• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు..నాల్గో రోజు కూష్మాండ మాతగా భ్రమరాంబ దేవి..

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు..నాల్గో రోజు కూష్మాండ మాతగా భ్రమరాంబ దేవి..

Srisailam Ammavaaru Dasara Festival: శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నేటితో ఈ ఉత్సవాలు నాలుగవ రోజుకు చేరుకున్నాయి. నాలుగవ రోజు కూష్మాండ దుర్గ అలంకారంలో భ్రమరాంబ అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. రాత్రికి స్వామి అమ్మవార్లకు కైలాస వాహన సేవ జరగనుంది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 14, 2026, 08:20 AM IST|Updated: Oct 14, 2026, 02:13 PM IST
joinshare
తెలుగు రాష్ట్రాల్లో  ఘనంగా దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు..నాల్గో రోజు కూష్మాండ మాతగా భ్రమరాంబ దేవి..
Image Credit: Dasara Festival (ZEE News Telugu/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
‘రణబాలి’ రివ్యూ.. విజయ్ దేవరకొండ ఖాతాలో హిట్ పడినట్టేనా..!!

‘రణబాలి’ రివ్యూ.. విజయ్ దేవరకొండ ఖాతాలో హిట్ పడినట్టేనా..!!

2

CM Revanth reddy: దసరా పండగ వేళ మందుబాబులకు ఝలక్.. ఆ బ్రాండ్ ధరలు భారీగా పెంచిన సీఎం రేవంత్ ప్రభుత్వం.!.

3

CM Revanth reddy: తెలంగాణ ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారాలి.. సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు..

4

Cobra Video: వామ్మో.. తలమీద నాగమణితో బుసలు కొడుతున్న నాగుపాము.. అరుదైన వీడియో..

5

India vs West Indies 4th T20: ఉప్పల్‌ వేదికగా భారత్ Vs వెస్టిండీస్ నాలుగో టీ20 సమరం.. పరుగుల సునామీ ఖాయమా..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Dasara Festival: అష్టాదశా శక్తి పీఠం, ద్వాదశ జ్యోతిర్లింగం కొలువైన శ్రీశైలం ఆయలంలో నిన్న మూడవ రోజు భ్రమరాంబికాదేవి చంద్రఘంటా అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై చంద్రఘంట అలంకారంలో ఉన్న అమ్మవారికి పలురకాల పూలతో అలంకరించారు.  బిల్వాదళాలతో శాస్త్రోక్తంగా అర్చకులు వేదపండితులు వేదమంత్రాలతో మంగళవాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతులిచ్చారు.

శ్రీ భ్రమరాంబికాదేవి చంద్రఘంట అలంకారంలో, అలానే మల్లికార్జునస్వామి అమ్మవార్లను రావణ వాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులిచారు. అనంతరం వైభవంగా గ్రామోత్సవాన్నీ నిర్వహించారు. ఉత్సవమూర్తుల ముందు కోలాటాలు, చెక్క భజనలు కేరళ వాద్యాలు,గిరిజన నృత్యాలు వివిధ రకాల నృత్యాలు,వివిద రకాల విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

దసరా నవరాత్రుల సందర్భంగా భక్తులు శ్రీశైల క్షేత్రాన్నికి భారీ ఎత్తున తరలి వస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

బాసరలో అమ్మవారి దర్శనం..

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నాల్గవ రోజున బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు కూష్మాండా దేవి అలంకారంలో దర్శనం ఇస్తున్నారు. ఈ రోజు కూష్మాండా దేవి సింహ వాహనాన్ని అధిరోహించి, ఎనిమిది చేతులతో సరస్వతి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. శరన్నవరాత్రి సందర్భంగా వేకువజామున బాలాలయంలో అమ్మవారికి అభిషేకం, మహాహారతి, పుష్పార్చన నిర్వహించి, అనంతరం నైవేద్యం అల్లం వడలు గారెలను ఆలయ అర్చకులు సమర్పించారు.

