Kitchen Tips: సాధారణంగా మనం మార్కెట్కు వెళ్లి వారానికి సరిపడా కూరగాయలు తీసుకొస్తూ ఉంటాం. అయితే ఇందులో కరివేపాకును నిల్వ చేయడం కొంచెం తలనొప్పిగా ఉంటుంది. ఫ్రిజ్లో పెట్టినా అది నల్లగా మారిపోతుంది. దీంతో వంటకు వేయడానికి కూడా పనికిరాదు. అయినా కరివేపాకు ఖచ్చితంగా ఉండాల్సిందే. దీన్ని వంటల్లో వేయకపోతే ఏదో లేనట్టుగా ఉంటుంది, రుచి కూడా బాగుండదు. కూరలో కరివేపాకును పక్కన పెట్టవచ్చు, కానీ వంటలో కరివేపాకు లేకుండా ఉండలేం. కాబట్టి ఫ్రిజ్లో నిల్వ చేసిన కరివేపాకు నల్లగా మారకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. వాటితో నెల రోజుల వరకు కూడా తాజాగా ఉంటుంది. సాధారణంగా మనం తాలింపులో, కర్రీలో, చట్నీలో కరివేపాకును ఉపయోగిస్తాం. దీనిలో ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉంటాయి.
ఈ కరివేపాకు వంటకు మంచి సువాసనను ఇవ్వడమే కాకుండా ఎన్నో ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. అయితే సరిగ్గా నిల్వ చేయకపోతే ఫ్రిజ్లో పెట్టినా తేమ వల్ల నల్లగా మారిపోతుంది. దానిపై నల్ల మచ్చలు వచ్చి తాజాదనాన్ని కోల్పోతుంది. ఉష్ణోగ్రత మారుతూ ఉంటుంది కాబట్టి ఫ్రిజ్లో జాగ్రత్తగా నిల్వ చేయాలి.
ఫ్రిజ్లో కరివేపాకును నిల్వ చేసే ముందు అందులో తేమ ఉంటే తొలగించడం మంచిది. కరివేపాకును శుభ్రంగా కడిగి ఆరబెట్టండి. ఆ తర్వాత శుభ్రమైన టవల్తో తుడిచి తేమ లేకుండా చేయండి. ఇప్పుడు ఏదైనా డబ్బాలో లేదా కవర్లో దాన్ని నిల్వ చేసుకోవచ్చు. కొద్దిసేపు గాలికి ఆరబెట్టిన తర్వాత నిల్వ చేస్తే మరింత మంచిది.
కరివేపాకును నేరుగా కాకుండా ఐస్ క్యూబ్స్ రూపంలో కూడా ఫ్రీజ్ చేయవచ్చు. ముందుగా కరివేపాకు ఆకులను తీసి పెట్టుకోండి. కొన్ని ఆకులను తీసుకుని ఐస్ ట్రేలో వేసి నీళ్లతో నింపండి. ఇలా పూర్తిగా కవర్ చేసి ఫ్రీజ్ చేయండి. అవి గడ్డకట్టిన తర్వాత, అవసరమైనప్పుడు వాడుకునేందుకు జిప్ లాక్ బ్యాగ్లో నిల్వ చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో కరివేపాకు ఎక్కువ రోజులు తాజాగా ఉండటమే కాకుండా దాని రుచిని కూడా కోల్పోదు. ఎక్కువ రోజులు వాడాలనుకుంటే ఈ పద్ధతి మంచిది.
కరివేపాకును ఫ్రిజ్లో నిల్వ చేసేటప్పుడు సాధారణంగా ఒక్క నీటి చుక్క కూడా ఉండకుండా జాగ్రత్త పడాలి. తేమ ఉంటే ఆకులు నల్లగా మారి పాడవుతాయి. గాలి చొరబడని కంటైనర్లో తేమ లేకుండా చూసుకోండి. కంటైనర్ కింద టిష్యూ పేపర్ వేసి, నీటి చుక్కలు లేని కరివేపాకు ఆకులను అందులో ఉంచి నిల్వ చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా చాలా రోజులు కరివేపాకును ఫ్రిజ్లో ఉంచవచ్చు.
ఇలాంటి చిన్న చిట్కాలను పాటిస్తే కరివేపాకు ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. ఈ పద్ధతుల్లో నిల్వ చేస్తే కరివేపాకు మంచి సువాసనను కలిగి ఉంటుంది, ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. కరివేపాకు పాడవకుండా సరిగ్గా నిల్వ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉపయోగించుకోవచ్చు.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)