SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Guntur Raids Brothels: గుంటూరు నగరంలో వ్యభిచార ముఠా బట్టబయలు..విటుడితో ఉండగా అడ్డంగా బుక్కైన మహిళలు!

Guntur Raiding Brothels: ఏపీలోని గుంటూరు నగరంలోని అరండల్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచార దందా గుట్టు రట్టయ్యింది. కొన్ని నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యభిచార దందాను పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు.

Written By Harish Darla
Published: Sep 27, 2026, 08:43 PM IST | Updated: Sep 27, 2026, 08:49 PM IST
Join

Guntur Raiding Brothels: గుంటూరు నగరంలో వ్యభిచార ముఠా గుట్టు రట్టయ్యింది. స్థానికంగా అరండల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం పోలీసులు జరిపిన ఆకస్మిక దాడుల్లో ఐదుగురు మహిళలు, ఓ విటుడు పట్టుబడ్డారు. వాట్సాప్‌లో అమ్మాయిల ఫొటోలను పంపుతూ.. విటులను ఆకర్షిస్తూ హైటెక్ పద్ధతిలో నిర్వహిస్తున్న ఒక వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు సకాలంలో రట్టు చేశారు

పక్కా సమాచారంతో సంయుక్త నిర్వహణ..
స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఆదేశాల మేరకు.. టాస్క్‌ఫోర్స్ సీఐ పర్యవేక్షణలో పోలీసులు వ్యభిచార కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు సమాచారం అందుతోంది. ఈ నిఘా క్రమంలో అరండల్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని భారత్‌పేట 7వ లైన్‌లో ఉన్న ఒక ఇంట్లో అక్రమంగా వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో టాస్క్‌ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) సిబ్బంది, అరండల్‌పేట ఎస్‌ఐ తన బృందంతో కలిసి ఆదివారం మధ్యాహ్నం 12:45 గంటల సమయంలో సదరు ఇంటిపై ఆకస్మికంగా సంయుక్త దాడి జరిపారు.

పట్టుబడ్డ ముఠా, సెల్‌ఫోన్లు స్వాధీనం.. 
ఆ ఇంట్లో వ్యవస్థీకృతంగా వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసుల తనిఖీల్లో వెల్లడైంది. దాడి సమయంలో అక్కడే ఉన్న నలుగురు మహిళలతో పాటు ఒక విటుడిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి 5 సెల్‌ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

వాట్సాప్ ద్వారా డీల్స్..
పోలీసుల ప్రాథమిక విచారణలో గోరంట్లకు చెందిన పి. సాయి లక్ష్మి అలియాస్ అంజలి ఈ దందాకు ప్రధాన నిర్వాహకురాలిగా వ్యవహరిస్తున్నట్లు తేలింది. విటులను ఆకర్షించేందుకు ఆమె వాట్సాప్ ద్వారా యువతుల ఫొటోలను పంపిస్తూ డీల్స్ కుదుర్చుకుంటున్నట్లు విచారణలో తేలింది
అదుపులోకి తీసుకున్న ఐదుగురిని తదుపరి విచారణ, చట్టపరమైన చర్యల కోసం అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

ZEENEWS TRENDING STORIES