SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

వాటర్ గీజర్ వాడేవారు జాగ్రత్త.. ఆన్ చేసే ముందు ఈ 5 సేఫ్టీ చెక్స్ తప్పక చేయండి!

ఇంట్లో గీజర్లు వాడేవారు సాధారణంగా ఈ సీజన్‌లో ఎండ తగ్గి వర్షాలు పడే అవకాశం ఉండటంతో గీజర్లను ముందే వాడటం ప్రారంభిస్తారు. ప్రస్తుతం వాతావరణం వేడిగా ఉన్నప్పటికీ, కొందరు వేడి నీళ్లే వాడాల్సి వస్తోంది. దీనివల్ల గీజర్ వాడేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే ప్రాణాపాయం కూడా సంభవించే అవకాశం ఉంది.

Written By Renuka Godugu
Published: Oct 17, 2026, 10:15 AM IST | Updated: Oct 17, 2026, 10:18 AM IST
Image Credit: Geyser Safety Tips:
Join

Geyser Safety Tips: ఉత్తరాది రాష్ట్రాల్లో చలికాలం మొదలవ్వడం, ఏపీలో కూడా చల్లని వాతావరణం, వర్షాలు పడుతున్నాయి. అక్టోబర్ నెల రాగానే చాలామంది గీజర్లను వాడుతుంటారు. ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం వల్ల ఎండ తీవ్రత తగ్గకపోయినా, కొందరు గీజర్ లేనిదే స్నానం చేయలేరు. మీరు కూడా గీజర్లను వాడటం ప్రారంభిస్తుంటే, ముందుగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. లేకపోతే కరెంట్ బిల్లులు పెరగడమే కాకుండా, భద్రత పరంగా ప్రాణాలకే ముప్పు కలిగే ప్రమాదం ఉంది.

సాధారణంగా గీజర్‌ను ఆన్ చేసినప్పుడు ఎక్కువ సమయం పాటు ఆన్ చేసి వదిలేయకూడదు. దీనివల్ల కరెంట్ బిల్లులు పెరగడమే కాకుండా, గీజర్లు పేలిపోయే ప్రమాదం కూడా ఉంది. అలాగే, గీజర్‌ను కిటికీ దగ్గరగా ఉన్న చోట ఏర్పాటు చేయాలి. స్టోరేజ్ ట్యాంకులో మినరల్స్ హీటింగ్ ఎలిమెంట్‌పై పేరుకుపోతాయి. ఈ పొర వల్ల నీరు వేడెక్కడానికి ఎక్కువ సమయం పడుతుంది. తద్వారా కరెంట్ బిల్లు కూడా పెరుగుతుంది. ఒక్కోసారి గీజర్ నుండి శబ్దాలు కూడా రావచ్చు. అటువంటప్పుడు వెంటనే ప్రొఫెషనల్ సర్వీసింగ్ నిపుణులను పిలిపించి స్కేలింగ్, స్పీడ్ చెక్ చేయించుకోవాలి. దీనివల్ల కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది.

స్టోరేజ్ గీజర్లలో ఉండే అనోడ్ రాడ్, లోపలి మెటల్ ట్యాంకును మినరల్స్ నుండి రక్షిస్తుంది. కాలక్రమేణా ఈ రాడ్ పూర్తిగా క్షీణించిపోతుంది. కాబట్టి టెక్నీషియన్‌తో దీనిని చెక్ చేయించడం మంచిది, లేకపోతే తుప్పు పట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ అవసరమైతే ఆ రాడ్‌ను మార్చుకోవడమే ఉత్తమం.

గీజర్‌లోని థర్మోస్టాట్ నీటి ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. అది ఓవర్ హీట్ కాకుండా చూస్తుంది. లోపల ప్రెషర్ పెరిగినప్పుడు, ప్రెషర్ రిలీఫ్ సేఫ్టీ వాల్వ్ దానిని విడుదల చేస్తుంది. ఈ రెండు అంశాలను భద్రత కోసం తప్పనిసరిగా చెక్ చేయించుకోవాలి. వాల్వ్ , థర్మోస్టాట్ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో కూడా పరిశీలించాలి.

గీజర్ విద్యుత్, నీటితో కూడిన పరికరం కాబట్టి, భద్రత విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. చలికాలం రాకముందే వైరింగ్, సాకెట్, పవర్ ప్లగ్, ఎర్తింగ్ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఇన్సులేషన్‌లో ఏవైనా కాలిన గుర్తులు ఉన్నా లేదా కనెక్షన్లు లూజ్‌గా ఉన్నా వెంటనే ఫిక్స్ చేయించండి, లేకపోతే షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంది.

Read Also: ఉడకబెట్టిన గుడ్లను ఎంతసేపట్లో తినాలి? ఫ్రిజ్‌లో ఇలా నిల్వ చేస్తున్నారా? తీవ్రమైన రోగాల బారిన పడే ప్రమాదం!

Read Also: సీజన్ మారినప్పుడల్లా జలుబు, జ్వరం వస్తున్నాయా? ఈ 5 సింపుల్ చిట్కాలతో ఇన్ఫెక్షన్లకు బై బై చెప్పండి!
 

ఇలాంటి పొరపాట్ల వల్ల ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే ఇన్లెట్ , అవుట్‌లెట్ పైపులను కూడా చెక్ చేయించండి. ఎక్కడైనా లీకేజీలు ఉన్నా లేదా జాయింట్స్ వద్ద క్రాక్స్ ఉన్నా వెంటనే ప్లంబర్‌తో ఫిక్స్ చేయించండి. వేడి నీటి వల్ల పైపులు లేదా కనెక్షన్లకు స్ట్రక్చరల్ డ్యామేజ్ ఏమైనా జరిగితే వెంటనే సరిచేయించుకోవాలి. గీజర్లను వాడే ముందు ఇలాంటి సేఫ్టీ టిప్స్ పాటించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండవచ్చు. ఉదయం స్కూలు లేదా ఆఫీసులకు వెళ్లే సమయంలో హడావిడి పడకుండా, ముందుగానే గీజర్‌ను సర్వీసింగ్ చేయించుకోవడం మంచిది. గీజర్లను చెక్ చేయించేటప్పుడు కేవలం అనుభవం ఉన్న ప్రొఫెషనల్ నిపుణులను మాత్రమే సంప్రదించండి.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES