Nagamani appeared on cobra Ai generated Video viral: పాముల వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ లో ఉంటున్నాయి. నెటిజన్లు కూడా పాములు, కొండ చిలువల వీడియోలను ఆసక్తిగా చూస్తున్నారు. అందుకు ఎక్కడ పాములు కన్పించిన కూడా వెంటన తమ ఫోన్ లలో వీటిని రికార్డు చేస్తున్నారు. చాలా మంది పాములను చూస్తే వెంటనే అక్కడి నుంచి భయంతో పారిపోతారు. అంతే కాకుండా పొరపాటున కూడా మరల ఆ చోటికి వెళ్లరు. కానీ కొంత మంది మాత్రం పాములతో స్టంట్ లు చేస్తారు.
ఈ క్రమంలో పాముల కాటుకు గురౌతారు. ఇటీవల కొంత మంది ఏఐ టెక్నాలజీతో అనేక వీడియోలను తరచుగా వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోలతో నెటిజన్లు చాలా కన్ ఫ్యూజ్ అవుతున్నారు. వైరల్ అవుతున్నవి.. అసలైన వీడియోలో లేదా నకిలీవో తెలుసు కొవడం చాలా కష్టతరంగా మారింది. ఈ క్రమంలో పాము తల మీద మిల మిల మెరుస్తున్న నాగమణి వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.
నాగుపాము మీద నాగమణి మెరుస్తు కన్పిస్తుంది. కోబ్రా చాలా డెంజర్ గా బుసలు కొడుతుంది. అయితే.. ఈ అరుదైన సర్పంను చూసేందుకు అక్కడి వారు గుమిగూడారు. పాములు ఎక్కడైతే నిధులు, సంపద ఉంటుందో ఆ ప్రదేశంను కాపాడుతూ ఉంటాయని చెప్తుంటారు.
కోబ్రా తల మీద ఒక నాగమణితో అటు ఇటు కదులుతుంది. ఈ వీడియో వైరల్ గా మారడంతో నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. వైరల్ గా మారిన ఈ వీడియో ఏఐదని, అంతే కాకుండా ఇలాంటి ఫెక్ వీడియోలను ఎందుకు వైరల్ చేస్తున్నారని కొంత మంది నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.