• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /తీరం దాటుతున్న అర్నాబ్ తుఫాను.. 25 సెంటీమీటర్ల భారీ వర్షం.. 6 జిల్లాల్లో హై అలర్ట్, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచన!

తీరం దాటుతున్న అర్నాబ్ తుఫాను.. 25 సెంటీమీటర్ల భారీ వర్షం.. 6 జిల్లాల్లో హై అలర్ట్, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచన!

బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నాబ్ అతి తీవ్ర తుఫాను తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. మరికాసేపట్లో యానం సమీపంలో తీరం దాటే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆరు గంటల్లో గంటకు సుమారు 20 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా ఇది పయనిస్తోంది. పోలవరం నుంచి రాజోలు మధ్య 90 కిలోమీటర్ల సముద్ర తీరంలో ఎక్కడైనా తీరం దాటే అవకాశం ఉంది. అర్నాబ్ తుఫాను బీభత్సానికి 24 గంటల్లో కుండపోత వర్షం కురిసింది. అత్యధికంగా అనకాపల్లి జిల్లాల్లో కల్లూరుపాలెం 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం

Written ByRenuka Godugu
Published: Oct 28, 2026, 07:15 AM IST|Updated: Oct 28, 2026, 07:22 AM IST
joinshare
తీరం దాటుతున్న అర్నాబ్ తుఫాను.. 25 సెంటీమీటర్ల భారీ వర్షం.. 6 జిల్లాల్లో హై అలర్ట్, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచన!
Image Credit: Arnab Cyclone Alert:

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
తీరం దాటుతున్న అర్నాబ్ తుఫాను.. 25 సెంటీమీటర్ల భారీ వర్షం.. 6 జిల్లాల్లో హై అలర్ట్, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచన!

తీరం దాటుతున్న అర్నాబ్ తుఫాను.. 25 సెంటీమీటర్ల భారీ వర్షం.. 6 జిల్లాల్లో హై అలర్ట్, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచన!

2

Arnab on Telangana: అర్నాబ్ తుపాన్ ప్రభావం.. తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు అతిభారీ వర్షాలు.. ఐఎండీ బిగ్ అలర్ట్..

3

CA Manish Malhotra: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులకు ఏఐ సాయం.. సీఏ మణీష్ మల్హోత్రా ఉపయోగిస్తున్న టూల్ ఇదే!

4

TG Drought Mandals: తెలంగాణలో ఎల్ నినో ప్రభావం వేళ.. కరువు మండలాలను ప్రకటించిన సీఎం రేవంత్ ప్రభుత్వం..

5

Arnab Cyclone: ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలే ముఖ్యం.. అర్నబ్ తుపాన్‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రెస్ మీట్..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Arnab Cyclone Alert: అర్నాబ్‌ తుఫాను కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గడిచిన 24 గంటల్లో భారీ వర్షం కురిసింది. కన్నూరు పాలెంలో 25 సెంటీమీటర్లు, విశాఖలో 24 సెంటీమీటర్లు, అచ్యుతాపురంలో 23 సెంటీమీటర్లు, సింహాచలంలో 22, దేశపాత్రునిపాలెంలో 21, బుచ్చయ్యపేట, కోడూరు, గంధవరంలో 20, కాకినాడలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఉప్పాడ తీరంలో సముద్రం ఉగ్రరూపం దాల్చింది.  అర్నాబ్‌ తుఫాను తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైంది. యానం సమీపంలో ఒకటి నుంచి రెండు గంటల్లోనే తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తుఫాను వేగం తగ్గి గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో గంటకు 135 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, పాగో జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రాత్రి సమయంలో కూడా అర్నాబ్‌ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. కోనసీమ తీర ప్రాంతాల్లో గంటకు 140 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచి భయాందోళనలు సృష్టించాయి. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాకినాడ తీర ప్రాంతాల్లో సముద్రపు నీరు కాలనీల్లోకి చేరగా, చాలామందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది.
తుఫాను ప్రభావం తగ్గే వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. రోడ్డు, రైలు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని కోరారు. రాత్రి వేళల్లో గ్రామాల్లో, పట్టణాల్లో అనవసరంగా తిరగవద్దని హెచ్చరించారు. సముద్ర తీర గ్రామాలు, లంక, లోతట్టు ప్రాంతాల ప్రజలు వర్షం తీవ్రం కాకముందే పునరావాస శిబిరాలకు వెళ్లిపోవాలని సూచించారు.

