Father brutally murdered her daughter in Adilabad: ఇటీవల చాలా మంది యువతీ, యువకులు ప్రేమ పెళ్లిళ్లకే ఎక్కువగా మొగ్గుచూపిస్తున్నారు. కొన్ని రోజులు పాటు ఇద్దరు డేటింగ్ లు చేసి తమ అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు. ఆ తర్వాత ఏదైన బేధాభి ప్రాయాలు వస్తే బ్రేకప్ లు చెప్పి విడిపోతున్నారు. కొంత మంది తల్లిదండ్రులు తమ పిల్లల ప్రేమ పెళ్లిళ్లను అంగీకరిస్తే, మరికొంత మంది మాత్రం ఇతర కులస్తుల్ని, తమకన్నా తక్కువ హోదా ఉన్న వారిని పెళ్లాడితే హత్యలు చేసేందుకు సైతం వెనుకాడటంలేదు.ఈ క్రమంలో ఇప్పటికే తెలంగాణలో అనేక పరువు హత్య ఘటనలు వార్తలలో నిలిచాయి. తాజాగా.. మరో పరువు హత్య ఘటన ఆదిలాబాద్ లో వెలుగులోకి వచ్చింది.
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉమ్రి గ్రామంకు చెందిన కైలాస్, సుమిత్ర దంపతులు ఉంటున్నారు. వీరికి కళ్యాణి అనే కూతురు ఉంది. ఇటీవల కళ్యాణికి మరో యువకుడితో ఎంగెజ్ మెంట్ చేశారు. దీంతో కూతురు అప్పటి నుంచి బాధపడుతు ఉండేది. ఇటీవల తండ్రి కైలాస్ కూతుర్ని నిలదీయడంతో ఈ పెళ్లి తనకు ఇష్టంలేదని చెప్పింది. తన మేనత్త కొడుకును ప్రేమించానని అతడ్ని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దీంతో ఈ విషయంఅందరికి తెలిస్తేతన పరువు పోతుందని భావించిన కైలాస్ కూతురు నిద్రలో ఉండగా ఆమెను పీక పిసికి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు.
ఆ తర్వాత పక్కగదిలోకి డెడ్ బాడీ తీసుకెళ్లి ఉరికి వేలాడ తీశాడు. ఉదయం తల్లి సుమిత్ర లేచి చూసే సరికి కూతురు ఉరికి వేలాడటం చూసింది. వెంటనే కేకలు వేయగా చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకున్నారు. కూతుర్ని ఉరి నుంచి కిందకు దించి పొలంలోకి తీసుకెళ్లి దహన సంస్కారాల్ని సైతం మూడు గంటల వ్యవధిలోనే పూర్తి చేశారు. దీంతో స్థానికులు తమ లంబాడా సంస్కారం ప్రకారం పెళ్లికానీ యువతి చనిపోతే ఆమెను పూడ్చిపెడతారు.
ప్రస్తుతం యువతి దహన సంస్కారాలు పూర్తి చేయడంతో దీనిపై స్థానికుల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. యువతి తండ్రి కైలాస్ ను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్ లో విచారించగా అసలు దారుణం వెలుగులోకి వచ్చింది. తన పరువు పోతుందని కూతుర్ని నిద్రలో గొంతు పిసికి హతమార్చినట్లు కైలాస్ అంగీకరించాడు. ఈక్రమంలో పరువు కోసం కన్న కూతుర్ని హత్య చేసిన ఘటన ప్రస్తుతం ఆదిలాబాద్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.