ఉడకబెట్టిన గుడ్లను ఎంతసేపట్లో తినాలి? ఫ్రిజ్‌లో ఇలా నిల్వ చేస్తున్నారా? తీవ్రమైన రోగాల బారిన పడే ప్రమాదం!
గుడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి, అందుకే ప్రతిరోజూ గుడ్డు తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. వీటితో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. ఉడకబెట్టిన గుడ్లు లేదా ఆమ్లెట్లను బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవడం సర్వసాధారణం. అయితే, ఉడకబెట్టిన గుడ్లను ఎంత సమయం లోపు తినాలి? వాటిని ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చా? వీటి గురించి సరైన అవగాహన లేకపోతే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
గుడ్లలో విటమిన్ డీ, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్ అందుతుంది. చాలామందికి గుడ్లు అంటే ఇష్టం. ప్రతిరోజూ ఒక గుడ్డు తినడం వల్ల రోజంతా కావాల్సిన శక్తి లభిస్తుందని వైద్యులు చెబుతుంటారు. గుడ్డుతో వంటలు చేయడం చాలా సులభం కావడమే కాకుండా, ఇవి పోషకాలతో పాటు రుచిగా కూడా ఉంటాయి. వీటిని లంచ్ బాక్స్‌లో లేదా స్నాక్స్‌గా కూడా తీసుకోవచ్చు. అయితే, చాలామంది బిజీగా ఉండటం వల్ల గుడ్లను ఉడకబెట్టి పక్కన పెడుతుంటారు లేదా మరుసటి రోజు తింటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా పెరిగి ప్రాణాపాయం కలిగించే అవకాశం కూడా ఉంది. కాబట్టి, ఉడకబెట్టిన గుడ్లను వీలైనంత త్వరగా తినడం మంచిది. వేడివేడిగా ఉన్నప్పుడే ఆహారం తీసుకోవడం వల్ల కడుపులో ఇన్ఫెక్షన్లు వచ్చే ముప్పు తక్కువగా ఉంటుంది.
ఆరోగ్య నిపుణుల ప్రకారం, ఉడకబెట్టిన గుడ్లను ఫ్రిజ్‌లో 4 డిగ్రీల సెల్సియస్ వద్ద నిల్వ చేసుకోవచ్చు. రూమ్ టెంపరేచర్లో ఉంచితే బ్యాక్టీరియా పెరిగి గుడ్లు త్వరగా పాడవుతాయి. ఫ్రిజ్‌లో నిల్వ చేసేటప్పుడు తప్పనిసరిగా ఒక ఎయిర్‌టైట్ బాక్స్‌ను ఉపయోగించాలి.
ఉడకబెట్టిన గుడ్డును వెంటనే తినడం అలవాటు చేసుకోవాలి. ఒకవేళ సాయంత్రం వరకు లేదా మరుసటి రోజు వరకు నిల్వ ఉంచాల్సి వస్తే, ఎయిర్‌టైట్ బాక్స్‌లో పెట్టి సరైన పద్ధతిలో స్టోర్ చేయాలి. గుర్తుంచుకోండి, పొట్టు తీసిన గుడ్డు ఎక్కువ కాలం నిల్వ ఉండదు. పొట్టు తీయకుండా ఉన్న గుడ్డు మాత్రమే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
ఉడకబెట్టిన గుడ్లను బయట పెడితే 'సాల్మొనెల్లా' వంటి బ్యాక్టీరియా పెరిగి కడుపు సమస్యలు మరియు ప్రాణాపాయం కలిగించవచ్చు. కాబట్టి ఉడకబెట్టిన గుడ్లను వేడివేడిగా తినడమే ఉత్తమం. చలికాలంలో గొంతు సమస్యల కోసం మనం మిరియాల పొడి వేసుకుని గుడ్డు తింటాం. ఇది పాత చిట్కా అయినప్పటికీ, నిల్వ ఉంచాల్సి వస్తే ఎయిర్‌టైట్ బాక్స్‌లో రెండు మూడు రోజులకు మించి నిల్వ చేయకపోవడమే మంచిది. తినే ముందు తినలేకపోతే, పొట్టు తీయకుండా ఎయిర్‌టైట్ బాక్స్‌లో ఉంచండి.
గుడ్లను ఎయిర్‌టైట్ బాక్స్‌లో పెట్టకపోతే ఫ్రిజ్‌లో దుర్వాసన వస్తుంది. గది ఉష్ణోగ్రత వద్ద ఉంటే, ఉడకబెట్టిన గుడ్డును 2 గంటల లోపు తినడం మంచిది. లంచ్ బాక్స్‌లో తీసుకువెళ్లేటప్పుడు, రెండు గంటల్లోపు తినగలిగే అవకాశం ఉంటేనే ప్యాక్ చేయండి. లేదంటే కడుపునొప్పి, వికారం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
Read Also: షుగర్ ఉన్నవారికి కొత్త ముప్పు! 'డబుల్ డయాబెటిస్' వచ్చే ప్రమాదం ఎవరికి ఎక్కువ? అలర్ట్ లేకపోతే అంతే!
Read Also: సీజన్ మారినప్పుడల్లా జలుబు, జ్వరం వస్తున్నాయా? ఈ 5 సింపుల్ చిట్కాలతో ఇన్ఫెక్షన్లకు బై బై చెప్పండి!
ఉడకబెట్టిన గుడ్డు పైన ఉండే భాగం రబ్బరులా మారకుండా ఉండాలంటే, సాయంత్రం వరకు నిల్వ ఉంచాల్సి వచ్చినప్పుడు ఎయిర్‌టైట్ కంటైనర్‌కు సీల్ కవర్ వేసి గట్టిగా మూసి ఉంచండి. అలాగే, ఫ్రిజ్‌లో నిల్వ చేసే ముందు గుడ్లను గది ఉష్ణోగ్రత వద్ద చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడే ఫ్రిజ్‌లో పెడితే టెంపరేచర్ మార్పుల వల్ల సమస్యలు రావచ్చు. చల్లబడిన తర్వాత తేమ లేకుండా మంచి బాక్స్‌లో ఉంచాలి.
పాడైన గుడ్లు త్వరగా దుర్వాసన వస్తాయి. వాటి రంగు కూడా మారుతుంది. అలాంటి వాటిని గుర్తించి తినకుండా ఉండటం మంచిది. ఎప్పుడూ తాజాగా ఉన్న ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వండి. నిజానికి, ఉడకబెట్టిన గుడ్లను మరీ ఎక్కువ కాలం నిల్వ చేయకపోవడమే మంచిది, లేదంటే గుడ్డులోని తెల్లటి భాగం రబ్బరులా మారిపోతుంది. వారం రోజులు మాత్రమే గుడ్లను తెచ్చి ఫ్రిజ్‌లో భద్రపరుచుకోవడం ఉత్తమం. సరైన పద్ధతిలో నిల్వ చేయకపోతే అది ఆరోగ్యానికి ప్రమాదకరం.(Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న విషయాలు, సూచనలు కేవలం పాఠకుల అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే అందించాం. ఇది ఎలాంటి పరిస్థితుల్లోనూ వైద్యుల సలహా, నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కానేరదు. ఆరోగ్యానికి సంబంధించిన ఏవైనా సందేహాలు, సమస్యలు ఉన్నా లేదా కొత్త జీవనశైలి మార్పులు పాటించాలన్నా ముందుగా సంబంధిత వైద్యులను సంప్రదించండి).