• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /Kakinada Accident: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు భవానీ భక్తుల దుర్మరణం..

Kakinada Accident: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు భవానీ భక్తుల దుర్మరణం..

Kathipudi Road accident: రోడ్డుదాటుతున్న భవానీ భక్తులను వేగంగా వచ్చిన స్కార్పియో ఢీకొనడంతో నలుగురు ఎగిరిపడ్డారు. ఈ క్రమంలో తీవ్ర రక్తస్రావం కావడంతో స్పాట్ లోనే మరణించారు.

Written ByInamdar Paresh
Published: Oct 22, 2026, 07:31 AM IST|Updated: Oct 22, 2026, 07:41 AM IST
joinshare
Kakinada Accident: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు భవానీ భక్తుల దుర్మరణం..
Image Credit: kakinada accident

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Prabhas Fauzi Poster: ఫౌజీ పోస్టర్‌లో ఆసక్తికర విషయాలు.. 1939 నుంచి మోస్ట్ వాంటెడ్‌గా ప్రభాస్.. అసలు కథేంటి?

Prabhas Fauzi Poster: ఫౌజీ పోస్టర్‌లో ఆసక్తికర విషయాలు.. 1939 నుంచి మోస్ట్ వాంటెడ్‌గా ప్రభాస్.. అసలు కథేంటి?

2

Siddipet: సిద్దిపేట్‌లో దసరా రోజు ఘోరం.. మైనర్ బాలికపై సాముహిక అత్యాచారం.. ఆలస్యంగా బైటపడ్డ ఘటన .!.

3

పసిడి ప్రియులకు మరో గుడ్‌న్యూస్.. మళ్లీ పడిపోయిన బంగారం ధరలు..!!

4

BSNL BYO OTT Builder: BSNL యూజర్లకు బంపర్ ఆఫర్..రూ.549కే 4000 జీబీ డేటా..25కు పైగా ఓటీటీలు ఉచితం!

5

Skip Breakfast Risk: బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేసి కాఫీలు, టీలతో సరిపెడుతున్నారా..?.. ఈ డెంజర్ లో పడ్డట్లే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Four bhavani devotees died in Kakinada: ఆంధ్ర ప్రదేశ్ లోని కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. విజయవాడకు బయలుదేరిన కొంత మంది భక్తులలో.. నలుగురు భవానీ భక్తులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ ఘటన ప్రత్తిపాడు నియోజక వర్గం కత్తిపూడి వద్ద సంభవించింది. విజయనగరం జిల్లా డెంకాడ నుంచి సుమారు 40 మంది భవానీ భక్తులు విజయవాడ దుర్గమ్మతల్లిని దర్శించుకునేందుకు బయలుదేరారు. 

మార్గమధ్యంలో కాకినాడ జిల్లా కత్తిపూడీ వద్ద బస్సులో సాంకేతిక సమస్య తలెత్తింది. బస్సు మొరాయిడంతో డ్రైవర్ బస్సును ఆపి రిపేర్ చేస్తున్నారు.  ఇంతలో బస్సులో ఉన్న నలుగురు భవానీ భక్తులు రోడ్డును దాటుతుండగా వేగంగా వచ్చిన స్కార్పీయో వారిని ఢీకొనడంతో వారంతా ఎగిరి పడ్డారు. వారి తలకు బలమైన గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది. 

ఈ క్రమంలో స్పాట్ లోనే నలుగురు చనిపోయారు. ఈ ఘటనతో ఆ మార్గంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్థానికులు పోలీసులకు, అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు. మరోవైపు స్కార్పియో వాహనం సైతం పూర్తిగా ధ్వంసం అయింది. అతివేగమే నలుగురు భవాానీ భక్తుల ప్రాణాలు పోవడానికి కారణమైందని అక్కడి వారు చెబుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. డ్రైవర్ తాగి ఉన్నాడా లేదా నిద్రమత్తు వల్ల ప్రమాదం జరిగిందా..?.. అన్న కోణంలో విచారణ చేపట్టారు.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Andhra Pradesh
AP News
Crime News