SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Tirumala: తిరుమల భక్తులకు బంపర్ శుభవార్త.. గణనీయంగా తగ్గిన భక్తుల రద్దీ.. జెట్ స్పీడ్‌లో శ్రీవారి దర్శనం..

Less pilgrims crowd in tirumala: తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా తగ్గింది. కేవలం నాలుగు కంపార్ట్ మెంట్ లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. మరోవైపు మురసు తుపాన్ నేపథ్యంలో టీటీడీ కీలక చర్యలు తీసుకుంది.

Written By Inamdar Paresh
Published: Nov 04, 2026, 01:07 PM IST | Updated: Nov 04, 2026, 01:22 PM IST
Image Credit: tirumala(file)
Join

Ttd good news to tirumala devotees: కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తుల కొంగు బంగారం తిరుమలలో భక్తులు రద్దీ అనూహ్యంగా తగ్గింది.  గత కొన్ని నెలలుగా వరుసగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు, నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమల అంతా భక్తులతో కిటకిటలాడింది. ఎక్కడ చూసిన గోవింద నామస్మరణలతో తిరుమల మాడవీధులన్ని మార్మోగిపోయాయి. ఈ క్రమంలో తిరుమలలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ నేపథ్యంలో వీఐపీ దర్శనాల లేఖల్ని అనుమతించడంలేదు. ఈ క్రమంలో తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా తగ్గిపోయింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లు అన్ని ఖాళీగా కన్పిస్తున్నాయి. 

కేవలం నాలుగు కంపార్ట్ మెంట్ లలో మాత్రమే భక్తుల కన్పిస్తున్నారు. ఉదయం 9:35 గంటల ప్రాంతంలో తిరుమలకు చేరుకున్నప్పటికి కేవలం రెండు, మూడు గంటల వ్యవధిలో భక్తులకు నేరుగా దర్శన భాగ్యం కల్గుతుంది. క్యూ కాంప్లెక్స్‌లో నిరీక్షించాల్సిన అవసరం లేకుండానే దర్శనాలు అవ్వడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ ఎస్ డీ టొకెన్లు లేని వారికి కేవలం 3 గంటల్లో శ్రీవారి దర్శనం అవుతుంది. 

మరోవైపు రూ. 300ల టొకెన్లు ఉన్నవారికి 2 గంటల్లోనే దర్శనం అవుతుందని టీటీడీ వెల్లడించింది. మరోవైపు ఏపీలో మురసు తుపాన్ నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ పటిష్టమైన చర్యలు తీసుకుంది. క్యూలైన్ లు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి బైటకు రాకుండా చర్యలు తీసుకొవాలని అధికారుల్ని ఆదేశించారు. 
భక్తులకు క్యూలైన్ లలో నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందేలా ఏర్పాట్లు చేశారు. 

వర్షం పడుతున్న ప్రాంతాల్లో టార్పాలిన్ షెల్టర్లను ఏర్పాటు చేశారు. అదే విధంగా ఘాటు రోడ్లలో బండరాళ్లుపడే ప్రమాదం నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచించింది.వర్షాల కారణంగా ఏదైన ప్రమాదాల బారిన పడే యాత్రికులకు  తక్షణ వైద్య సేవలు అందించడానికి ప్రత్యేకంగా సిబ్బందిని రంగంలోకి దింపారు. మరోవైపు నిన్న శ్రీవారిని మొత్తం 72,806 మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులు కానుకల రూపంలో శ్రీవారికి రూ.3.89 కోట్లు సమర్పించుకున్నారు. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES