• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /3 రోజులు అతి భారీ వర్షాలు.. ఈ ప్రాంతాల్లో అలర్ట్..

3 రోజులు అతి భారీ వర్షాలు.. ఈ ప్రాంతాల్లో అలర్ట్..

Heavy Rains in AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం శనివారం ఉదయం తీవ్ర అల్ప పీడనంగా బలపడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాత్రికి వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్‌తో పాటు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నట్టు ఐఎండీ తెలిపింది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 25, 2026, 08:12 AM IST|Updated: Oct 25, 2026, 08:15 AM IST
joinshare
3 రోజులు అతి భారీ వర్షాలు.. ఈ ప్రాంతాల్లో అలర్ట్..
Image Credit: Heavy Rains Due to Arnab (ZEE News/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
కేంద్ర ప్రభుత్వం భారీ ఆఫర్.. ఉచితంగా రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్యం, ఇలా పొందండి!

కేంద్ర ప్రభుత్వం భారీ ఆఫర్.. ఉచితంగా రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్యం, ఇలా పొందండి!

2

ఆల్ టైమ్ నుంచి 26శాతం పడిపోయిన బంగారం ధర.. కొనేందుకు ఇదే సరైన సమయమా..??

3

అర్నబ్ తుపాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు..

4

నీళ్లు లేక మూతపడ్డ బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్.. నవంబర్ 17 వరకు దసరా సెలవులు పొడిగింపు!

5

3 రోజులు అతి భారీ వర్షాలు.. ఈ ప్రాంతాల్లో అలర్ట్..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Arnab Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. నేడు పశ్చిమ వాయువ్య దిశగా పయనించి తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ కోస్తాంధ్ర ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఇక ఈశాన్య ఋతుపవనాల ప్రారంభం కాలంలో వచ్చిన ఈ తుపానుకు ఆర్నబ్ గా నామకరణం చేశారు.  ఇది మరింత బలమైన తుపానుగా రూపాంతరం చెందనుంది. ఈ నేపథ్యంలో తీర ప్రాంతంలో 120 కిలో మీటర్ల నుంచి 140 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

అంతేకాదు తీర ప్రాంతాల్లో పెద్ద బిల్డింగ్‌లపై ఉన్న హోర్డింగులు తొలిగించాలని వాతావరణ శాఖ కోరింది. బలమైన ఈదురు గాలులకు తోడు ఉరుము, మెరుపులతో కూడిన వర్షం కురవనుంది. ఈ సమయంలో రైతులు పొలాల్లో ఎలాంటి పనులు చేయోద్దని తెలిపింది.  మరోవైపు పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కరెంట్ స్తంభాలు, హోర్డింగ్‌లు,  చెట్ల కింద నిలుచోవద్దని హెచ్చరికలు జారీ చేసింది.

12 జిల్లాలపై ఎఫెక్ట్..

ఆర్నబ్ తుపాను 12 జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇది బాపట్లకు 1100 కిలో మీటర్లు.. విశాఖ పట్నానికి 820 కిలో మీటర్లు.. మచిలీ పట్నానికి 1020 కిలో మీటర్లు.. కాకినాడకు 910 కిలోమీటర్ల దూరంలో కేందృకృతమైందని తెలిపింది. సోమవారం ఉదయానికి తూర్పు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

మంగళవారం తీవ్ర తుపానుగా అర్నాబ్..

మరోవైపు ఎల్లుండి (మంగళవారం)పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్రమైన తుపానుగా బలపడి బలమైన ఈదురుగాలులతో కూడిన అతి భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆ తర్వాత పశ్చిమ, వాయువ్య దిశగా కదలనున్నట్టు తెలిపారు. ఇక బుధవారానికి బాపట్ల - విశాఖ పట్నం మధ్య తీరం దాటే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.

తుపాను ప్రభావిత జిల్లాలు..
తుపాను ప్రభావంతో ఎన్టీఆర్ కృష్ణ, విశాఖ, కాకినాడ, పార్వతీ పురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, బాపట్ల, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నాయి. అటు ప్రకాశం, నెల్లూరు, జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. తుపాను నేపథ్యంలో ప్రభుత్వం అధికారులను తమ పనుల్లో నిమగ్నమయ్యేలా ఆదేశాలు జారీ చేసింది.  

 

Add Zee News as a Preferred Source
TAGS:
AP Weather
Weather Update
Telangana Weather
AP News