Heavy rain fall alert for Telangana amid arnab cyclone impact: బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నాబ్ తుపాన్ తో ఏపీలో వైపుకు దూసుకునిపోతుంది. దీని ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గంట గంటలకు అన్ని శాఖలకు చెందిన అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా, సహాయక చర్యలు పకట్బందిగా చేయాలని ఆదేశించారు.
ఏపీలో వరద ప్రభావింత ప్రాంతాల్లోని అన్ని స్కూళ్లకు ఆయా జిల్లా అధికారుల్ని సెలవుల్ని ప్రకటించారు. మరోవైపు అర్నాబ్ తుపాన్ ప్రభావం తెలంగాణపై కూడా కన్పిస్తుంది. దీని వల్ల రేపు ఉదయం ( బుధవారం) తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది
తెలంగాణ రాష్ట్రంలో రేపు ఉదయం 8.30 గంటల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రటకనలో వెల్లడించింది. ముఖ్యంగా తెలంగాణలోని.. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదే విధంగా.. మిగతా జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ప్రజలంతా అర్నాబ్ ప్రభావంతో అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల వద్ద ప్రత్యేకంగా చర్యలు తీసుకొవాలన్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని, మత్య్సకారులు చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు అలర్ట్ జారీ చేశారు. మరోవైపు అర్నాబ్ ప్రభావంత రాబోయే కొన్ని గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయోనని ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.