• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /Sarpanch Elections: ఏపీ పంచాయతీ ఎన్నికలు.. పలు గ్రామాల్లో ఉద్రిక్తత పరిస్థితులు

Sarpanch Elections: ఏపీ పంచాయతీ ఎన్నికలు.. పలు గ్రామాల్లో ఉద్రిక్తత పరిస్థితులు

High Tension In Andhra Pradesh Politics: పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో పంచాయతీల్లో రాజకీయం హాట్‌హాట్‌గా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఎన్నికల సందర్భంగా పలు గ్రామాల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. పంచాయతీలను ఏకగ్రీవంగా చేసుకునేందుకు ఆయా పార్టీలు.. ప్రత్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Written By Ravi Kumar Sargam
Published: Nov 15, 2026, 17:48 IST|Updated: Nov 15, 2026, 17:51 IST
joinshare
Sarpanch Elections: ఏపీ పంచాయతీ ఎన్నికలు.. పలు గ్రామాల్లో ఉద్రిక్తత పరిస్థితులు
Image Credit: AP Sarpanch Elections

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

AP Sarpanch Elections: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కాగా గ్రామీణ రాజకీయం వేడెక్కింది. పంచాయతీ సర్పంచ్‌గా ఎన్నికయ్యేందుకు ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలో ఆయా పార్టీలు పరస్పరం దాడులు చేసుకునే స్థాయికి పరిస్థితి ఏర్పడింది. ఇక సర్పంచ్‌ అయ్యేందుకు గ్రామంలోని పెద్దలు కూడా పోటీ పడడంతో ఘర్షణ వాతావరణానికి దారి తీస్తోంది. ఏపీలో పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

అన్నమయ్య జిల్లా రాయచోటిలో నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాయచోటి మండలం శిబ్యాల నామినేషన్ కేంద్రం వద్ద వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పెమ్మడపల్లి గ్రామం నుంచి నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. నామినేషన్ల ప్రక్రియలో జరిగిన సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

శిబ్యాలలో ఉద్రిక్తత
రాయచోటి మండలం శిబ్యాల నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెమ్మడపల్లి గ్రామం నుంచి నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇరు వర్గాలు పరస్పరం దాడులకు పాల్పడ్డాయంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో భయాందోళనకు గురైన గ్రామస్తులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ఘటనపై పోలీసులు స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో సర్పంచ్ ఎన్నికల సందడి
కుప్పం మండలంలో మొత్తం 29 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా.. నామినేషన్ల స్వీకరణకు 7 కేంద్రాల ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణంలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. నామినేషన్ కేంద్రాల వద్ద అన్ని మౌలిక వసతుల కల్పించడమే కాకుండా నామినేషన్ల కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రశాంతంగా జరుగుతుందని ఎంపీడీఓ రాజేంద్రప్రసాద్ తెలిపారు.

పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం రొంపిచర్ల మండలం విప్పర్లలో కలకలం ఏర్పడింది. ఈ గ్రామలో భారీగా పెట్రోల్ బాంబులు, కర్రలు, మారణాయుధాలు బయటపడడంతో వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నామినేషన్ కేంద్రం వద్ద టీడీపీలోని ఇరువర్గాల మధ్య ఘర్షణ ఏర్పడడంతో ఆ గ్రామానికి అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ అక్కడకు చేరుకున్నారు. పోలీసు బృందాలు గ్రామంలోని ఇంటింటికి వెళ్లి తనిఖీలు చేయగా.. టీడీపీ నాయకుడికినే చెందిన స్థలంలో పెట్రోల్ బాంబులు, కర్రలు,మారణాయుధాలు బయటపడ్డాయి. పంచాయతీ ఎన్నికల సందర్భంగా పరస్పరం దాడులకు కుట్ర పన్నగా పోలీసులు భగ్నం చేశారు.

కాకినాడ జిల్లాలోని ఐదు మండలాల పరిధిలో తొలివిడత పంచాయతీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి విడతలో 78 పంచాయితీలు, 872 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎస్పీ బిందుమాధవ్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయగా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ జిల్లా ఎన్నికల అధికారిగా పర్యవేక్షణ చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో ఓ పక్క పంచాయితీ ఎన్నికలు ,మరోపక్క కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలు జరుగుతుండడంతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. మేయర్, కార్పొరేటర్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈనెల 26వ తేదీన తొలి విడత పంచాయతీ ఎన్నికలు, అదే రోజు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతుండడంతో ఎన్నికల నిర్వహణపై సమీక్ష చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తుతో పాటు సీసీ కెమెరాలు నిఘా ఏర్పాటు చేశామని కలెక్టర్‌ తెలిపారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Politics
TDP
YCP
Andhra Pradesh
AP News