వీపుపై బిడ్డ, చేతిలో పని.. ఈ వర్కింగ్ మదర్ స్టోరీ చూస్తే కన్నీళ్లు ఆగవు.. వీడియో వైరల్!
Viral Video: పరిస్ధితులు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. అలాని బాధ్యతలు మాత్రం ఎప్పుడూ ఆగిపోవు. కొన్ని సార్లు జీవితం మనకు ఎన్నో పరీక్షలు పెడుతుంది. ఆ పరీక్షను చిరునవ్వుతో ఎదుర్కున్నప్పుడే .. విజయం మనకు దక్కుతుంది.
Viral Video: పరిస్ధితులు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. అలాని బాధ్యతలు మాత్రం ఎప్పుడూ ఆగిపోవు. కొన్ని సార్లు జీవితం మనకు ఎన్నో పరీక్షలు పెడుతుంది. ఆ పరీక్షను చిరునవ్వుతో ఎదుర్కున్నప్పుడే .. విజయం మనకు దక్కుతుంది. సరిగ్గా అలాంటి మానవీయ కోణంతో కూడిన ఒక ద్రుశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. లక్షలాది మంది గుండెలను కదిలిస్తోంది. నెట్టింట వైరల్ అవుతున్న ఆ వీడియోలోని మహిళ.. ఒక చేతితో తన దినచర్యలో భాగంగా కష్టపడుతుంటే.. ఆమె వీపుపై నిద్రిస్తున్న బిడ్డ కనిపిస్తుంది. పరిస్థితులకు లొంగకుండా.. తన పసిపాప భవిష్యత్తుకోసం ఆ మహిళ సాగిస్తున్న జీవన పోరాటం చూస్తే.. అమ్మ ప్రేమకు, ఆమె శక్తికి సెల్యూట్ చేయకుండా అస్సలు ఉండలేము.
అసలు విషయానికి వస్తే..
జమ్మూ కాశ్మీర్ లోని లఢఖ్ లో ఓ మహిళ తన పసిబిడ్డను వీపుపై కట్టుకుని పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న వైరల్ వీడియో సోషల్ మీడియాను కదిలిస్తోంది. అమ్మ బాధ్యతను.. జీవన పోరాటాన్ని కళ్లకు కట్టే ఈ ద్రుశ్యం నెటిజన్ల గుండెలను తాకింది. లక్షలాది మంది ఆమె కష్టాన్ని చూసి చలించిపోయారు. ఎందరో ఆ అమ్మకు అండగా ఉండేందుకు ముందుకు వచ్చారు. ప్రియాంక స్మైల్స్ అనే ఇన్ స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను తన అకౌంట్లో పోస్ట్ చేశారు.
ఈ వీడియోలో ఓ తల్లి తన పసిపాపను వెచ్చని బట్టలతో చుట్టి వీపునకు సురక్షితంగా కట్టుకుని ఉంది కనిపిస్తుంది. వాహనదారులకు పెట్రోల్ నింపుతూ.. తన విధులను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా నిర్వర్తిస్తున్న తీరు చూపరులను ఆకట్టుకుంది. కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. వ్రుత్తికి న్యాయం చేస్తున్న ఆమె నిబద్ధతకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. ఈ వీడియో పోస్టు చేసిన తక్కువ సమయంలోనే కోట్లాది మంది చూశారు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపించారు. ఆమె నిజమైన యోధరాలు.. స్వావలంబన కలిగిన శక్తివంతమైన మహిళ.. ఆధునిక కాలపు ఝాన్సీ రాణి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పిల్లల పెంపకం.. ఇంటి బాధ్యతలను మోస్తూనే బయట పనిచేసే మహిళల కష్టానికి ఈ వీడియో అద్దం పడుతుందని మరికొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరెంతో మంది భావోద్వేగానికి లోనయ్యారు.
అయితే సోషల్ మీడియాలో వచ్చిన ఈ రెస్పాన్స్ చూసి యాంకా పర్దేశీ.. ఆ మహిళను సంప్రదించారు. ఆమెతో వీడియో కాల్ మాట్లాడారు. తన వీడియో ఎంత పెద్ద సంచలన క్రియేట్ చేసిందో ఆమెకు వివరించారు. తన కోట్లాది మందికి చేరువైనా.. ఆ విషయం ఆ తల్లికి అప్పటి వరకు తెలియకపోవడం గమనార్హం. నెటిజన్ల నుంచి సేకరించిన విరాళాలను తన బిడ్డ భవిష్యత్తు కోసం అందిస్తామని చెప్పడంతో ఆ మహిళ సంతోషానికి అవధులులేకుండా పోయాయి.