SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

అర్నబ్‌, మురసు తర్వాత APకి మరో తుపాను ముప్పు ..!

Another Toofan Effect: ఆంధ్ర ప్రదేశ్‌కు వరుస తుపానులు వణికిస్తున్నాయి. ఒక దాని తర్వాత మరొక తుపాను ఏపీపై విరుచుకుపడుతోంది. ఇప్పటికే ఆర్నాబ్‌తో ఏపీలో పెను విధ్వంసం చోటు చేసుకుంది.ఆ తర్వాత మురసు కూడా పుట్టి ముంచింది. తాజాగా ఈ రెండు తుపానుల ముప్పు తొలిగిపోయిందనుకునే సమయంలో ఏపీని మరో తుపాను భయం వెంటాడుతోంది.

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 11, 2026, 07:44 AM IST | Updated: Nov 11, 2026, 07:47 AM IST
Image Credit: AP Another Toofan
Join

New Toofan: ఆంధ్ర ప్రదేశ్ ను వరుణుడు వదలడం లేదు. ఈ సారి ఎల్‌నినో ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ సహా పలు ప్రాంతాల్లో కురవాల్సిన వర్షపాతం కంటే తక్కువే కురిసింది. ఇప్పటికే ఆర్నాబ్‌ తుపాను ప్రభావంతో ఏపీలోని తీర ప్రాంతాల్లోని రోడ్లు కోతకు గురయ్యాయి. అప్పటి వరకు ఎంతో ఆహ్లాదంగా ఉండే బీచ్‌లను రాకాసి అలల తాకిడితో ఆనవాళ్లు లేకుండా పోయాయి. పలు ప్రాంతాల్లో సముద్రం కొంత మేర భూమిని మింగేసంది. వీటి ప్రభావంతో ఏపీలో విద్యుల స్తంభాలు నేలకొరిగాయి. దీంతో పలు గ్రామాలు కొన్ని రోజుల పాటు చీకట్లో మగ్గిపోయారు. ఇంటర్నెట్ కనెక్షన్ వంటి కీలకమైన మౌలిక సదుపాయాలు ఏమి లేకపోవడంతో బయట ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితిలు నెలకొన్నాయి.

వరుస తుపానులు.. 

మరోవైపు వరుస తుపానులో ఇబ్బందిపడుతున్న APకి వాతావరణ శాఖ బిగ్‌ అలర్ట్‌ ఇచ్చింది. ఈ నెల 13న బంగాళాఖాతంలో అల్పపీడపం ఏర్పడుతుందని, అది క్రమేణా బలపడి తుపానుగా మారుతుందంటూ బాంబు పేల్చింది.  అది నవంబర్ 17 నాటికి దక్షిణ AP, ఉత్తర తమిళనాడు తీరానికి దగ్గరగా వస్తుందంటోంది.

ఈ నెల 13న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్నడే ఛాన్స్‌..
దీని ప్రభావంతో తీర ప్రాంతాల్లో వాతావరణం మారి, వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటోంది.  రానున్న రోజుల్లో సముద్రంలోని పరిస్థితులు, గాలుల వేగాన్ని బట్టి అల్పపీడనం తుపానుగా మారే అవకాశాలున్నాయంటోంది.  సముద్ర పరిస్థితులను  వాతావరణ మార్పులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామంటోంది వాతావరణశాఖ. ముఖ్యంగా దక్షిణ ఆంధ్ర ప్రదేశ్‌లో దీని ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ముఖ్యంగా గుంటూరు, నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతవారణ శాఖ తెలిపింది.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES