)
AP MPTC ZPTC Election counting Live Updates:గిద్దలూరు, రాచర్ల 'ZPTC, MPTC' పోస్టల్ బ్యాలెట్లలో 'టీడీపీ' ముందంజ..!
ముసునూరు ZPTC పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ ఆధిక్యం.
జగ్గంపేట ZPTC పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ ముందంజ.
కంభం MPTC పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ ముందంజ.
బేస్తవారిపేట MPTC పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ ఆధిక్యం.
AP MPTC ZPTC Election counting Live Updates:కాకినాడ జిల్లాలోని కాకినాడ, పెద్దాపురం ఓట్ల లెక్కింపు కార్యక్రమం తీవ్ర జాప్యం జరుగుతోంది. పెద్దాపురంలో ఆలస్యంగా స్ట్రాంగ్ రూముల నుంచి బ్యాలెట్ బాక్సులు తీసుకొచ్చారు.కాకినాడ కేంద్రంలో అధికారులు ఆలస్యంగా రావడంతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాలేదు
వాయిస్: కాకినాడ పిఆర్ కళాశాల, పెద్దాపురం మహారాణి కళాశాల ప్రాంగణంలో ఓట్ల లెక్కింపు కోసం అభ్యర్థులు ,ఏజెంట్లు తరలివచ్చారు. అయితే రెండు చోట్ల కూడా తీవ్ర జాప్యం జరుగుతోంది
ఉదయం 9 దాటినఆ ఇప్పటికీ బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేయలేదు. కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ స్వయంగా మైకులు తీసుకుని జనాన్ని అదుపు చేసే ప్రయత్నం చేశారు.
AP MPTC ZPTC Election counting Live Updates:మచిలీపట్నం నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడంపై మంత్రి కొల్లు రవీంద్ర అందం వ్యక్తం చేశారు. తొలిసారిగా మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగిన టీడీపీ అభ్యర్థి అబ్దుల్ అభిదా 32,657 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం ఎంతో విశేషమన్నారు. అలాగే నగరంలోని పలు డివిజన్లలోనూ కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందడంపై సంతోషం గా ఉంది అన్నారు . మరోవైపు ఈరోజు జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి మరోసారి కూడా కూటమి అభ్యర్థులే గెలుస్తారు. అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అంటున్న
AP MPTC ZPTC Election counting Live Updates:నెల్లూరు.. అనంతసాగరం మండలం జడ్పిటిసి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు పూర్తి.
ముందంజలో టిడిపి.
టిడిపి : 85
వైసిపి : 45
బిఎస్పీ : 01
తిరస్కరణ : 02
AP MPTC ZPTC Election counting Live Updates:కాకినాడ పి ఆర్ కళాశాల ,పెద్దాపురం మహారాణి కళాశాల వద్ద కౌంటింగ్ కి సంబంధించి పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారుఅయితే రాజకీయ నాయకుల తరహాలో మీడియాను గాలికి వదిలేయడం ,కలెక్టర్ పేరిట ఆ శాఖ డిడి ఆదేసాలు అంటూ మీడియాపై అంక్షాలు పెట్టడంతో మీడియా ప్రతినిధులు బయట పడిగాపులు కడుతున్న పరిస్థితి కనపడుతుంది అభ్యర్థుల కుక్లియరెన్స్ వస్తే తప్ప లోనికి పంపమని స్పష్టం చేయడంతో ఒక్కసారిగా కిక్కిరిసిన వాతావరణం కూడా కనిపిస్తోంది .కాకినాడ డిఎస్పి దుర్గారావు ఆధ్వర్యంలో కాకినాడ కౌంటింగ్ కేంద్ర పరిస్థితులు మా ప్రతినిధి సాంబశివరావు వివరిస్తారు
AP MPTC ZPTC Election counting Live Updates:ఆరు కౌంటింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి
కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు
352 కౌంటింగ్ టేబుళ్లు, 386 మంది సూపర్‌వైజర్లు, 1,158 మంది సిబ్బంది నియామకం
కౌంటింగ్ విధుల్లో 1,591 మంది పోలీసు సిబ్బంది
35 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా, ఐదు స్థానాలు ఏకగ్రీవం..మిగిలిన 30 స్థానాలకు 103 మంది అభ్యర్థులు బరిలో..
440 ఎంపీటీసీ స్థానాలకు గాను 78 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 362 స్థానాలకు ఎన్నికలు..
