SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

AP ఉత్తర కోస్తా తీరం వైపు దూసుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్‌..!

AP Toofan Effect: AP కి వాతావరణశాఖ బిగ్‌ అలర్ట్‌ జారీ చేసింది. నిన్న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేటి ఉదయానికి వాయుగుండంగా మారనుంది. అది మరింత బలపడి తుపానుగా. తరువాత అతి తీవ్ర తుఫాన్‌గా బలపడి AP తీరం వైపు దూసుకువస్తుందని వాతావరణశాఖ అంచనా వేసింది.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 24, 2026, 07:59 AM IST | Updated: Oct 24, 2026, 08:01 AM IST
Image Credit: Arnab Cyclone
Join

AP Toofan Effect: ఆంధ్రప్రదేశ్ తీరం వైపు తుఫాన్ గండం దూసుకొస్తోంది. ఆగ్నేయ,  తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే 24 గంటల్లో వాయుగుండంగా మారి... ఆపై తీవ్ర వాయుగుండంగా మారబోతోంది. అల్పపీడనం ప్రస్తుతం సముద్ర మట్టానికి ఏకంగా 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. అక్టోబర్ 25 నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడి... అక్టోబర్ 26వ తేదీ ఉదయం నాటికి ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా అవతరించబోతోంది. ఆ తర్వాతి రెండు రోజుల్లో మరింత బలపడనుంది.

ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో తొలి తుపాన్‌కు ఆర్నాబ్‌గా నామకరణం..

పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణించి ఈనెల 28న ఉత్తర ఆంధ్రప్రదేశ్,  దక్షిణ ఒడిశా తీరంలో తీరం దాటే అవకాశం ఉంది. తుఫాన్ తీరం దాటే సమయంలో  ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే తుఫాన్ ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై పెద్దగా ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో తొలి తుపాన్‌కు ఆర్నాబ్‌గా నామకరణం

కోస్తా తీరంలో గంటకు 185 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు.. 
ఈ నెల 27, 28 తేదీల్లో ఉత్తర కోస్తాలో గంటకు 120 నుంచి 160 కిలోమీటర్లు.. అప్పుడప్పుడు 185 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీయనున్నాయి. ఇదే సమయంలో శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా వరకు భారీ నుంచి అతిభారీగా, అక్కడక్కడా కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈమేరకు ఏపీ, ఒడిశా ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది.

28న ఉత్తర కోస్తాలో తీవ్ర తుఫాన్‌గా  తీరం దాటే అవకాశం..

ఈ క్రమంలో పశ్చిమ వాయవ్యంగా పయనిస్తూ 25 నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడి తూర్పు మధ్య దానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది. ఆపై మరింత బలపడి 26వ తేదీకల్లా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తూనే తుపాన్‌గా మారుతుంది. ఆ తర్వాత రెండు రోజుల్లో తుపాను మరింత బలపడి అతి తీవ్ర తుపాన్‌గా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES