• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /పులివెందుల కౌంటింగు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

పులివెందుల కౌంటింగు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

Pulivendula Counting Green SignalL: ఆంధ్ర ప్రదేశ్‌లో మొన్న ఆదివారం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధుల భవిత్యవం మరికాసేట్లో తేలనుంది. మొత్తంగా 92 పట్టణ స్థానిక సంస్థలు 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలకు ఫలితం మరి కాసేట్లో తేలనుంది. ఈ నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠకు తెరలేపిన పులివెందులకు సంబంధించిన ఉప ఎన్నిక నిర్వహించాలని వైసీపీ శ్రేణులు పట్టుపట్టాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు పులివెందుల కౌంటింగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 03, 2026, 08:27 AM IST|Updated: Nov 03, 2026, 08:30 AM IST
joinshare
పులివెందుల కౌంటింగు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..
Image Credit: Pulivendula Counting(ZEE News/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
స్వాతి నక్షత్రంలో బుధుడు.. నవంబర్ 25 వరకు ఈ రాశులవారు ఉద్యోగం, డబ్బు విషయంలో జాగ్రత్త!

స్వాతి నక్షత్రంలో బుధుడు.. నవంబర్ 25 వరకు ఈ రాశులవారు ఉద్యోగం, డబ్బు విషయంలో జాగ్రత్త!

2

అన్నం పెట్టేశారు.. తాళం వేసేశారు..పాఠశాల పనివేళల్లో టీచర్ల నిర్వాకం..!!

3

తెలంగాణపై మురసు తుపాను తీవ్ర ప్రభావం.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్..

4

పులివెందుల కౌంటింగు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

5

తీరం దాటిన మురసు తుపాను.. బీభత్సమే.. స్కూళ్లకు సెలవు..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Pulivendula Muncipality: ఆంధ్ర ప్రదేశ్‌లో జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో అందరు చూపు పులివెందుల పైనే ఉంది. ఆంధ్ర ప్రదేశ్‌లో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డికి చెందిన నియోజకవర్గం కావడంతో అందరి చూపు దీనపైనే పడింది. గతంలో వైసీపీ హాయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకు చెందిన కుప్పం నియోజకవర్గంలో అప్పట్లో వైసీపీ పాగా వేసింది. ఈ నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ.. జగన్‌కు చెందిన సొంత ఇలాకాలో ఎలాగైనా పాగా వేయాలనే ఉద్దేశ్యంతో  పులివెందులకు సంబంధించిన మున్సిపల్‌ ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంది.

జగన్‌కు షాక్.. 

మరోవైపు పులివెందుల మున్సిపాలిటీలో స్థానికులకు ఓట్లు వేయకుండా అడ్డుకున్నారని వై.యస్.జగన్మోహరెడ్డి రోడ్డుపైనే బైఠాయించిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును ఎండగట్టారు. ఈ నేపథ్యంలో పులివెందులలో జరిగిన ఎన్నికను రద్దు చేసి ఉప ఎన్నికను నిర్వహించాలని పట్టుపట్టారు. ఈ నేపథ్యంలో పులివెందుల మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ పై  హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

అక్కడ కౌంటింగ్‌ను యథేచ్ఛగా నిర్వహించుకోవచ్చని ఏపీ హైకోర్టు  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రీపోలింగ్ నిర్వహించాలన్న ఎంపీ అవినాశ్ రెడ్డి, ప్రమీలమ్మల అనుబంధ పిటిషన్లను డిస్మిస్ చేసింది. దీంతో కాసేపట్లో అక్కడ కౌంటింగ్ జరగనుంది. అటు తుఫాన్ ప్రభావంతో చీరాలలో ఆలస్యంగా కౌంటింగ్ ప్రారంభం కానుంది.

తుపాను నేపథ్యంలో పలు ప్రాంతాల్లో కౌంటింగ్ వాయిదా. 

అటు తుపాను నేపథ్యంలో  ఒంగోలు కార్పొరేషన్, అద్దంకి, చీమకుర్తి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కలెక్టర్ రాజబాబు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. తుపాను ప్రభావం తగ్గిన తర్వాత   కౌంటింగ్ జరుపుతామని చెప్పుకొచ్చారు కలెక్టర్. చీరాల మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 11 గంటలకు మార్చిన అధికారులు.

ఏపీ మున్సిపల్ ఫలితాలు.. 

మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో 92 పట్టణ స్థానిక సంస్థల్లో పోటీ చేసిన అభ్యర్థుల మరికాసేట్లో  తేలనుంది. ఈ నెల ఒకటిన జరిగిన ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలోని మొత్తం 3,186 వార్డుల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థులుగా 153 మంది, మున్సిపల్ ఛైర్మన్ పదవులకు 367 మంది, కార్పొరేటర్ స్థానాలకు 3,073 మంది, కౌన్సిలర్ స్థానాలకు 6వేల 669 మంది పోటీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 138 కౌంటింగ్ కేంద్రాల్లో 556 హాళ్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. వీటిలో మొత్తం 6వేల 831 కౌంటింగ్ టేబుళ్లలో పలు చోట్ల మినహా అన్ని చోట్ల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపునకు 47వేల 817 మంది సూపర్‌వైజర్లు, అసిస్టెంట్లు, ఇతర సిబ్బందిని నియమించారు. మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ కోసం భారీ పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేశారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
AP News
YS Jagan Mohan Reddy
Chandrababu Naidu
YCP
TDP