• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /ఉద్యోగులకు వారానికి రెండు రోజులు సెలవులు? ప్రభుత్వానికి కీలక ప్రతిపాదన..!!

ఉద్యోగులకు వారానికి రెండు రోజులు సెలవులు? ప్రభుత్వానికి కీలక ప్రతిపాదన..!!

Telangana Employees JAC: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో వారానికి 5 రోజుల పనిదినాల విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది.

Written ByBhoomi
Published: Oct 31, 2026, 03:13 PM IST|Updated: Oct 31, 2026, 03:16 PM IST
joinshare
ఉద్యోగులకు వారానికి రెండు రోజులు సెలవులు? ప్రభుత్వానికి కీలక ప్రతిపాదన..!!
Image Credit: 5 Day Work Week Proposal:

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Raptadu School Incident: రాప్తాడు పాఠశాల ఘటనపై చంద్రబాబు, వైఎస్‌ జగన్‌, పవన్‌ కల్యాణ్‌ తీవ్ర దిగ్భ్రాంతి

Raptadu School Incident: రాప్తాడు పాఠశాల ఘటనపై చంద్రబాబు, వైఎస్‌ జగన్‌, పవన్‌ కల్యాణ్‌ తీవ్ర దిగ్భ్రాంతి

2

AP Municipal Elections: ఏపీలో రేపే మున్సిపల్ ఎన్నికలు..మేయర్‌, డిప్యూటీ మేయర్, కార్పోరేటర్ జీతం ఎంతో తెలుసా?

3

ISRO Chairman: జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌18 రాకెట్‌ ప్రయోగంతో భారత నావిగేషన్ వ్యవస్థకు కొత్త బలం

4

ఉద్యోగులకు వారానికి రెండు రోజులు సెలవులు? ప్రభుత్వానికి కీలక ప్రతిపాదన..!!

5

RBI Plastic Notes: మార్కెట్లోకి రూ.10, రూ.20 కొత్త ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు..ఆర్బీఐ కీలక నిర్ణయం ఎప్పటినుంచి?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Telangana Employees JAC: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో వారానికి 5 రోజుల పనిదినాల విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. కేంద్ర ప్రభుత్వ శాఖలు.. సంస్థలలో ప్రస్తుతం అమలవుతున్న తీరులోనే రాష్ట్రంలో కూడా ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్‌ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల ఉమ్మడి జేఏసీ ఛైర్మన్‌ మారం జగదీశ్వర్‌, సెక్రటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాసరావు కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సంజయ్‌ జాజును నేరుగా కలసి అధికారికంగా వినతిపత్రం అందజేశారు.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఉదయం  10.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు పనివేళలు ఉన్న సంగతి తెలిసిందే. వీటిని ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు మార్చాలంటూ జేఏసీ ప్రతిపాదించింది. ఈ విధానం అమలు అయినట్లయితే.. రోజుకు ఏడున్నర గంటల పనివేళలు ఉంటాయని.. రెండవ శనివారం సాధారణ సెలవును పరిగణలోనికి తీసుకుంటే వారానికి 37.5 గంటల పని పూర్తి అవుతుందని జేఏసీ వివరించింది.

ఎల్ నినో ప్రభావం వల్ల నీరు, విద్యుత్, ఇంధన కొరత ఏర్పడే అవకాశం ఉందని జేఏసీ తన వినతిపత్రంలో పేర్కొంది. ఐదు రోజుల పని వారాన్ని అమలు చేయడం వల్ల ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్, నీటి వినియోగం తగ్గుతుందని తెలిపింది. వాహనాల రద్దీ తగ్గడం వల్ల ఇంధనం ఆదా అవుతుందని, వాయు కాలుష్యం తగ్గుతుందని కూడా పేర్కొంది.

ఉద్యోగులకు వారానికి రెండు రోజుల విశ్రాంతి ఇవ్వడం వల్ల పని ఒత్తిడి తగ్గి, సామర్థ్యం, ​​పనితీరు మెరుగుపడతాయని జేఏసీ నాయకులు చెబుతున్నారు.  ఈ విధానాన్ని అమలు చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాపై ఎలాంటి అదనపు ఆర్థిక భారం పడదని వారు తెలిపారు. ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి, ఐదు రోజుల పనివారం విధానాన్ని వీలైనంత త్వరగా అమలు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేయాలని వారు ప్రధాన కార్యదర్శిని కోరారు.

Also Read: 

2 లక్షల మందికి  కేవలం 33 వేల మందే దరఖాస్తు.. NMMS స్కాలర్‌షిప్‌పై విద్యాశాఖ డైరెక్టర్‌కు లేఖ..!!

 

పాఠశాల గదిలోనే క్రూరత్వం.. తోటి విద్యార్థినిపై బాలుడి వికృత దాడి.. స్పృహ కోల్పోయినా వదల్లేదు

 

అనంతపురం జిల్లాలో  పదో తరగతి విద్యార్థినిపై ఉన్మాది దాడి.. రంపంతో గొంతు కోసిన దుండగుడు..!

Add Zee News as a Preferred Source
TAGS:
Employees
Govt Schemes
Telugu News
Telangana News