SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Alluri District: అల్లూరి జిల్లాలో భారీ పేలుడు.. రోడ్డుపనులు చేస్తుండగా ఐదుగురు దుర్మరణం..

Blast in alluri district: అనంతగిరి మండలం పినకోట మైనింగ్ ప్రాంతంలో పేలుడు ఘటన తీవ్ర విషాకరంగా మారింది. దీనిపై హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Written By Inamdar Paresh
Published: Oct 24, 2026, 10:28 AM IST | Updated: Oct 24, 2026, 10:37 AM IST
Image Credit: alluri distirict blast news
Join

Several dead during blast for road works in alluri sitaramaraju district: ఆంధ్ర ప్రదేశ్ లోని అల్లూరిజిల్లాలో  భారీ పేలుడు సంభవించింది. అనంగిరి మండలం పినకోట వద్ద రోడ్డు పనుల కోసం బ్లాస్టింగ్ చేపట్టారు. ఈ క్రమంలో  అటుగా వెళ్తున్న టిప్పర్ భారీ పేలుడు ధాటికి ఎగిరిపడింది. ఈ ప్రమాదంలో స్పాట్ లోనే ఐదుగురు చనిపోయారు. చనిపోయిన వారిలో ఒక టీచర్, డ్రైవర్, ముగ్గురు కార్మికులు ఉన్నట్లు గుర్తించారు.  సమాచారం అందగానే భారీగా పోలీసులు ఘటన ప్రదేశంకు చేరుకున్నారు. ఈ ఘటనపై హోం మంత్రి అనిత తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.  

అల్లూరి జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. పేలుడు ఘటనలో మృతి చెందిన వారి పట్ల హోం మంత్రి అనిత తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పేలుడు ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు మంత్రి అనిత ఆదేశించారు. ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హోం మంత్రి అనిత ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనతో  ఆ ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES