బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాలు..
Bay Of Bengal Low Pressure: బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులు, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని వాతావరణశాఖ సూచించింది. ఏపీలోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Heavy Rain Alert for key Districts: గత కొన్ని రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసాయి. ప్రస్తుతం వర్షాలు నెమ్మదించాయి. అంతేకాదు పలు ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా వాతావరణం ప్రధానంగా మేఘావృతమై చల్లగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన..
ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర తీరప్రాంత జిల్లాల్లో భిన్న వాతావరణం నెలకొంది. శ్రీకాకుళం, అనకాపల్లి, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. కొన్నిచోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో తీరప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఉరుములు, మెరుపలతో కూడిన వర్షాలు..
అంతేకాదు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లే సమయంలో వాతావరణ హెచ్చరికలను గమనించాలని స్పష్టం చేశారు. అంతేకాదు ఎపుడు వెళ్లి వాతావరణ శాఖకు సంబంధించిన సూచనలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. మరోవైపు రాయలసీమ జిల్లాలైన కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోనూ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.