ఆత్మకూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మర్రిపాడు, సంగం, ఆత్మకూరు, అనంతసాగరం, అనుమసముద్రంపేట, చేజర్ల, కలువాయి మండలాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు
కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని జీవనజ్యోతి జూనియర్ కళాశాలలో కొవ్వూరు, కొడవలూరు, విడవలూరు, బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరుపేట మండలాల ఓట్ల లెక్కింపు
ఉదయగిరిలోని మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ కళాశాలలో సీతారామపురం, ఉదయగిరి, వరికుంటపాడు, దుత్తలూరు మండలాల ఓట్ల లెక్కింపు .
కావలిలోని పీబీఆర్ విశ్వోదయ ఇంజినీరింగ్ కళాశాలలో విన్జమూరు, కలిగిరి, కొండాపురం, కావలి, జలదంకి, బోగోలు, దగదర్తి, అల్లూరు మండలాల ఓట్ల లెక్కింపు .
గూడూరులోని ఎస్‌వీ ఆర్ట్స్ అండ్ డిగ్రీ కళాశాలలో రాపూరు, సైదాపురం, గూడూరు, చిల్లకూరు, కోట మండలాల ఓట్ల లెక్కింపు
నెల్లూరులోని వీఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీజీ స్టడీస్‌లో టీపీ గూడూరు, నెల్లూరు రూరల్, వెంకటాచలం, ముత్తుకూరు, పొదలకూరు, మనుబోలు మండలాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు
కౌంటింగ్ ప్రక్రియ కోసం మొత్తం 352 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు,
లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకు 386 మంది సూపర్‌వైజర్లు, 1,158 మంది కౌంటింగ్ సిబ్బంది నియామకం.
ఎన్నికల కౌంటింగ్ విధుల కోసం మొత్తం 1,591 మంది పోలీసు సిబ్బంది.. వీరిలో 8 మంది డీఎస్పీలు, 35 మంది సీఐలు, 83 మంది ఎస్ఐలు, 765 మంది కానిస్టేబుళ్లు, 700 మంది ఇతర పోలీసు సిబ్బంది.
AP MPTC ZPTC Election counting Live Updates:కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ పోలీసు బందోబస్తు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల అప్రమత్తత.
కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లో భద్రతా చర్యలు.
అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు మాత్రమే అనుమతి.
కౌంటింగ్ కేంద్రం వద్దకు భారీగా చేరుకుంటున్న అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు.
ఓట్ల లెక్కింపు ప్రారంభం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు.
కౌంటింగ్ ఫలితాలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ.
విజువుల్స్….
AP MPTC ZPTC Election counting Live Updates:జంగారెడ్డిగూడెం..కౌంటింగ్ కేంద్రం వద్ద భద్రత కట్టుదిట్టం పోలవరం
డీఎస్పీ రవిచంద్ర పర్యవేక్షణ
జిల్లాలో 27 జడ్పీటీసీ స్థానాలు - పెదవేగి (చింతమనేని సాయి నవ్యశ్రీ) ఏకగ్రీవం, 26 స్థానాలకు లెక్కింపు
454 ఎంపీటీసీ స్థానాల్లో 13 ఏకగ్రీవం - 441 స్థానాలకు లెక్కింపు (పోటీలో 1,018 మంది అభ్యర్థులు)
ఒక్కో మండలంలో ఒకే రౌండ్‌లో ఎంపీటీసీల లెక్కింపు ప్రక్రియ
మధ్యాహ్నం 2 గంటలకు ఎంపీటీసీ ఫలితాలు వెల్లడయ్యే అవకాశం
AP MPTC ZPTC Election counting Live Updates:తూర్పుగోదావరి జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.
రాజమండ్రి డివిజన్ కు సంబంధించి
ఆదికవి నన్నయ యూనివర్సిటీలో 12 హాల్స్ లో 20 టేబుల్స్
ఏర్పాటు చేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా కౌంటింగ్ జరిగేలా అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. ముందుగా ఎంపీటీసీ...
తర్వాత జెడ్పీటీసీ లెక్కింపు నిర్వహిస్తారు.
పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో నిఘా సహా
పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 19 జెడ్పీటీసీ...
372 ఎంపీటీసీ లెక్కింపు సంబంధించి
అమలాపురం... కొత్తపేట... రామచంద్రపురంలో
కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 369 టేబుల్స్ పై
లెక్కింపు జరగనుంది.
పోలవరం జిల్లా
రంపచోడవరం ఏజెన్సీలో 12 జెడ్పీటీసీ...