ఈ తుఫాను భారీ నష్టాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం గాలుల తీవ్రత అధికంగా ఉంది. అమలాపురంలో, కోనసీమ జిల్లా కేంద్రంలో తుఫాను బీభత్సం సృష్టిస్తున్నట్లు సమాచారం. అక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. సెల్‌ఫోన్లకు సమాచారం రావడం లేదు, ప్రభుత్వ కంట్రోల్ రూమ్ కూడా పనిచేయని పరిస్థితి ఉంది. అమలాపురం నుంచి వస్తున్న సమాచారం ప్రకారం కోనసీమ వ్యాప్తంగా గాలుల తీవ్రత బాగా ఎక్కువగా ఉంది. యానాల్లో కూడా గాలుల తీవ్రత అధికంగా ఉంది. ఊహించిన దానికంటే ఎక్కువ తుఫాను ప్రభావం కనిపిస్తోంది. తుఫాను అతి వేగంగా తీరానికి దూసుకురావడంతో మరో గంటలోపు తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం యానం వద్దే తీరం దాటి, అక్కడి నుంచి దిశ మార్చుకునే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు.

Read Also: అర్నాబ్ తుపాన్ ప్రభావం.. తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు అతిభారీ వర్షాలు.. ఐఎండీ బిగ్ అలర్ట్..

Read Also: ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలే ముఖ్యం.. అర్నబ్ తుపాన్‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రెస్ మీట్..
 

అధికారులు జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ రాత్రి గండం గడవాలని ప్రతి ఒక్కరూ భయంతో ఎదురుచూస్తున్నారు. యానంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అక్కడ భారీ వర్షం కురుస్తోంది. సమాచార వ్యవస్థ నిలిచిపోయింది. సెల్‌ఫోన్ సిగ్నల్స్, టవర్లు పనిచేయకపోవడంతో రాజోలుతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే రకమైన గాలుల తీవ్రత ఉండే అవకాశం ఉంది. గాలుల తీవ్రత వల్ల చెట్లు పడిపోవడం, విద్యుత్ స్తంభాలు నేలకూలడం వంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాకుండా, ఇళ్లలోనే ఉండి ఈ రాత్రి గడవాలని కోరుకుంటున్నారు. లోతట్టు ప్రాంతాలు, పూరిళ్లు, బలహీనమైన ఇళ్లలో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు, తుఫాను కేంద్రాలకు చేరుకోవాలని మూడు రోజుల నుంచి హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఎక్కువమంది పునరావాస కేంద్రాలకు చేరుకున్నారు. ఇంతవరకు ఎవరూ ప్రమాదంలో చిక్కుకున్నట్లు సమాచారం లేదు.

అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి 2000కు పైగా మెకనైజ్డ్ బోట్లు పల్లిపాలెం, వాడల రెండు చోట్లా లంగరు వేసి ఉంచారు. తీర ప్రాంతంలో మాత్రం ప్రజలు క్షణక్షణం భయంభయంగా గడుపుతున్నారు. ఆ గతంలో వచ్చిన తుఫాన్లను, ముఖ్యంగా 1996లో వచ్చిన సూపర్ సైక్లోన్‌ను గుర్తుచేసుకుంటూ ప్రజలంతా బిక్కుబిక్కుమంటున్నారు. కాకినాడ జిల్లాలో 21 మండలాలు ఉండగా, వాటిలో ఆరు తీర ప్రాంత మండలాలు ఉన్నాయి. ఈ మండలాల్లో అర్నాబ్‌ తుఫాను ప్రభావం చాలా అధికంగా ఉంది. ముఖ్యంగా  కొత్తపల్లి మండలం పూర్తిగా బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతం కావడంతో, ఇక్కడ సముద్రపు అలలు ఎగిసి రోడ్లపై పడుతున్నాయి. పలుచోట్ల రోడ్డులో గండి పడింది, రోడ్డు ముక్కముక్కలుగా విరిగిపోయింది. సముద్రపు కెరటాలు రోడ్డుపైకి, ఇళ్లలోకి రాకుండా వేసిన పెద్ద పెద్ద రాళ్లు కూడా కెరటాల తాకిడికి ఇలా జరిగింది. అవి జనంపై, వాహనాలపై పడటంతో ప్రజలు గాయపడటం, వాహనాలు దెబ్బతినడం వంటి సంఘటనలు జరిగాయి. కలెక్టర్, ఎస్పీ రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి పర్యటిస్తున్నారు. 115 వరకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు, వాటిలో ఒక్క యు. కొత్తపల్లి మండలంలోనే 11 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాల్లో జనరేటర్లు కూడా ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం నుంచి జిల్లా మొత్తం కరెంట్ నిలిపివేయడంతో రాత్రి అంధకారంలో ఉంది. 

 

Add Zee News as a Preferred Source
TAGS:
AP Weather
AP News
Telugu News