• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Astro Influencer Defeat: 20 లక్షల మంది ఫాలోవర్లు.. సర్పంచ్ ఎన్నికల్లో ఓట్లు మాత్రం 33.. స్టార్ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు బిగ్ షాక్..!

Astro Influencer Defeat: 20 లక్షల మంది ఫాలోవర్లు.. సర్పంచ్ ఎన్నికల్లో ఓట్లు మాత్రం 33.. స్టార్ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు బిగ్ షాక్..!

Astro Influencer Defeat: సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉంటే ఎన్నికల్లో గెలుపు ఖాయమనుకున్న ఓ ప్రముఖ ఆస్ట్రో-యూట్యూబర్‌కు ఓటర్లు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. కేవలం 33 ఓట్లతో డిపాజిట్ కూడా ఇవ్వలేదు. పూర్తి వివరాలు ఇలా..

Written ByAshok Krindinti
Published: Oct 27, 2026, 02:23 PM IST|Updated: Oct 27, 2026, 02:26 PM IST
joinshare
Astro Influencer Defeat: 20 లక్షల మంది ఫాలోవర్లు.. సర్పంచ్ ఎన్నికల్లో ఓట్లు మాత్రం 33.. స్టార్ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు బిగ్ షాక్..!
Image Credit: Astro Influencer Omprakash Bishnoi (Source: AI)

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
అర్హులైన సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఓటరుగా నమోదు చేసుకోవాలి..!!

అర్హులైన సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఓటరుగా నమోదు చేసుకోవాలి..!!

2

Hyderabad: చెవుల్లో ఇయర్‌ఫోన్లు.. వేగంగా దూసుకొచ్చి వ్యక్తిని ఢీకొన్న రైలు.. షాకింగ్ వీడియో..

3

Kerala: కేరళలో రోడ్డెక్కిన టీచర్ అభ్యర్థులు.. గుండు గీయించుకుని మరీ నిరసన.. వీడియో వైరల్..

4

Astro Influencer Defeat: 20 లక్షల మంది ఫాలోవర్లు.. సర్పంచ్ ఎన్నికల్లో ఓట్లు మాత్రం 33.. స్టార్ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు బిగ్ షాక్..!

5

ఎవరొచ్చినా చూసుకుందాం..షర్ట్ మడతబెట్టా.. పులివెందులలో జగన్ మాస్ వార్నింగ్..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Astro Influencer Defeat: సోషల్ మీడియాలో 20 లక్షల మంది ఉన్న ప్రముఖ ఆస్ట్రో-యూట్యూబర్‌ ఓంప్రకాష్ బిష్ణోయ్‌కు ఓటర్లు బిగ్ షాక్ ఇచ్చారు. రాజస్థాన్‌లోని పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయనకు కేవలం 33 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో అందరి భవిష్యత్తు చెప్పే జ్యోతిష్యుడు.. తన భవిష్యత్‌ను సరిగా అంచనా వేసుకోలేకపోయారంటూ సోషల్ మీడియా కామెంట్స్ వస్తున్నాయి. జోధ్‌పూర్ జిల్లా ఓసియాన్ తహసీల్ పరిధిలోని ఇండోన్ కీ ధానీ-2 గ్రామ పంచాయతీలో ఇటీవల సర్పంచ్ ఎన్నికలు జరిగాయి.

ఈ ఎన్నికల్లో స్థానిక గ్రామస్తుడు, ప్రసిద్ధ జ్యోతిష్య నిపుణుడు, యూట్యూబర్ అయిన ఓంప్రకాష్ బిష్ణోయ్ బరిలోకి దిగారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయనకు 14 లక్షల మందికి పైగా ఫాలోవర్లు, యూట్యూబ్‌లో 5.5 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు, ఫేస్‌బుక్‌లో 2.3 లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు. తనకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్‌తో ఎన్నికల్లో విజయంపై ధీమాతో ఎన్నికల బరిలో నిలిచాడు. అంతేకాదు స్థానిక గోశాల అధ్యక్షుడిగా కూడా కొనసాగుతుండటం.. సొంత పంచాయతీనే కావడంతో గ్రామస్థులంతా తనకే పట్టాం కడతాడరని అనుకున్నాడు.

అయితే ఫలితాలు వెల్లడయ్యేసరికి ఓంప్రకాష్ బిష్ణోయ్‌తోపాటు నెటిజన్లు కూడా అవాక్కయ్యారు. దాదాపు 1,600 మంది ఓటర్లు ఉన్న ఆ పంచాయతీలో బిష్ణోయ్‌కు వచ్చినవి అక్షరాలా కేవలం 33 ఓట్లు మాత్రమే. దీంతో ఆయన డిపాజిట్ కూడా గల్లంతయింది. ఎదుటివారి ముఖం చూసి వారి జాతకం, భవిష్యత్తు చెప్పే ఈ ఆస్ట్రో-ఇన్‌ఫ్లుయెన్సర్.. తన సొంత ఎన్నికల పరాభవాన్ని ముందే పసిగట్టలేక పోయాడంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్‌తో ఆడుకుంటున్నారు.

ఈ ఘోర పరాజయంపై ఓంప్రకాష్ బిష్ణోయ్ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా స్పందించారు. ప్రజల ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన హిందీ సామెత "దివ్వె కిందనే చీకటి" (చిరాగ్ తలే అంధేరా)ను ఉటంకిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నా సొంత గ్రామంలోని ప్రజల నమ్మకాన్ని పొందలేకపోయానని అన్నారు. ఈ ఫలితంతో సోషల్ మీడియా లైకులు, కామెంట్లు గ్రౌండ్ లెవల్‌లో ప్రజల నమ్మకానికి ప్రత్యామ్నాయం కాదని నెటిజన్లు అంటున్నారు. సోషల్ మీడియాలో ఫాలోవర్స్‌ను నమ్ముకుని ఎన్నికల్లో పోటీ చేస్తే రిజల్ట్ ఇలానే ఉంటుందని అంటున్నారు. 

Add Zee News as a Preferred Source
TAGS:
Viral News
Elections
National News