• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏపీలో పెరిగిన జంపింగ్ జపాంగ్‌లు..

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏపీలో పెరిగిన జంపింగ్ జపాంగ్‌లు..

AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలను అనుకూలంగా మార్చుకుని పట్టుసాధించేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ ముందే ప్రజానాడిని పసిగట్టిన కొందరు రాజకీయ పార్టీలను మారి.. ఆయా పార్టీల ద్వారా ఎన్నికల బరిలో దిగాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుచరులు అధికార పార్టీవైపు అడుగులు వేస్తున్నారు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 18, 2026, 05:13 AM IST|Updated: Oct 18, 2026, 05:14 AM IST
joinshare
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏపీలో పెరిగిన జంపింగ్ జపాంగ్‌లు..
Image Credit: AP Local Body Elections (File Pic/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
తెలంగాణలో ఎల్ నినో ప్రభావం.. ప్రభుత్వం కిం కర్తవ్యం..!!

తెలంగాణలో ఎల్ నినో ప్రభావం.. ప్రభుత్వం కిం కర్తవ్యం..!!

2

Kolkata Stampede: కోల్ కతా దుర్గామండపంలో తొక్కిసలాట.. 19 కి చేరిన మృతుల సంఖ్య.. ఎక్స్ గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించిన సీఎం సువేందు..

3

వంగవీటి రాధాకృష్ణ కొత్త పొలిటికల్ జర్నీ.. ఈ సారైనా ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..!!

4

రాజకీయ పార్టీలకు అగ్నిపరీక్షగా మారిన స్థానిక ఎన్నికలు.. తాడో పేడో..

5

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏపీలో పెరిగిన జంపింగ్ జపాంగ్‌లు..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

AP Local body Elections 2026: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ప్రతిపక్ష వైసీపీకి చెందిన నేతలు కండువ మార్చే పనిలో పడ్డారు. దాదాపు అన్నిజిల్లాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ అనుచరులు… పసుపు కండువా కప్పుకోడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎన్నికల ముందుగా ప్రతిపక్షానికి అధికార పార్టీ నాయకులు షాకిచ్చి మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు.

ఖర్చు పెట్టేవారికే మొదటి ప్రాధాన్యత.. 
ఎత్తులు… పైఎత్తులు.. వేస్తూ ఎన్నికల్లో నాలుగు రూపాయలు ఖర్చుచేసే వారికి రాజకీయ పార్టీలు  ప్రాధాన్యత ఇస్తున్నాయి. లోకల్ బాడీ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు స్థానిక సంస్థల ఎన్నికలు సెమీఫైనల్ గా భావించి సత్తాచాటేందుకు తెలుగు దేశం పార్టీ ప్రయత్నిస్తోంది.

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న..
కుప్పం నియోజకవర్గంలోరాజకీయ పరిణామాలు ఆసక్తి రేకెత్తించాయి. ఎన్నికలకు ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దిమ్మతిరిగే షాకిచ్చారు. ఇన్నాళ్లు చంద్రబాబు ఇలాఖాలో  పుంజుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుదేలయ్యే విధంగా వ్యూహరచన చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మద్ధతుదారులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. చంద్రబాబు నాయకత్వాన్ని సమర్థిస్తూ టీడీపీకి పార్టీకి జైకొట్టారు.


కుప్పం ప్రాంతానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్ధతు దారులు టీడీపీ కుండువా కప్పుకున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు టీడీపీలో చేరాయి. కుప్పం మున్సిపల్ వైస్ చైర్మన్ మునుస్వామి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విద్యాసాగర్ తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కుండవా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం నుంచి రాయలసీమలోని అనంతపురం జిల్లాల వరకు ఆ పార్టీని వీడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా కుప్పంలోని వైసీపీ నేతలు.. స్థానిక సంస్థల ఎన్నికల ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనుంచి  టీడీపీలో చేరడం ఆసక్తికరంగా మారింది. ఎన్నికల బరిలో దిగాలనుకున్న అభ్యర్థుల్లో ఎవరికి ప్రాధాన్యత ఇస్తారనే అంశం చర్చనీయాంశమైంది. టీడీపీ కూటమిలో జనసేన, భారతీయ జనతాపార్టీ తరఫున నగర కార్పోరేషన్లు, మున్సిపాల్టీలను, కార్పోరేట్ డివిజన్లు, మున్సిపల్ వార్డులను పంచుకునే విషయంపై తర్జనభర్జన పడుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనుంచి కూటమిలోకి వచ్చేవారిని సంతృప్తపరచి పార్టీతరఫున ఎన్నికల బరిలో దింపేందుకు నాయకులు మల్లగుల్లాలుపడుతున్నారు.

టీడీపీ కండువా కప్పుకున్న బొత్స మేనల్లుడు..

ఇక విజయనగరం జడ్పీ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ కీలక నేత బొత్స సత్యనారాయణ సమీప బంధువు మజ్జి శ్రీను అలియాస్ చిన్న శ్రీను ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనుంచి బయటకొచ్చారు.  టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. జిల్లాలోని ఆయన ప్రధాన అనుచరులు కూడా టీడీపీలో చేరిపోయారు. దీంతో జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోయిందనే ఓ చర్చ సాగుతోంది. అలాగే అనకాపల్లి, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు తదితర జిల్లాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.

ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలుగా, ప్రజా ప్రతినిధులుగా ఉన్నవారి అధికారపార్టీలో చేరిపోయారు. చిలకలూరిపేటకు చెందిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి,  ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేనేత కార్మిక సంఘ అధ్యక్షుడు జగ్గారపు రామమోహన్ రావు,  తాడేపల్లికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు పెద్దింటి బాబూరావు, మరియన్న, నందిగం సదాశివరావు  తెలుగు దేశంపార్టీలో చేరిపోయారు.  వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఇంకా చాలామంది నేతలు టీడీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని, త్వరలోనే మరిన్ని చేరికలు ఉంటాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగులేని తెలుగు దేశం.. 
అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో చిన్న శ్రీను, ఆయన కుమార్తె సిరి సహస్ర టీడీపీ కండువా కప్పుకున్నారు.  స్థానిక సంస్థల ఎన్నికలతో ఏపీలో తిరుగులేని రాజకీయశక్తిగా తెలుగుదేశంపార్టీ అవతరిస్తుందని టీడీపీ నేతలు అభిప్రాయం వ్యక్తంచేశారు.  విజయనగరం జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వంగలపూడి అనిత, జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున, ఎంపీ అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు బేబినాయన, అదితి గజపతిరాజు, కళా వెంకట్రావు వంటి పలువురు ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నేతలు అనందం వ్యక్తంచేశారు.

(రచయత.. మునిరాజ్ జీ న్యూస్ డెస్క్ సౌజన్యంతో)
 

Add Zee News as a Preferred Source
TAGS:
AP News
Andhra Pradesh
TDP
BJP
YCP