Minister nara Lokesh tweet on raptadu attack incident: ఆంధ్ర ప్రదేశ్ లోని అనంపురం జిల్లాలో బాలికపై రంపంతో దాడి ఘటన ఏపీలో పెనుసంచలనంగా మారింది. స్కూల్ లో ప్రవేశించిన ఉన్మాది పదోతరగతి బాలికపై రంపంతో దాడి చేశారు. ఈ ఘటనలో బాలిక తీవ్రంగా గాయపడింది. ఆమె చేతు కూడా తెగిపడింది. దాడిని అడ్డుకున్న మరో బాలిక పై కూడా ఉన్మాది దాడి తెగపడ్డాడు. ఆతర్వాత అరుపులు, కేకలతో అక్కడి నుంచి పారిపోయాడు. మరోవైపు ఈఘటనతో స్కూల్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తొలుత బాలికను స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఆ తర్వాత రక్త స్రావం అధికంగా కావడం, మెరుగైన వైద్యం కోసం గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు.
ఈ క్రమంలో బాలికకు మణిపాల్ ఆసుపత్రిలో వైద్య బృందం రక్త స్రావంను అదుపులోకి తెవడంతో పాటు , ఇతర అత్యవసర చికిత్సలతో చిన్నారి ఆరోగ్య పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం చిన్నారి బీపీ కూడా కంట్రోల్ లో ఉంది. చిన్నారి వైద్యంకు రెస్పాండ్ ఉందని, ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
బాలిక ఆరోగ్యంపై మంత్రి నారాలోకేష్ ట్విట్ చేశారు. మణిపాల్ వైద్యులు, మెడికల్ టీమ్స్, అధికారులు సమన్వయంతో అత్యవసర వైద్యం అందించారని మంత్రి నారాలోకేష్ వెల్లడించారు. తీవ్రంగా గాయపడ్డ పలు చోట్ల ప్లాస్టిక్ సర్జరీ అవసరమని వైద్యులు తెలిపారని మంత్రి నారాలోకేష్ పేర్కొన్నారు. అదే విధంగా.. చిన్నారికి నిరంతర వైద్య పర్యవేక్షణ కొనసాగుతోందని, త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.