• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /రాష్ట్రంలో కురుస్తోన్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష..

రాష్ట్రంలో కురుస్తోన్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష..

AP CM Review Meeting On Heavy Rains:బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కారణంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలపై చంద్రబాబు నాయుడు రాష్ట్ర సీఎస్‌తో పాటు డీజీపీతో పాటు ఆయా శాఖలకు చెందిన అధికారులు, మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Sep 23, 2026, 12:21 PM IST|Updated: Sep 23, 2026, 12:29 PM IST
joinshare
రాష్ట్రంలో కురుస్తోన్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష..
Image Credit: Chandrababu Naidu Review Meeting on Rains

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Rain Alert CM Review: ఆంధ్రప్రదేశ్‌ తీరం వైపు వాయుగుడం దూసుకొస్తుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర వైపు వస్తోంది. తీరానికి సమీపిస్తున్న కొద్దీ గాలుల తీవ్రత పెరుగుతోంది.ఈ రోజు మధ్యాహ్నం శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం - కవిటి మధ్య తీరం దాటే అవకాశం ఉందని  అధికారులు తెలిపారు.

వాతావరణ శాఖ అప్రమత్తం.. 
తీరం దాటే సమయంలో గంటలకు 85 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, పోలవరం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని  అధికారులు తెలిపారు. ఈ నెల 24, 25వ తేదీల్లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలకు ఆస్కారం ఉందని  అధికారులు తెలిపారు.

121 మండలాల్లో  సాధారణ వర్షపాతం.. 
మొత్తంగా 261 మండలాల్లో 129 మండలాకు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. 121 మండలాల్లో సాధారణ వర్షపాతం.. 9 మండలాల్లో అతి భారీ వర్షం.. 2 మండలాలకు తీవ్ర వర్షాలు పడే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా, గోదావరి జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపోర్లే అవకాశాలున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. యుద్ధ ప్రాతిపదికన తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరద ముంపు పొంచి ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నదుల్లో ప్రవాహాలను ఎప్పటికప్పుడు మానిటర్ చేసి... రిజర్వాయర్లలో నీటి నిల్వలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్దేశం చేశారు.

Also Read:ప్రధానిగా 12 యేళ్లు.. ప్రభుత్వాధినేతగా@25ఇయర్స్.. మోడీ ఖాతాలో రేర్ రికార్డులు..

Also Read: ప్రపంచంలో మోస్ట్ పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్‌లున్న దేశాలు.. భారత్ ప్లేస్ ఎక్కడంటే..!!

Add Zee News as a Preferred Source
TAGS:
AP News
Vijayawada
Chandrababu Naidu
AP Weather
Weather Update