిసత్వం చేస్తున్నట్టు, ఆకునూరి మురళి రిపోర్టును చట్టసభల్లో ప్రవేశ పెట్టకపోవడాన్ని కోదండరామ్‌ ఎలా సమర్థిస్తారని ఎమ్మెల్సీ శ్రవణ్‌ ప్రశ్నించారు.

Add Zee News as a Preferred Source
TAGS:
BRS
Hyderabad
Telugu News
Telangana News