కూష్మాండా దేవి అలంకారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. కూష్మాండ అనే పదంలోనే అమ్మవారి సృష్టి రహస్యం దాగి ఉంది. సంస్కృతంలో కూ అంటే కొద్దిగా, ఉష్మ అంటే వేడి లేదా శక్తి, అండ అంటే బ్రహ్మాండం. అందుకే ఈమెను అష్టభుజా దేవి అని కూడా పిలుస్తారు. ఆమె చేతులలో కమండలం, ధనస్సు, బాణం, కమలం, అమృత కలశం, చక్రం, గద కొలువై ఉంటాయి.  ఎనిమిదో చేతిలో భక్తులకు సర్వసిద్ధులు, నవనిధులను ప్రసాదించే జపమాల ఉంటుంది.

కూష్మాండ మాతగా అమ్మవారి దర్శనం.. 

ఈ విశ్వం అంతా చీకటితో నిండి, శూన్యంగా ఉన్న సమయంలో, అమ్మవారు తన మందహాసం ద్వారా విశ్వాన్ని కాంతితో నింపి, సృష్టిని ప్రారంభించారని పురాణాలు చెబుతున్నాయి. అందువల్లనే ఈమెను విశ్వసృష్టికి మూలకారకురాలిగా భావిస్తారు. దేవతలలో కేవలం కూష్మాండా దేవి మాత్రమే సూర్యమండలం మధ్యలో నివసించే శక్తిని కలిగి ఉంటుంది. సూర్యుని తపో శక్తిని, వేడిని తట్టుకోగల సామర్థ్యం కేవలం ఈమెకు మాత్రమే ఉంది. సూర్యుడికి ఆ తేజస్సును, ప్రకాశాన్ని ప్రసాదించింది కూడా ఈ అమ్మవారే. అమ్మవారు సింహ వాహనాన్ని అధిరోహించి, ఎనిమిది చేతులతో దర్శనమిస్తుంది.

ఈ రోజు అమ్మవారిని తమలపాకులతో పూజించడం వల్ల వ్యాధులు తొలగిపోయి, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. అనాహత చక్ర అధిష్టాన దేవత, యోగ సాధన చేసేవారు ఈ నాల్గవ రోజున తమ మనస్సును అనాహత చక్రంపై నిలిపి ధ్యానిస్తారు. దీనివల్ల సాధకులకు పవిత్రమైన ఆలోచనలు, మానసిక ప్రశాంతత లభిస్తాయి. కూష్మాండా దేవిని భక్తితో కొలిస్తే ఆయుష్షు, కీర్తి, బలం, ఆరోగ్యం సిద్ధిస్తాయి. అమ్మవారి మందహాసం భక్తుల జీవితాల్లోని చీకట్లను తొలగించి, సుఖసంతోషాలను నింపుతుంది.


తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. 
తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రోజుకో వాహనంపై మలయప్ప స్వామి భక్తలను కటాక్షిస్తున్నారు. ఉత్సవాల్లో మూడో రోజు ఉదయం శ్రీవారు సింహ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. ఇక రాత్రికి ఉభయ దేవేరులతో కలిసి శ్రీవారు ముత్యపు పందిరి వాహనంపై తిరుమాడ వీధుల్లో శోభాయమానంగా విహరించనున్నారు. స్వామివారి ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని సేవలను తిలకిస్తున్నారు.

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు హంస వాహన సేవ వైభవంగా జరిగింది. మంగళవారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు సరస్వతీ దేవి అలంకరణలో చేతిలో వీణ ధరించి హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమాడ వీధుల్లో స్వామివారు విహరిస్తుండగా మంగళవాయిద్యాలు, వేదమంత్రాలు, గోవింద నామస్మరణలతో తిరుమల గిరులు మార్మోగాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన కళాబృందాల ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జ్ఞానం, వివేకానికి ప్రతీకగా భావించే హంస వాహనంపై స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Andhra Pradesh
AP News
Telangana News