• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /ఈ నెల 30న తుపాను.. తెలగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..

ఈ నెల 30న తుపాను.. తెలగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..

Toofan Effect: ఎన్నడూ లేనట్టుగా తెలుగు రాష్ట్రాల్లో ఎల్‌ నినో ప్రభావంతో గతంలో కంటే తక్కువ వర్షపాతం నమోదు అయింది. ఇక ఏపీలో రాయలసీమలో ఒకటి రెండు మండలాలు తప్పిస్తే అన్ని చోట్ల అత్యల్ప వర్షపాతం నమోదు అయింది. దీంతో సాగు, తాగు నీటి కష్టాలు మొదలయ్యాయి. ఇక నైరుతి ఋతుపవనాల సీజన్ కూడా ముగిసింది. ఈ నేపథ్యంలో ఎడారిలో ఒయాస్సులా బంగాళాఖాతంలో అల్ప పీడనం ప్రభావంతో ఈ నెల 30న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 22, 2026, 06:32 AM IST|Updated: Oct 22, 2026, 07:36 AM IST
joinshare
ఈ నెల 30న తుపాను.. తెలగు రాష్ట్రాల్లో  భారీ వర్షాలు..
Image Credit: Low Pressure in Bay Of Bengal (ZEE News Telugu/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
అల్ప పీడన ప్రభావం..  చెన్నైను ముంచెత్తుతున్న వర్షాలు..

అల్ప పీడన ప్రభావం.. చెన్నైను ముంచెత్తుతున్న వర్షాలు..

2

పెన్షనర్లకు బిగ్ అలర్ట్.. బ్యాంక్‌కు వెళ్లకుండానే ఇంటి నుంచే లైఫ్ సర్టిఫికెట్! IPPB ప్రాసెస్!

3

Karnataka Police: కర్ణాటకలో షాకింగ్.. తప్పతాగి రోడ్డుపై పడిపోయిన పోలీసు.. వీడియో వైరల్..

4

నా దగ్గర 6 గుడ్లు ఉన్నాయి.. 2 పగలకొట్టా.. 2 ఆమ్లెట్ వేశా.. 2 తిన్న.. ఇంకా నా దగ్గర ఎన్ని గుడ్లు ఉన్నాయి?

5

ఇమ్మిగ్రేషన్​ విషయంలో ట్రంప్ సర్కార్ స్ట్రిక్ట్ రూల్స్.. 3 లక్షలకుపైగా వీసాలు రద్దు..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Low Presure in Bay Of Bengal: ఎల్ నినో కరువుతో తెలుగు రాష్ట్రాల్లో నీటి కష్టాలు వచ్చాయి. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రాబోయే రోజుల్లో బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ తుఫాన్ ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో తీరం దాటవచ్చని.. ఇదే జరిగితే భారీ వర్షాలతో నీటి కష్టాలు తీరతాయని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ.

సముద్ర మట్టానికి ఐదు కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ద్రోణి..
ఉత్తర తమిళనాడు తీరానికి సమీపంలో.. నైరుతి బంగాళాఖాతంలో.. సముద్ర మట్టానికి ఐదు కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో అక్టోబర్ 24 లేదా 25 తేదీల్లో అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఈ నెల 27న అండమాన్ దగ్గర అల్ప పీడనం.. 

అక్టోబర్ 27వ తేదీ నాటికి అండమాన్ దగ్గర ఏర్పడే అల్పపీడనం బలపడి..వాయుగుండంగా మారి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని..30వ తేదీ నాటికి ఇది తుపాన్ గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది. ఈ నెల 30వ తేదీ నాటికి తుపాన్ గా మారి.. ఇది కోస్తా ఆంధ్ర నుంచి దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటొచ్చని అంచనా వేస్తుంది వాతావరణ శాఖ.

తుఫాన్‌ ప్రభావంతో తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..
ఇదే జరిగితే ఏపీలోని కోస్తా జిల్లాలు, తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మొత్తంగా ఈ తుపాను ప్రభావంతో ఎల్ నినో కరువు నుంచి తెలుగు రాష్ట్రాలు బయటపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ నిపుణులు. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
AP Weather
Telangana Weather
Weather Update