• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /లైఫ్‌స్టైల్
  • /ఉపవాసంలో అలసట, నీరసం రాకుండా కాపాడే 5 సూపర్‌ఫుడ్స్ ఇవే!

ఉపవాసంలో అలసట, నీరసం రాకుండా కాపాడే 5 సూపర్‌ఫుడ్స్ ఇవే!

అక్టోబర్ 11 నుండి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఈ తొమ్మిది రోజులు భక్తులు అమ్మవారిని ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉపవాసాలు ఉంటారు. అయితే, ఉపవాస సమయంలో తరచుగా నీరసంగా అనిపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, మీరు ఈ ఐదు రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల తగినంత శక్తి లభిస్తుంది.

Written ByRenuka Godugu
Published: Oct 11, 2026, 04:47 PM IST|Updated: Oct 11, 2026, 04:49 PM IST
joinshare
ఉపవాసంలో అలసట, నీరసం రాకుండా కాపాడే 5 సూపర్‌ఫుడ్స్ ఇవే!
Image Credit: Navratri Vrat Diet 2026

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Electricity Bill Saving: ఏసీ, ఫ్రిడ్జ్ వాడుతున్నారా? చిన్న సెట్టింగ్‌తో కరెంట్ బిల్లును సగానికి తగ్గించుకోవచ్చు!

Electricity Bill Saving: ఏసీ, ఫ్రిడ్జ్ వాడుతున్నారా? చిన్న సెట్టింగ్‌తో కరెంట్ బిల్లును సగానికి తగ్గించుకోవచ్చు!

2

Indigo Flight: విమానంలో పవర్‌ బ్యాంక్‌ పేలి మంటలు.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం

3

Hyderabad: పెళ్లిపేరుతో నమ్మించి లైంగిక దాడి.. ఖైరతాబాద్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌గా అరెస్ట్..డిపార్ట్ మెంట్ లో కలకలం..

4

ఉపవాసంలో అలసట, నీరసం రాకుండా కాపాడే 5 సూపర్‌ఫుడ్స్ ఇవే!

5

శరీరంలో ఓమేగా-3 లోపించిందా? రోజువారీ డైట్‌లో చేపలకు బదులు ఇవి ట్రై చేయండి!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Navratri Vrat Diet 2026: మీరు దసరా నవరాత్రులు జరుపుకుంటూ, ప్రతిరోజూ దుర్గామాత తొమ్మిది అవతారాలను భక్తితో పూజిస్తూ ఉపవాసాలు ఉంటున్నారా? అక్టోబర్ 11 నుండి ప్రారంభమయ్యే ఈ నవరాత్రులు 20వ తేదీ దశమి వరకు కొనసాగుతాయి. నవరాత్రుల్లో ఉపవాసం ఉండేవారు తరచూ నీరసానికి గురవుతుంటారు. అటువంటి సమయంలో డాక్టర్లు సూచించిన ఈ రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల మీకు శక్తి లభిస్తుంది. మీ డైట్‌లో పండ్లను కూడా చేర్చుకోవచ్చు. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది మరియు శక్తి పెరుగుతుంది. ఉపవాస సమయంలో మనం కొన్ని రకాల ఆహారాలు తీసుకున్నా అవి తగినంత శక్తిని ఇవ్వకపోవచ్చు.

ఉపవాసం ఉన్నప్పుడు తాజా పండ్లకు ప్రాధాన్యత ఇవ్వండి. యాపిల్స్, ఆరెంజ్,  బొప్పాయి, జామపండు వంటి వాటిని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇవి శరీరానికి అవసరమైన ఫ్లూయిడ్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్స్, ఖనిజాలు, విటమిన్స్‌ను అందిస్తాయి. అలాగే, ఒక గుప్పెడు నానబెట్టిన గింజలను కూడా తీసుకోవాలి. దీనివల్ల శక్తితో పాటు ఫైబర్ అందుతుంది. ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది.

మరోవైపు, ప్రోటీన్ ఉండే ఆహారాన్ని కూడా డైట్‌లో చేర్చుకోవాలి. చాలామంది ప్రోటీన్ గురించి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. పాలు, పెరుగు, పన్నీరు, గింజలు, విత్తనాలలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని స్నాక్స్‌లా తీసుకుంటే, నవరాత్రి ఉపవాస సమయంలో మీరు శక్తివంతంగా ఉండగలరు.

మీ డైట్‌లో మైక్రో న్యూట్రియెంట్స్ ఉండేలా చూసుకోవాలి. కేవలం కార్బోహైడ్రేట్స్ మాత్రమే కాకుండా, ఐరన్, కాల్షియం, విటమిన్ బి వంటివి ఉండేలా చూసుకోవాలి. విటమిన్ ఏ (బీటా కెరోటిన్) కోసం క్యారెట్లు, స్వీట్ పొటాటో, పాలకూర వంటివి తీసుకోవాలి. విటమిన్ సి కోసం నిమ్మరసం, బెల్ పేపర్, స్ట్రాబెర్రీ, బ్రోకోలి వంటివి డైట్‌లో చేర్చుకోవాలి. ఇక ఫోలేట్ కోసం ఆకుకూరలు, బీన్స్ వంటివి తినవచ్చు.

మీ కుటుంబంలో ఉండే ఉపవాస నియమాల ప్రకారం, ఇటువంటి ఆహారాలను తీసుకోవడం వల్ల తొమ్మిది రోజుల పాటు మీరు నీరసపడకుండా మీ రోజువారీ పనులను ఆరోగ్యంగా చేసుకోవచ్చు. డైట్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులకు, సమతుల్య ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి. నవరాత్రుల సమయంలో గుమ్మడి గింజలు, చియా విత్తనాలు, పల్లీలు, బాదం వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే గింజలను తీసుకోవాలి. వీటిని పెరుగు లేదా పండ్లతో కలిపి తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది. కడుపు నిండినట్లు అనిపిస్తుంది.

Read Also: సీజన్ మారినప్పుడల్లా జలుబు, జ్వరం వస్తున్నాయా? ఈ 5 సింపుల్ చిట్కాలతో ఇన్ఫెక్షన్లకు బై బై చెప్పండి!

అంతేకాకుండా, ఉపవాస సమయంలో హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. నీటితో పాటు కొబ్బరినీరు, నిమ్మరసం వంటివి కూడా తీసుకోవాలి. ఉపవాస సమయంలో మీకు శక్తిని ఇచ్చే, ఆరోగ్యాన్ని కాపాడే ఆహారాలలో సామలు వంటివి కూడా ఉన్నాయి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఇది అన్నానికి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. సామలతో కిచిడి లేదా ఊటలను కూడా తయారు చేసుకోవచ్చు, అలాగే వీటిని నేరుగా పెరుగుతో కలిపి కూడా తినవచ్చు. (Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న విషయాలు, సూచనలు కేవలం పాఠకుల అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే అందించాం. ఇది ఎలాంటి పరిస్థితుల్లోనూ వైద్యుల సలహా, నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కానేరదు. ఆరోగ్యానికి సంబంధించిన ఏవైనా సందేహాలు, సమస్యలు ఉన్నా లేదా కొత్త జీవనశైలి మార్పులు పాటించాలన్నా ముందుగా సంబంధిత వైద్యులను సంప్రదించండి).

Add Zee News as a Preferred Source
TAGS:
Health