• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /YS Jagan: స్థానిక ఎన్నికల్లో అడ్డదారుల్లో గెలిచేందుకు చంద్రబాబు కుట్రలు: వైఎస్‌ జగన్‌

YS Jagan: స్థానిక ఎన్నికల్లో అడ్డదారుల్లో గెలిచేందుకు చంద్రబాబు కుట్రలు: వైఎస్‌ జగన్‌

YS Jagan Allegations On Chandrababu: గెలిచేందుకు చంద్రబాబు ఎన్ని కుట్రలైనా పన్నుతాడని.. స్థానిక ఎన్నికల్లో వాటిని ఎదుర్కోవడానికి వైఎస్సార్‌సీపీ నాయకత్వం సిద్ధంగా ఉండాలని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు. బలమైన అభ్యర్థులను పోటీకి దింపి గెలిచేందుకు ప్రయత్నాలు చేయాలని సూచించారు.

Reported By Ravi Kumar SargamEdited By Ravi Kumar Sargam
Published: Sep 24, 2026, 02:52 PM IST|Updated: Sep 24, 2026, 02:58 PM IST
joinshare
YS Jagan: స్థానిక ఎన్నికల్లో అడ్డదారుల్లో గెలిచేందుకు చంద్రబాబు కుట్రలు: వైఎస్‌ జగన్‌
Image Credit: YSRCP Twitter

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

YS Jagan Meeting: స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు అడ్డదారుల్లో గెలిచేందుకు కుట్రలు పన్నుతాడని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆరోపించారు. ఆ కుట్రలను ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సిద్ధం కావాలని వైఎస్సార్‌సీపీ నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను పోటీలోకి దింపాలని.. గెలిచేందుకు తీవ్ర ప్రయత్నాలు చేయాలని సూచించారు. రెండేళ్ల చంద్రబాబు వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ చెప్పారు.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రాంతీయ నమన్వయ కర్తలు (రీజినల్‌ కో-ఆర్డినేటర్లు)తో ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్ ‌రెడ్డి సమావేశమయ్యారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. 'స్థానిక సంస్థల ఎనికల్లో పార్టీ తరఫున అభ్యర్థులను వేగంగా గుర్తించాలి. బలమైన, మంచి అభ్యర్థులను నిలబెట్టాలి' అని సూచించారు.

'ఎన్నికల్లో గట్టిగా పని చేయాలని.. అభ్యర్థుల ఎంపికలో మనం తీసుకునే నిర్ణయాలు రేపు వచ్చే ఎన్నికల్లో ఉపయోగపడాలి. పార్టీలో అందరితో మాట్లాడి అందరి అభిప్రాయాలు తీసుకోండి. పలు దఫాలుగా వారితో చర్చించి అభ్యర్థులను జాబితాను తయారు చేయండి' అని పార్టీ రీజనల్‌ కో ఆర్డినేటర్లకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సూచనలు చేశారు. పార్టీని ఒక్కతాటిపైకి తీసుకు వచ్చి ఎన్నికల్లో ముందుకు నడపాలని సూచించారు.

స్థానిక నాయకత్వాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ బలోపేతం చేయాలని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పారు. రెండున్నరేళ్ల చంద్రబాబు పాలనలో వైఫల్యాలను, ప్రజలకు జరిగిన వెన్నుపోట్లను ప్రజలకు వివరించాలని తెలిపారు. ప్రతి గడపవద్దకూ వెళ్లి, మన పాలనలో మంచి, ఈ ప్రభుత్వంలో వెన్నుపోట్లను వివరించాలని.. ఈ రెండున్నరేళ్ల పాలనలో చంద్రబాబు పాలన వల్ల ప్రజలకు జరిగిన నష్టాలను, కష్టాలను వివరించాలని సూచించారు.

పోలీసు బలంతో, అడ్డదారుల్లో గెలిచేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతారని.. వాటిని ఎదుర్కొనేందుకు అన్నిరకాలుగా సిద్ధం కావాలని పార్టీ నాయకత్వానికి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు. ఎక్కడికక్కడ  ప్రత్యామ్నాయాలు ఉంచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కో-ఆర్డినేటర్లు బొత్స సత్యన్నారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, కురసాల కన్నబాబు, గుడివాడ అమర్‌నాథ్‌, బూడి ముత్యాలనాయుడు తదితరులు ఉన్నారు.

కాకుమాను రాజశేఖర్‌ ఆకస్మిక మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి

లిడ్‌క్యాప్‌ మాజీ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్‌ ఆకస్మిక మరణంపై ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజశేఖర్‌ గురువారం హైదరాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడం తనను కలచివేసిందన్నారు. కాకుమాను రాజశేఖర్‌ వైఎస్సార్‌సీపీకి అంకితభావంతో పనిచేశారని, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తనకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించారని ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ గుర్తుచేసుకున్నారు. ఆయన మరణం బాధాకరమని.. ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కాకుమాను రాజశేఖర్‌ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Add Zee News as a Preferred Source
TAGS:
YS Jagan Mohan Reddy
Vijayawada
Andhra Pradesh
AP News