SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఏపీ వైపు భారీ తుపాను.. 140 కి.మీ వేగంతో ఈదురు గాలులు.. 5 జిల్లాలకు భారీ వర్షాలు..

Arnab Toofan: ఆంధ్ర ప్రదేశ్ తీరం వైపు అర్నబ్‌ తుపాను దూసుకువస్తోంది. ఇది ఎల్లుండి అంటే అక్టోబర్‌ 28న తీరం దాటే అవకాశం వుందని వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తూ నేటి ఉదయానికి తుపానుగా బలపడింది.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 26, 2026, 10:09 AM IST | Updated: Oct 26, 2026, 10:55 AM IST
Image Credit: AP Arnab Cyclone (ZEE News Telugu/Source)
Join

AP Rains Latest Updates: సైక్లోన్ మంగళవారం ఉదయానికి ఇది అక్కడే తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. తరువాత మరింత బలపడి అతి తీవ్ర తుపానుగా మారి బుధవారం ఉదయానికి ఆంధ్ర ప్రదేశ్  తీరానికి చేరుకునే అవకాశం ఉందని, మధ్యాహ్నానికి బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.

140 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు..

ఆ సమయంలో రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలతో పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. తుపాను ప్రభావంతో రానున్న 5 రోజులుల వర్షాలు కురుస్తాయంటోంది.  ఇవాళ కోస్తాంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.  రేపు అంటే 27న కోనసీమ, కాకినాడ, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసే అవకాశం ఉందంటోంది.

శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, గుంటూరు, ప్రకాశం, బాపట్ల  జిల్లాల్లో 20 సెం.మీ.లోపు కురుస్తుందని అంచనా వేసింది. ఇక 28న అతి తీవ్ర తుపానుగా తీరం దాటే సమయంలో 140 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు వీస్తాయని హెచ్చరించింది. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు మించి వర్షం కురవనుంది. మిగిలిన జిల్లాల్లో 12 నుంచి 20 సెం.మీ. లోపు వర్షపాతం నమోదుకానుంది.

తెలంగాణలో భారీ వర్షాలు.. 

ఆర్నాబ్ తుపాను ప్రభావంతో  ఈనెల 29న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది.  ప్రధానంగా తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాలపై వర్ష ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ఖమ్మం, మహబూబాబాద్ ములుగు, భద్రాద్రి కొత్తగూడెం,  జిల్లాలలో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందంటూ ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

తెలంగాణలో 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు..

అదే రోజున  కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు గంటకు 50 నుండి 60 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES