• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /Raptadu School Incident: పది నిమిషాల పాటు అరాచకం.. రాప్తాడు స్కూల్‌లో జరిగింది ఇదే!

Raptadu School Incident: పది నిమిషాల పాటు అరాచకం.. రాప్తాడు స్కూల్‌లో జరిగింది ఇదే!

Panic Incident In Raptadu ZPHS School Here Full Details: పాఠశాలలో విద్యార్థులు చక్కగా పాఠాలు వింటున్న సమయంలో ఓ దుర్మార్గుడు రంపంతో వచ్చాడు. రాగానే ఓ విద్యార్థినిపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. అడ్డుకోబోయిన ఓ బాలికపై దాడి చేశాడు. రాప్తాడు స్కూల్‌లో ఒక పది నిమిషాలు అరాచకం జరిగింది. ఇంతకీ ఆ స్కూల్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Written By Ravi Kumar Sargam
Published: Oct 31, 2026, 02:53 PM IST|Updated: Oct 31, 2026, 02:57 PM IST
joinshare
Raptadu School Incident: పది నిమిషాల పాటు అరాచకం.. రాప్తాడు స్కూల్‌లో జరిగింది ఇదే!
Image Credit: Raptadu School Incident

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
AP Municipal Elections: ఏపీలో రేపే మున్సిపల్ ఎన్నికలు..మేయర్‌, డిప్యూటీ మేయర్, కార్పోరేటర్ జీతం ఎంతో తెలుసా?

AP Municipal Elections: ఏపీలో రేపే మున్సిపల్ ఎన్నికలు..మేయర్‌, డిప్యూటీ మేయర్, కార్పోరేటర్ జీతం ఎంతో తెలుసా?

2

ISRO Chairman: జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌18 రాకెట్‌ ప్రయోగంతో భారత నావిగేషన్ వ్యవస్థకు కొత్త బలం

3

ఉద్యోగులకు వారానికి రెండు రోజులు సెలవులు? ప్రభుత్వానికి కీలక ప్రతిపాదన..!!

4

RBI Plastic Notes: మార్కెట్లోకి రూ.10, రూ.20 కొత్త ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు..ఆర్బీఐ కీలక నిర్ణయం ఎప్పటినుంచి?

5

Raptadu School Incident: పది నిమిషాల పాటు అరాచకం.. రాప్తాడు స్కూల్‌లో జరిగింది ఇదే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Raptadu Student Attack: ఏపీలోని అనంతపురము జిల్లా రాప్తాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన దారుణ సంఘటన తెలుగు రాష్ట్రాల ప్రజలను కదిలించివస్తోంది. ఓ దుర్మార్గుడు చక్కగా పాఠాలు వింటున్న బాలికపై విచక్షణా రహితంగా రంపంతో దాడికి పాల్పడడంతో గగుర్పొడుతోంది. ఈ ఘటనతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. రాప్తాడు హైస్కూల్‌లో జరిగిన ఈ దాడిని ప్రత్యక్షంగా చూసి పాఠశాలలో పాఠం చెబుతున్న టీచర్‌ కన్నీరుమున్నీరుగా విలపించారు. 'నేను మ్యాథ్స్‌ క్లాస్‌ తీసుకుంటున్నా. ఓ వ్యక్తి వచ్చాడు. ఏదో పరికరం తీసుకువచ్చాడు. ఎన్నికల సమయం కావడంతో ఏదో కార్యక్రమం అని భావించా. అతడు పాప దగ్గరకు వచ్చి దాడి చేశాడు. నేను షాక్‌లోకి వెళ్లిపోయా. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ ఘోరాన్ని చూసి తాను నిశ్చేష్టురాలైనట్లు.. ఏం జరుగుతుందో తెలియదని.. కళ్ల ముందే దారుణం జరిగిందని ఆమె తీవ్రంగా విలపించారు.

ఇంతకీ ఏం జరిగింది?
విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠాల్లో నిమగ్నమై ఉన్న సమయంలో.. ఒక ఉన్మాది హఠాత్తుగా ఎలక్ట్రిక్ రంపంతో తరగతి గదిలోకి ప్రవేశించాడు. పదో తరగతి చదువుతున్న బాలికపై విచక్షణారహితంగా దాడి చేసి, ఆమె కుడి చేయి తెగిపడింది. ఈ దారుణాన్ని చూసి అక్కడ ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు భయంతో పరుగులు తీశారు. దుండగుడి దాడిలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె ముఖం, గొంతు భాగాల్లో లోతైన గాయాలు కాగా, రక్తం ఓడుతూ పాఠశాల ఆవరణలో కుప్పకూలింది. వెంటనే ఉపాధ్యాయులు, స్థానికులు ఆమెను అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యులు ఆమెను కాపాడేందుకు శ్రమిస్తున్నారు. కానీ ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాడి జరిగిన వెంటనే ఉపాధ్యాయులు దుండగుడిని చుట్టుముట్టే ప్రయత్నం చేసినా, అతడు అక్కడి నుంచి పారిపోయాడు.

విద్యార్థిని మేనత్త ఏమన్నారంటే?
ఈ దారుణ ఘటనపై విద్యార్థిని మేనత్త స్పందించారు. తన మేనకోడలు నిత్యం ఆటోలో స్కూలుకు వెళ్లే అలవాటు ఉన్నట్లు మేనత్త తెలిపారు. ఎవరైనా వేధిస్తున్నట్లు తనకు ఎప్పుడూ చెప్పలేదని బాధితురాలు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. పాఠశాల లోపలికి రంపంతో ఒక వ్యక్తి ఎలా రాగలిగాడని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు ఎవరో అయినా, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

పోలీసుల దర్యాప్తు
సంఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక వివరాలు సేకరించారు. పాఠశాలలోని ఉపాధ్యాయులు, విద్యార్థుల నుంచి సమాచారం తీసుకుని కేసు నమోదు చేశారు. పారిపోయిన నిందితుడి ఆచూకీ కనుగొనేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రజలలో ఆందోళన నెలకొంది. పాఠశాల ప్రాంగణంలో భద్రతను పెంచాలని స్థానికులు కోరుతున్నారు. విద్యార్థుల భద్రతకు సంబంధించి ఈ ఘటన ఒక పెద్ద చర్చకు దారితీస్తోంది. విద్యార్ధినిపై రంపం తో దాడి చేసిన నిందితున్ని ఎన్‌కౌంటర్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Add Zee News as a Preferred Source
TAGS:
Crime News
Telugu News
Andhra Pradesh
AP News