SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఏపీకి చల్లటి కబురు.. మూడు రోజులు భారీ వర్షాలు..

Heavy Rains in AP: ఈ యేడాది ఎల్‌నినో ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో సరైన వర్షాలు కురవ లేదు. రాయలసీమలోని కొన్ని మండలాలు తప్పించి అన్ని మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతమే నమోదు అయింది. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ వాసులకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 19, 2026, 08:29 AM IST | Updated: Oct 19, 2026, 08:32 AM IST
Image Credit: AP Rains (ZEE News Telugu/Source)
Join

Andhra Pradesh Weather Update:ఆంధ్ర ప్రదేశ్‌లోని రాయలసీమకు వాతావరణ శాఖ మంచి శుభవార్త అందించింది. కోస్తాంధ్ర, తమిళనాడును ఆనుకొని బంగాళాఖాతం, కర్ణాటకలో ఉపరితల ఆవర్తనాల కారణంగా ఇవాళ రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని IMD వెల్లడించింది. దానితో పాటు ఉపరితల ద్రోణి కూడా విస్తరించినట్లు తెలిపింది.

ఈ నెల 22 వరకు వర్షాలు.. 
ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని, రాష్ట్రంలో ఈ నెల 22 వరకు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు నమోదు అయ్యే అవకాశం ఉందని సూచించింది. ఈ రోజు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాల మీదుగా అన్నమయ్య, కడప, ప్రకాశం నుంచి కాకినాడ వరకు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన అధికారులు..

దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంత ప్రజలు, మత్య్సకారులు మరింత జాగ్రత్తగా అధికారులు తెలిపారు. మరోవైపు నైరుతి ఋతువపనాలు ముగిసాయి. అక్టోబర్ సీజన్‌లో ఈశాన్య ‌ఋతు పననాలతో పాటు బంగాళాఖాతంలో ఈ సమయంలో ఏర్పడే అల్ప పీడనాలు తుపానుగా మారి వర్షాలు కురుస్తుంటాయి. మొత్తంగా కరువు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయనే సమాచారం ఈ ప్రాంత వాసుల్లో ఆనందం వెల్లివిరుస్తుంది.  
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES