SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

AP Cabinet decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఆశా కార్యకర్తలకు గ్రాట్యుటీ..రూ.1.50 లక్షల వరకు ప్రయోజనం..!

AP Cabinet Key Decisions: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. సచివాలయంలో జరిగిన ఈ భేటీలో ప్రజలకు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై మంత్రివర్గం చర్చించింది. ఆరోగ్యం, విద్య, సంక్షేమం, భూములు, మౌలిక వసతులకు సంబంధించి మొత్తం 12 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Written By Vishnu Priya
Published: Oct 07, 2026, 04:05 PM IST | Updated: Oct 07, 2026, 04:14 PM IST
Join

AP Cabinet Key Decisions: ఆశా కార్యకర్తల కుటుంబాలకు ఊరట కలిగించే నిర్ణయం ఈ సమావేశంలో తీసుకున్నారు. విధులు నిర్వహిస్తూ మరణించిన అర్హత ఉన్న ఆశా కార్యకర్తల కుటుంబాలకు గ్రాట్యుటీ ఇవ్వాలని నిర్ణయించారు. ఒక్కో సంవత్సరం సేవకు రూ.5 వేల చొప్పున ఈ మొత్తాన్ని లెక్కిస్తారు. అయితే ఒక కుటుంబానికి గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు గ్రాట్యుటీ అందుతుంది.

వైద్య రంగంలో కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బాపట్ల జిల్లా రేపల్లెలో ప్రస్తుతం ఉన్న 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను 100 పడకల ఆసుపత్రిగా మార్చేందుకు కేబినెట్ అనుమతి ఇచ్చింది. ఆసుపత్రి భవనాలు, అవసరమైన ఆధునిక వైద్య పరికరాల కోసం రూ.58.42 కోట్లను కేటాయించారు. కొత్త ఆసుపత్రి కోసం 66 అదనపు పోస్టులను కూడా మంజూరు చేయనున్నారు. ఉద్యానవన శాఖకు సంబంధించిన సమాచారాన్ని ఒకే వ్యవస్థలో నిర్వహించేందుకు APHIMS ఏర్పాటుకు కూడా ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.20.62 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. మొత్తం 72 నెలల కాలంలో ఈ వ్యవస్థను అమలు చేయనున్నారు.

తల్లికి వందనం పథకానికి సంబంధించి 2026-27 సంవత్సరానికి సంబంధించిన మార్గదర్శకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థుల ఆహార ఖర్చుల పెంపునకు సంబంధించిన ఉత్తర్వులకు కూడా ఆమోదం ఇచ్చింది. విశాఖపట్నం జిల్లా మరికవలసలో గిరిజన విద్యార్థుల కోసం ప్రత్యేక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ IIT-JEE, NEET వంటి పోటీ పరీక్షలకు నిపుణుల ద్వారా ప్రత్యేక రెసిడెన్షియల్ కోచింగ్ అందించనున్నారు.

విదేశీ విద్యకు సంబంధించి కూడా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ ఉన్నత విద్యా సంస్థలు, ప్రముఖ ప్రైవేట్ యూనివర్సిటీల క్యాంపస్‌లను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసేందుకు కొత్త పాలసీ-2026కి ఆమోదం తెలిపింది. ఈ సంస్థలకు అవసరమైన ప్రోత్సాహకాలు, సౌకర్యాలను కల్పించేలా విధానాన్ని రూపొందించనున్నారు.

ఇక ఎన్టీఆర్ జిల్లాలోని కొన్ని ప్రభుత్వ భూముల ఆక్రమణల క్రమబద్ధీకరణకు సంబంధించిన గత ఉత్తర్వులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వైఎస్సార్ కడప జిల్లా పాతూరులో ఆలయ అభివృద్ధి కోసం 7.66 ఎకరాల ప్రభుత్వ భూమిని దేవాదాయ శాఖకు బదిలీ చేయడానికి కూడా అనుమతి ఇచ్చారు. ప్రకాశం జిల్లా కొండపిలో బాలుర రెసిడెన్షియల్ స్కూల్, హాస్టల్ నిర్మాణం కోసం 7 ఎకరాల భూమి వర్గీకరణ మార్పుకు ఆమోదం లభించింది. కుప్పం ప్రాంతంలో అధికారుల అతిథి గృహం నిర్మాణానికి 1.69 ఎకరాల భూమి వర్గీకరణ మార్పునకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Read More: Mangalagiri Lodge Incident: ప్రమోషన్ వీడియో అని పిలిచి మంగళగిరిలో యువతిపై అత్యాచారం..రూ.14,000 దోపిడి!

Read More: AP PRC Chairman: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..పీఆర్సీ ఛైర్మన్‌ను నియామం..వచ్చే ఏడాది జీతాల పెంపు?

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  

ZEENEWS TRENDING STORIES