Thalliki Vandanam Second Phase: 3.29 లక్షల మందికి రూ.13,000.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Thalliki Vandanam Second Phase: ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల తల్లులకు ప్రభుత్వం అందించే తల్లికి వందనం పథకంకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. రెండో విడత ఆర్థిక సాయం కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విడతలో అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13,000 చొప్పున జమ చేయడానికి సంబంధించిన ప్రక్రియ ముందుకు సాగుతున్నట్లు సమాచారం.
Thalliki Vandanam Second Phase: రెండో విడత సాయానికి సంబంధించిన ఫైలును ఆర్థిక శాఖ పరిశీలించి ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి తుది అనుమతి వచ్చిన తర్వాత అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసే అవకాశం ఉంది. దీంతో ఈ పథకం ద్వారా డబ్బులు అందే తల్లులు ఎదురుచూస్తున్నారు.
ఈ విడతలో సుమారు 3.29 లక్షల మంది విద్యార్థుల తల్లులకు ఆర్థిక ప్రయోజనం అందనున్నట్లు సమాచారం. ఒక్కో అర్హత ఉన్న తల్లి ఖాతాలో రూ.13,000 చొప్పున జమ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే నగదు జమ అయ్యే తేదీపై అధికారికంగా తుది ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే తల్లికి వందనం పథకం కింద పలువురు విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందింది. అయితే కొన్ని కారణాల వల్ల కొంతమంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. అలాంటి లబ్ధిదారులను కూడా గుర్తించి ఈ విడతలో ప్రయోజనం కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
ముఖ్యంగా ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సంబంధించిన అర్హుల వివరాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే గతంలో సాంకేతిక సమస్యలు లేదా ఇతర కారణాల వల్ల నగదు పొందలేకపోయిన వారికి కూడా ఈ విడతలో అవకాశం కల్పించనున్నట్లు సమాచారం.
డబ్బులు ఎప్పుడు ఖాతాల్లో పడతాయనే విషయంపై తల్లిదండ్రుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి నుంచి తుది అనుమతి వచ్చిన తర్వాత నగదు జమ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అందువల్ల అర్హులైన విద్యార్థుల తల్లులు తమ బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్ అనుసంధానం వంటి వివరాలను సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి పరిశీలించుకోవడం మంచిది.
అయితే రూ.13,000 జమ తేదీ, తుది లబ్ధిదారుల జాబితా వంటి వివరాలపై అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే పూర్తి స్పష్టత వస్తుంది. ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారం కోసం లబ్ధిదారులు వేచి చూడాల్సి ఉంటుంది.
Read More: AP PRC Chairman: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..పీఆర్సీ ఛైర్మన్‌ను నియామం..వచ్చే ఏడాది జీతాల పెంపు?