Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ ఆరు కార్పోరేషన్లకు పట్టు పట్టింది. మరోవైపు బీజేపీకి ఒక కార్పోరేషన్కే పరిమితం అవుతుందనుకుంటే చివరకు జనసేనకు నాలుగు కార్పోరేషన్స్ తీసుకుంది. బీజేపీ తన మార్క్ రాజకీయంలో రెండు కార్పోరేషన్స్ ను దక్కించుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించే విధంగా కూటమి నేతలు కసరత్తు చేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చే వారిని మున్సిపల్ ఎన్నికల్లో నిలబెట్టేందుకు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.
ప్రజలకు అందుబాటులో నేతలు ఉండాలి..
ఎన్నికల సమయంలోనే కాదు.. ఎన్నికల తర్వాత పార్టీ నాయకులు, మద్ధతుదారులు క్షేత్రస్థాయిలో ప్రజావిశ్వాసం చూరగొనేందుకు బాధ్యతగా తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. పోటీలో దింపే అభ్యర్థులతో కలిసి నిత్యం ప్రజల్లోనే ఉండే విధంగా రోజువారి షెడ్యూల్ రూపొందించారు.
106 టీడీపీ -21 జనసేన - 7 బీజేపీ..
నగర కార్పొరేషన్లతోపాటు మున్సిపాలిటీలను కూటమి అభ్యర్థులు కైవసం చేసుకునే విషయంలో ఎక్కడా రాజీపడొద్దని మార్గనిర్థేశం చేశారు. 106 మున్సిపాలిటీల్లో 78 స్థానాల్లో తెలుగు దేశం అభ్యర్థులు బరిలో దిగబోతున్నారు. 21 మున్సిపాలిటీల్లో జనసేన అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఏడు మున్సిపాల్టీల్లో భారతీయ జనతాపార్టీ అభ్యర్థులు బరిలో దిగబోతున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. నామినేషన్ల పర్వానికి ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడు నగర కార్పొరేషన్లకు మేయర్ అభ్యర్థులను, 20 మున్సిపాల్టీలకు మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది.
విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేయర్ అభ్యర్థిగా కోలగట్ల శ్రావణిని ఖరారు చేశారు. విశాఖపట్నంకు వరుదు కళ్యాణి, ఏలూరుకు గంటా మోహన్ రావు, మచిలీపట్నంకు లంకాజ్యోతి, ఒంగోలుకు కుప్పం ప్రసాద్, నెల్లూరు కు ఆనం విజయ్ కుమార్ రెడ్డి, కడప మున్సిపల్ కార్పొరేషన్ కు బండి దీప్తి రెడ్డిపేర్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది.