• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /తీరం దాటిన మురసు తుపాను.. బీభత్సమే.. స్కూళ్లకు సెలవు..

తీరం దాటిన మురసు తుపాను.. బీభత్సమే.. స్కూళ్లకు సెలవు..

Murasu Toofan: బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను తీవ్ర తుఫానుగా మారింది. దీంతో మురసు తుఫాను ప్రభావం ఏపీ పై ప్రారంభమైంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.అంతేకాదు మురసు తుపాను తీరం దాటింది. అయితే అర్నాబ్ అంత బీభత్తసం చేయకపోయినా.. కాస్త తక్కువగా బీభత్సం సృష్టించడం పక్కా అని చెబుతున్నారు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 03, 2026, 07:39 AM IST|Updated: Nov 03, 2026, 07:44 AM IST
joinshare
తీరం దాటిన మురసు తుపాను.. బీభత్సమే.. స్కూళ్లకు సెలవు..
Image Credit: Murasu Toofan Effect (ZEE News Telugu/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
తెలంగాణపై మురసు తుపాను తీవ్ర ప్రభావం.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్..

తెలంగాణపై మురసు తుపాను తీవ్ర ప్రభావం.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్..

2

పులివెందుల కౌంటింగు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

3

తీరం దాటిన మురసు తుపాను.. బీభత్సమే.. స్కూళ్లకు సెలవు..

4

కార్తీక మాసంలో ఉసిరి దీపం ఎందుకు వెలిగిస్తారు..! విశిష్ఠత ఇదే..!

5

కాకరకాయతో ఇన్ని ప్రయోజనాలున్నాయా..!! తెలిస్తే అసలు విడిచిపెట్టరు..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Murasu Corssed Coastal Area: ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొచ్చిన మురసు తుపాన్ తీరం దాటింది. నెల్లూరు- నరసాపురం మధ్య ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటింది. మురసు ఎఫెక్ట్‌తో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

అటు బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే సూచనలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.  ప్రజలు ఎవరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ స్పష్టం చేశారు.

ఏపీ సీఎం చంద్రబాబు.. 

మురసు తుఫాన్ పట్ల అప్రమత్తతతో వ్యవహరించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తుపాను తగ్గేవరకు అధికారులందరు అప్రమత్తంగా ఉండాలన్నారు.  నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా జిల్లాలపై తుఫాన్ తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా అత్యంత భారీ వర్షాల హెచ్చరికలు ఉన్న ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.

జన సంచారం.. 

వాగులు, వంకల చెంత జన సంచారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని  సూచించారు. తాగు నీరు, విద్యుత్ సరఫరాలో అంతరాయాలను వీలైనంత త్వరగా పునరుద్ధరించేలా సమన్వయం చేసుకోవాలన్నారు. ప్రజలు.. ప్రభుత్వం నుంచి వచ్చే హెచ్చరికలు పాటిస్తూ, యంత్రాంగానికి సహకరించాలన్నారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని సూచించారు. .

తీరం దాటిన మురసు..

మురసు తుపాను తీరం దాటినప్పటికీ నేడు పలు జిల్లాలకు భారీ వర్షాలు పడనున్నాయి.  ముఖ్యంగా పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలతో పాటు  లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు.  అన్ని శాఖల అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు.

పలు విద్యాసంస్థలకు సెలవు.. 

మురసు తుఫాన్‌ ప్రభావంతో ఇవాళ పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. బాపట్ల, నెల్లూరు, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్‌, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు హాలిడే డిక్లేర్‌ చేశారు. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.  తుఫాన్‌ ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.

Add Zee News as a Preferred Source
TAGS:
AP Weather
Weather Update
Rain News