SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Tirupati: తిరుపతిలో రెచ్చిపోయిన దొంగలు.. ఇంట్లోంచి 7 కిలోల వెండి, 90 గ్రాములు బంగారం మాయం.. వీడియో..

Robbery in Tirupati: ఇంటి ఓనర్ బంధువుల ఇంటికి వెళ్లారు.ఆ తర్వాత మరుసటి రోజు వచ్చి చూసేసరికి మెయిన్ డోర్ పగలగొట్టి ఉంది. బెడ్ రూమ్ లో వస్తువులు చిందర వందరగా పడి ఉన్నాయి.ఈ క్రమంలో తిరుపతి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Written By Inamdar Paresh
Published: Oct 20, 2026, 01:31 PM IST | Updated: Oct 20, 2026, 01:37 PM IST
Image Credit: Tirupati theft row
Join

Massive robbery occurred in vidyanagar Tirupati city: దేశమంతట కూడా ప్రజలు దసరా పండగ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించడంతో చాలా మంది తమ సొంతూర్లు లేదా టూర్లు, బంధువుల ఇంటికి వెళ్తారు. అయితే ఇదే అదనుగా భావిస్తు దొంగలు రెచ్చి పోతుంటారు. ముఖ్యంగా పగటి పూట రెక్కీ వేసి రాత్రి కాగానే ఇంట్లోకి చొరబడి చోరీలకు పాల్పడుతున్నారు.  పోలీసులు కూడా తరచుగా పండగల నేపథ్యంలో ఊర్లకు వెళ్లే వారికి పలు సూచనలు చేస్తారు. 

 

 

తాళం ఇంటి మెయిన్ గేట్ కు పెట్టకూడదని, కర్టన్ డోర్ కు బైట పెట్టాలని చెప్తారు. డోర్ లాక్ ఉండటం బెటర్ అని చెప్తారు.  కానీ దొంగలు కూడా ఇటీవల చాలా తెలివితెటలు చూపిస్తున్నారు. అయితే ఏపీలోని టెంపుల్ సిటీ నగరం తిరుపతిలో దొంగలు రెచ్చిపోయారు.


ఏపీలోని తిరుపతి నగరంగలో దొంగలు హల్ చల్ చేశారు. స్థానికంగా విద్యానగర్ లో ఇటీవల దొంగలు పడ్డారు. గిరిధర్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో డోర్ ను పగలగొట్టి ప్రవేశించారు. తన బంధువుల ఇంటికి వెళ్లిన సదరు వ్యక్తి తిరిగి వచ్చే వరకు డోర్ పగలకొట్టి ఉంది. 

బెడ్ రూమ్ లో వెళ్లి చూడగా వస్తువులన్ని చిందర వందరగా పడి ఉన్నాయి. బీరువాలో ఉన్న.. 7కిలోల వెండి, 90 గ్రాములు గోల్డ్, 60వేలు క్యాష్ మాయంమైనట్లు బాధితుడు గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. 

ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాను చెక్ చేయగా అందులో  దొంగ కదలికలు రికార్డైయ్యాయి. అర్ధరాత్రి 1గంటకు దోపిడి ముఠా ఇంట్లోకి ప్రవేశించినట్లు గుర్తించారు.  ఈ క్రమంలో తిరుపతి రూరల్  పోలీస్ స్టేషన్ లో బాధితుడు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES