• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /తెలంగాణపై మురసు తుపాను తీవ్ర ప్రభావం.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్..

తెలంగాణపై మురసు తుపాను తీవ్ర ప్రభావం.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్..

Telangana Rains: మురసు తుఫాన్‌ తెలంగాణవైపు దూసుకొస్తోంది. మురసు ఎఫెక్ట్ కోస్తాంధ్రను ఆనుకొని ఉన్న తెలంగాణ జిల్లాలపై తీవ్రంగా ఉంది. ఈ ఎఫెక్ట్ కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ అంత కాకపోయిన కొద్ది పాటిగా బీభత్సం సృష్టించే అవకాశం ఉందని తెలిపింది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 03, 2026, 08:42 AM IST|Updated: Nov 03, 2026, 08:46 AM IST
joinshare
తెలంగాణపై మురసు తుపాను తీవ్ర ప్రభావం.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్..
Image Credit: Murasu Effect on Telangana (Source/AI)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
స్వాతి నక్షత్రంలో బుధుడు.. నవంబర్ 25 వరకు ఈ రాశులవారు ఉద్యోగం, డబ్బు విషయంలో జాగ్రత్త!

స్వాతి నక్షత్రంలో బుధుడు.. నవంబర్ 25 వరకు ఈ రాశులవారు ఉద్యోగం, డబ్బు విషయంలో జాగ్రత్త!

2

అన్నం పెట్టేశారు.. తాళం వేసేశారు..పాఠశాల పనివేళల్లో టీచర్ల నిర్వాకం..!!

3

తెలంగాణపై మురసు తుపాను తీవ్ర ప్రభావం.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్..

4

పులివెందుల కౌంటింగు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

5

తీరం దాటిన మురసు తుపాను.. బీభత్సమే.. స్కూళ్లకు సెలవు..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Murasu Effect on Telangana:  మురసు తుపాను ఎఫెక్ట్ తెలంగాణపై కొనసాగుుంది. ముఖ్యంగా  నల్గొండ, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ రెండు జిల్లాలకు ఐఎండీ రెడ్‌ ఎలర్ట్‌ జారీచేసింది. కొన్నిచోట్ల 20 సెంటీ మీటర్లు వరకు వర్షపాతం నమోదుకావచ్చని పేర్కొంది.

నల్లగొండ, నాగర్‌కర్నూల్‌ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ..

సూర్యాపేట, మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలు జారీచేసింది. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ తెలిపింది. మరోవైపు  ఖమ్మం,ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి అని వాతావరణశాఖ తెలిపింది.

ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు..
తుపాను ప్రభావంతో ఆదివారం నుంచి నిన్న రాత్రి వరకు పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా వరంగల్‌ జిల్లా కేంద్రంలో 5.8 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. గీసుకొండ, ఖానాపూర్, సంగెం, నల్లబెల్లి, నర్సంపేట మండలాలతో పాటు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ములుగులో 4.2 సెంటిమీటర్ల., హనుమకొండ 4.1, మహబూబాబాద్‌ జిల్లా గంగారం 3, జనగామ జిల్లా చిల్పూరు మండలంలో 2 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Weather Update
Rain News
Telangana Weather
Telangana News