101 ఎంపీటీసీ స్థానాలకు నాలుగు చోట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 202
టేబుల్స్ పై కౌంటింగ్ జరగనుంది.
మునిసిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన పోలింగ్ కావడంతో ఏకపక్షంగా ఉంటుందని కూటమి శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు.
జిల్లా పరిషత్ చైర్మన్లుగా
ఎవరికి ఛాన్స్ వస్తుందనే
ఆసక్తి నెలకొంది.
అయితే గ్రామీణ ప్రాంత ఓటర్లు తీర్పు పై వైసీపీ అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు. వైసీపీ
శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న
గ్రామాల్లో
పోటీ హోరాహోరీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఫలితాలపై గ్రామాల్లో బెట్టింగులు కూడా జరిగాయి.
AP MPTC ZPTC Election counting Live Updates:తిరుపతి జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్
తిరుపతిలోని ఎస్జీఎస్ కళాశాలలో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది
ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన అధికారులు..
అనంతరం బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్ల లెక్కింపును చేపట్టారు..
కౌంటింగ్ ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు..
కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ పోలీసు భద్రత ఏర్పాటు చేశారు..
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు..
కౌంటింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు..
కౌంటింగ్ కేంద్రం వద్దకు అనుమతి ఉన్న వ్యక్తులను మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు..
అభ్యర్థులు, వారి ఏజెంట్లు నిబంధనలకు అనుగుణంగా కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు..
జిల్లాలో పరిషత్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.. అభ్యర్థుల భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలనుంది..
AP MPTC ZPTC Election counting Live Updates:ఎంపీటీసీ జడ్పిటిసి ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి.....
నందిగామ నియోజకవర్గంలోని శనివారం జరగనున్న నాలుగు మండలాల ఎంపీటీసీ జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.....
నందిగామ లోని కెవిఆర్ కళాశాలలో కంచికచర్ల లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనంలో లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు.....
ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు.....
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు..
Counting Updates District Wise Winners List: ప్రశాంతంగా కౌంటింగ్ నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి
- ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానున్న కౌంటింగ్
- రాష్ట్రవ్యాప్తంగా 365 కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు
- 9,062 కౌంటింగ్ టేబుళ్లపై ఓట్ల లెక్కింపు
- తొలుత పోస్టల్ బ్యాలెట్లు.. ఆ తర్వాత సాధారణ ఓట్ల లెక్కింపు
- 77 జెడ్పీటీసీ, 2,051 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం
- 577 జెడ్పీటీసీ, 7,707 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్
- ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 70.72 శాతం పోలింగ్
- 2021 ఎన్నికలతో పోలిస్తే 9.81 శాతం పెరిగిన పోలింగ్
- కౌంటింగ్ కేంద్రాల వద్ద 19,885 మంది పోలీసులతో భద్రత
- మూడు అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు
- సున్నిత ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా
- పోలీసుల బాడీ వోర్న్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ.
AP MPTC ZPTC Election counting Live Updates:ఆంధ్ర ప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే బ్యాలెట్ పేపర్స్ ఉన్న బాక్సులున్న కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతా బలగాలు గట్టి కాపాలా ఉంచారు. మరోవైపు ఎలక్షన్ కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈసీ అన్ని ఏర్పాటు పూర్తి చేసింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోని 365 కేంద్రాల్లో ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఆయా జిల్లాల్లో కౌంటింగ్ కేంద్రాల్లో కలెక్టర్, ఎస్పీ, అదనపు ఎస్పీలు తనిఖీలు నిర్వహించారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఏపీ వ్యాప్తంగా 582 ZPTC, 7767 MPTC స్థానాలకు ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే కదా. ఈ ఎన్నికల్లో 70.72 శాతం పోలింగ్ నమోదు అయింది. కొన్ని చెదురు మొదురు సంఘటనలు మినహా ఎన్నికలు మొత్తం ప్రశాంతంగా జరిగాయి. అయితే ఇప్పటికే 77 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మరోవైపు 2051 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు లేకుండా ఏకగ్రీవం కావడం గమనార్హం. మిగిలిన స్థానాలకు పోలీ చేసిన 21 వేల 12 మంది అభ్యర్ధుల భవిత్యం మరికాసేట్లో తేలనుంది. 2 కోట్ల 61 లక్షల 52 వేల 377 మంది ఓటర్లున్న ఈ ఎన్నికల్లో ఒక కోటి 85 లక్షల మంది ఓటు హక్కను వినియోగించుకున్నట్టు అధికారులు తెలిపారు.