• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /క్రీడలు
  • /India vs West Indies 4th T20: ఉప్పల్‌ వేదికగా భారత్ Vs వెస్టిండీస్ నాలుగో టీ20 సమరం.. పరుగుల సునామీ ఖాయమా..?

India vs West Indies 4th T20: ఉప్పల్‌ వేదికగా భారత్ Vs వెస్టిండీస్ నాలుగో టీ20 సమరం.. పరుగుల సునామీ ఖాయమా..?

IND Vs WI 4th T20 Playing 11: హైదరాబాద్‌ ఉప్పల్ స్టేడియం వేదికగా.. నేడు భారత్, వెస్టిండీస్ జట్లు నాలుగో టీ20 మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. ఈ పోరులో గెలిచి ట్రోఫీని సొంతం చేసుకోవాలని చూస్తోంది. అటు వెస్టిండీస్ మాత్రం ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని చూస్తోంది.

Written ByAshok Krindinti
Published: Oct 14, 2026, 02:01 PM IST|Updated: Oct 14, 2026, 02:03 PM IST
joinshare
India vs West Indies 4th T20: ఉప్పల్‌ వేదికగా భారత్ Vs వెస్టిండీస్ నాలుగో టీ20 సమరం.. పరుగుల సునామీ ఖాయమా..?
Image Credit: IND Vs WI 4th T20 Playing 11 (Source: X/BCCI)

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
CM Revanth reddy: తెలంగాణ ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారాలి.. సీఎం రేవంత్  ఆసక్తికర వ్యాఖ్యలు..

CM Revanth reddy: తెలంగాణ ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారాలి.. సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు..

2

Cobra Video: వామ్మో.. తలమీద నాగమణితో బుసలు కొడుతున్న నాగుపాము.. అరుదైన వీడియో..

3

India vs West Indies 4th T20: ఉప్పల్‌ వేదికగా భారత్ Vs వెస్టిండీస్ నాలుగో టీ20 సమరం.. పరుగుల సునామీ ఖాయమా..?

4

హౌతీలకు మాస్ వార్నింగ్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్..

5

US Singer Mary Millben: కాక్రోచ్‌ పార్టీ నిధుల వెనుక అమెరికా హస్తం.!. బాంబు పేల్చిన లేడీ సింగర్.. అసలు విషయం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

IND Vs WI 4th T20 Playing 11: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ రసవత్తరంగా మారింది. తొలి మ్యాచ్‌లో భారత్ గెలవగా.. రెండో మ్యాచ్‌లో విండీస్ విజయం సాధించింది. మూడో మ్యాచ్‌లో టీమిండియా గెలుపొంది సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉంది. నాలుగో పోరుకు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం (ఉప్పల్) వేదికైంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే సిరీస్ సొంతం చేసుకుంటుంది. టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తుండగా.. పర్యాటక వెస్టిండీస్ మాత్రం సిరీస్‌ను 2-2తో సమం చేయాలని చూస్తోంది. గత మూడు మ్యాచ్‌ల్లో పరుగుల వరద పారగా.. ఈ మ్యాచ్‌లో కూడా భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.  

టీమిండియా టాపార్డర్ సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్‌లో ఉండడం కలిసి వచ్చే అంశం. ఈ సిరీస్‌లో సెంచరీ బాది శ్రేయస్ అయ్యర్ మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు. అయితే మిడిల్‌ ఆర్డర్‌లో తిలక్ వర్మ విఫలమైతే.. నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్ పటేల్ మరింత రాణించాల్సిన అవసరం ఉంది. బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్, నమన్ ధీర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సన్‌రైజర్స్ ప్లేయర్స్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌, నితీష్ కుమార్ రెడ్డికి ఉప్పల్ పిచ్‌ గురించి బాగా అవగాహన ఉంది. లోకల్ బాయ్ తిలక్ వర్మపై అందరి కళ్లు ఉండనున్నాయి. ఇక భారత్ తుది జట్టులో మార్పులు చేసే అవకాశం కనిపించడం లేదు.  

గత మ్యాచ్‌లో ఓడిపోయినా వెస్టిండీస్ టీమ్ బలంగానే కనిపిస్తోంది. కెప్టెన్ షై హోప్, రూథర్‌ఫర్డ్‌, హెట్‌మెయర్‌, కామిల్‌ పూరన్‌ ఫామ్‌లో ఉన్నారు. మరో హిట్టర్‌ రోవ్‌మన్ పావెల్‌ కూడా జోరందుకుంటే విండీస్‌కు తిరుగుండదు. బ్యాటింగ్‌తో పోలిస్తే.. విండీస్ బౌలింగ్ బలహీనంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో మరింత క్రమశిక్షణ కనబరిస్తేనే.. భారత్‌ జోరుకు అడ్టుకట్ట వేయగలదు.

హెడ్ టు హెడ్ రికార్డులు ఇలా..

మొత్తం మ్యాచ్‌లు: 34
భారత్ విజయాలు: 22
వెస్టిండీస్ విజయాలు: 11
ఫలితం తేలనివి: 1

మ్యాచ్ టైమ్, లైవ్ స్ట్రీమింగ్ వివవరాలు ఇలా..

వేదిక: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం, ఉప్పల్, హైదరాబాద్.
టాస్ సమయం: బుధవారం సాయంత్రం 6:30 గంటలకు.
మ్యాచ్ ప్రారంభం: రాత్రి 7:00 గంటలకు.
టీవీ లైవ్ టెలికాస్ట్: స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్.
లైవ్ స్ట్రీమింగ్ (ఓటీటీ): జియోహాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్.

తుది జట్లు ఇలా.. (అంచనా)

భారత్: సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, నమన్ ధీర్, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్.

వెస్టిండీస్: షై హోప్ (కెప్టెన్, వికెట్ కీపర్), కమిల్ పూరన్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, షిమ్రాన్ హెట్‌మెయర్, రోవ్‌మన్ పావెల్, రోస్టన్ చేజ్, రొమారియో షెపర్డ్, షమార్ స్ప్రింగర్, అకీల్ హొసేన్, గుడాకేష్ మోటీ, షమార్ జోసెఫ్.

Add Zee News as a Preferred Source
TAGS:
Cricket
Sports News
Team India