SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

AP Rain Alert: ఏపీ వాసులకు వాతావరణ శాఖ హెచ్చరిక..నేడు, రేపు ఈ జిల్లాల్లో పిడుగులతో భారీ వర్షాలు!

AP Rain Alert News: ఆంధ్రప్రదేశ్‌లో బలమైన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఈ ఆవర్తనం వల్ల తీర ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే వీలుంది. రాయలసీమతో పాటు వివిధ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు, మత్స్యకారులు, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Written By Harish Darla
Published: Oct 04, 2026, 03:03 PM IST | Updated: Oct 04, 2026, 03:05 PM IST
Join

AP Rain Alert News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రాబోయే మూడు రోజుల పాటు వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి సుమారు 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో బలమైన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, యానాం పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ జల్లులు కురవవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

వర్ష ప్రభావిత జిల్లాలు..
ఆదివారం నాడు అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశముందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. అదేవిధంగా రాయలసీమలో ఆదివారం అక్కడక్కడా వర్షాలు పడనుండగా, సోమవారం నాటికి ఉరుములు, మెరుపుల హోరు మరింత పెరిగే అవకాశం ఉంది.

వాతావరణ మార్పులు, ప్రజలకు సూచనలు..
ప్రస్తుతం ఈశాన్య రుతుపవనాల ప్రభావం ప్రారంభమయ్యే సమయం కావడం వల్ల రాష్ట్రంలో వాతావరణం మారుతోందని అధికారులు వివరించారు. ఈ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో రైతులు, వ్యవసాయ కూలీలు, లోతట్టు ప్రాంత వాసులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. 

సముద్రంలోకి చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు, తీరప్రాంత ప్రజలు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రహదారులపై వెళ్లే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ అధికారుల మార్గదర్శకాలను పాటిస్తూ అత్యవసరం లేని ప్రయాణాలను నివారించడం మంచిదని సూచించారు.

అక్టోబర్‌లో మరొక అల్పపీడన ముప్పు..
రాష్ట్రంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పాటు అక్టోబర్ నెల అంతటా వర్ష సూచనలు ఉన్నాయని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. అక్టోబర్ 12వ తేదీన ఉత్తర అండమాన్ సముద్రంపై కొత్తగా ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని తెలిపింది. దాని ప్రభావంతో అక్టోబర్ 13 నాటికి అండమాన్ సముద్రంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, ఫలితంగా అక్టోబర్ మాసంలోనూ వర్షాలు పడతాయని అంచనా వేసింది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES