Arnab Cyclone Effect: ఏపీలో అర్నాబ్ తుపాన్ బీభత్సం.. ఏడుగురు దుర్మరణం.. కొనసాగుతున్న సహాయక చర్యలు..
cyclone Arnab hits ap: అర్నాబ్ తుపాన్ ప్రభావం వల్ల ఏపీలోని పలు జిల్లాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. మరోవైపు అధికారులు సైతం తుపాన్ ప్రభావిత ప్రాంతంలో సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
Five persons died in Andhra Pradesh: బంగాళా ఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాన్ ఏపీని అతలాకుతలం చేసింది. ఈ క్రమంలో తుపాన్ కేంద్రం యానం, నరసాపురం ప్రాంతాల మధ్య తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. మొత్తంగా అర్నాబ్ ప్రభావం వల్ల బలమైన గాలులు, కుండ పోతవర్షాలతో ఏపీలోని పలు జిల్లాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. సామాన్య జనజీవనం అంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. ఎక్కడికక్కడ రోడ్ల మీద చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
తీరం దాటే సమయంలో అర్నబ్ తుపాన్..గంటకు 125-135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని, గరిష్ఠంగా గాలి వేగం 150 కిలోమీటర్ల వరకు నమోదైందని అధికారులు తెలిపారు.
తీరం దాటిన తర్వాత అర్నాబ్ తుపాన్ ఉదయం 8:30 గంటలకు ఇది అతి తీవ్ర తుపాను నుంచి తీవ్ర తుపానుగా బలహీనపడిందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. అర్నబ్ తుపాన్ ప్రభావం వల్ల అత్యధికంగా విశాఖపట్నంలో 315 మిల్లీమీటర్ల వర్షం పడింది.
అదే విధంగా.. కృష్ణా జిల్లాలో 223 మి.మీ, అనకాపల్లిలో 275 మి.మీ, విజయనగరంలో 301 మి.మీ,శ్రీకాకుళంలో 257 మి.మీల వర్షం కురిసింది. మొత్తంగా తుపాన్ ప్రభావం వల్ల ఏపీలో మొత్తంగా ఏడుగురు దుర్మరణం చెందారు. భీమవరంలో చెట్టుకూలీ కిషోర్(48) అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. మరో వ్యక్తి ఇక్కడే చనిపోయాడు. విశాఖలో కరెంట్ వయర్లు నీటిలో పడి దేవుడు (65), బాలాజీ నగర్ లో విద్యుత్ స్తంభం పడి మాధవీ మరణించింది. అనాకా పల్లిలో భాగ్యలక్షీ (55), కరెంట్ షాక్, కోనసీమ జిల్లాలో వర్షానికి గుడిసె కూలీ వెంకాయమ్మ చనిపోయింది.
ఈక్రమంలో ఏపీలో అర్నాబ్ బీభత్సంపై ఆదుకొవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రంకు లేఖను రాశారు. అర్నబ్ తుపాను కారణంగా రాష్ట్రంలో భారీ నష్టం వాటిల్లిందని, నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాలను పంపాలని ఆయన తనలేఖలో విజ్ఞప్తి చేశారు.