SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Srikalahasti: ఏపీలో అమానవీయం.. అప్పు చెల్లించలేదని 6 నెలల పసికందు కిడ్నాప్.. అసలు స్టోరీ ఇదే..

Six months old baby kidnapped in ap: తీసుకున్న అప్పును సరైన సమయంలో చెల్లించలేదని కొంత మంది వడ్డీ వ్యాపారులు ఇంట్లోకి చొరబడి ఆరునెలల పసికందును ఎత్తుకెళ్లారు. శ్రీ కాళహస్తిలో జరిగిన ఈ ఘటన వార్తలలో నిలిచింది.

Written By Inamdar Paresh
Published: Nov 14, 2026, 08:51 PM IST | Updated: Nov 14, 2026, 08:57 PM IST
Image Credit: srikalahasti 6 months child kidnap case
Join

Six months old baby and mother kidnapped in srikalahasti: ఇటీవల మానవ సంబంధాలు పూర్తిగా అభాసుపాలైన ఘటనలు నిత్యం వార్తలలో ఉంటున్నాయి. డబ్బుల కోసం ఎంతటి దారుణాలకైన తెగబడుతున్నారు. కన్నవాళ్లు, కట్టుకున్న వాళ్లు ఎవర్ని కూడా వదలడంలేదు. నిత్యం హత్యలు లేదా ఆత్మహత్యలకు చెందిన ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. కొంత మంది సుపారీలు ఇచ్చి మరీ కట్టుకున్న వారిని కాటికి పంపిన ఘటనలు కూడా వార్తలలో ఉంటున్నాయి. ఈ క్రమంలో ఏపీలోని తిరుపతి జిల్లాలోని శ్రీకాళ హస్తిలో అమాన వీయకర ఘటన వెలుగులోకి వచ్చింది. 

 

 

తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం శివనాథపాలెంలో ఈ దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే ఆది, మేఘమాల దంపతులు సుమారు ఏడు నెలల క్రితం శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా నివాసం ఉంటున్న వెంకటగిరి మునెమ్మ, ప్రసాద్, మోహన్ కుటుంబ సభ్యుల వద్ద రూ.1,50,000ను ఐదు రూపాయల వడ్డీకి అప్పుగా తీసుకున్నారు. అయితే.. అప్పటి నుంచి తీసుకున్న అప్పుకు సంబంధించి అసలు, వడ్డీ చెల్లించకుండా ఉండిపోయారు. 

ఎన్నిసార్లు చెప్పిన కూడా వీరి తీరు మారలేదు. దీంతో  విసిగిపోయిన వడ్డీ వ్యాపారులు శివనాథపాలెంలోని ఆది, మేఘమాల ఇంటికి వెళ్లి, ఇంట్లో ఉన్న ఆరు నెలల పసికందుతో పాటు తల్లిని కూడా బలవంతంగా తీసుకెళ్లిపోయారు. తల్లిదండ్రులు ఎంతగా ప్రాధేయపడ్డ కూడా వదల్లేదు. దీంతో తల్లిదండ్రులు డయల్ 100కు ఫిర్యాదు చేశారు. ఆతర్వాత వడ్డీ వ్యాపారులు కొన్ని గంటల హైడ్రామా తర్వాత మరల మహిళలను, ఆమె పసికందును పీఎస్ వద్దకు తీసుకొచ్చి వదిలేశారు. ఈ ఘటనపై  బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES