• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /School Holidays: ఇవాళ కూడా స్కూళ్లకు సెలవు..తీరం దాటిన వాయుగుండం..ముఖ్యమంత్రి కీలక నిర్ణయం!

School Holidays: ఇవాళ కూడా స్కూళ్లకు సెలవు..తీరం దాటిన వాయుగుండం..ముఖ్యమంత్రి కీలక నిర్ణయం!

AP School Holidays: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం అర్ధరాత్రి వేళ తీరం దాటడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రతికూల వాతావరణం నేపథ్యంలో అధికారులు స్కూళ్లకు సెలవు ప్రకటించగా.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో అత్యవసర టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.

Written ByHarish Darla
Published: Sep 24, 2026, 08:04 AM IST|Updated: Sep 24, 2026, 08:10 AM IST
joinshare
School Holidays: ఇవాళ కూడా స్కూళ్లకు సెలవు..తీరం దాటిన వాయుగుండం..ముఖ్యమంత్రి కీలక నిర్ణయం!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

AP School Holidays: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో తీరం దాటిందని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సీఎం నారా చంద్రబాబు నాయుడికి నివేదించారు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు యంత్రాంగం అంతా క్షేత్రస్థాయిలోనే అందుబాటులో ఉండాలని, ఎక్కడా చిన్నపాటి ప్రాణనష్టం కూడా జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తీరం దాటిన తర్వాతి రోజుల్లో కూడా వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, సెప్టెంబర్ 24, 25 తేదీలలో కలెక్టర్లు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

పాఠశాలలు, కళాశాలలకు సెలవుల ప్రకటన..
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల విద్యార్థుల రాకపోకలకు ఎలాంటి ప్రమాదం లేదా అసౌకర్యం కలగకుండా జాగ్రత్త చర్యగా ఎన్‌టీఆర్ జిల్లాలోని అన్ని అంగన్వాడీ సెంటర్లు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు 24.09.2026 (గురువారం) ఒక రోజు సెలవు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. ఈ ఉత్తర్వులను పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. వర్ష తీవ్రతను బట్టి ఇతర ప్రభావిత జిల్లాల్లోనూ సెలవులు ప్రకటించాలని సీఎం సూచించారు.

సహాయక చర్యలు, కంట్రోల్ రూమ్ ఏర్పాటు..
నదులు, రిజర్వాయర్లలోకి వచ్చే వరద నీటి ప్రవాహాన్ని నిరంతరం అంచనా వేస్తూ క్షేత్రస్థాయికి సమాచారం అందించాలని సీఎం ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలో వర్షాల వల్ల దెబ్బతిన్న వరి పంట విస్తీర్ణాన్ని వెంటనే అంచనా వేయాలన్నారు. బాధితులకు తాగునీరు, ఆహారం, వైద్య సదుపాయాలు అందిస్తూ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలన్నారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు తీసుకురావాలని సూచించారు.

ఈ సమీక్షలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పశ్చిమ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, పోలవరం, కృష్ణా జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ప్రజల అత్యవసర సహాయం కోసం 112, 1070, 1800-425-0101 టోల్ ఫ్రీ నంబర్లతో స్టేట్ కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంది.

Add Zee News as a Preferred Source
TAGS:
Andhra Pradesh
School Holiday
Telugu News
Rain News
AP Weather